BigTV English
Advertisement

Pushpa 2 Stampede : రేవతి మృ‌తికి మాకు సంబంధం లేదు… డిస్ట్రిబ్యూటర్స్‌దే బాధ్యత

Pushpa 2 Stampede : రేవతి మృ‌తికి మాకు సంబంధం లేదు… డిస్ట్రిబ్యూటర్స్‌దే బాధ్యత

Pushpa 2 Stampede : ‘పుష్ప 2’ మూవీ ప్రీమియర్ షో టైంలో సంధ్య థియేటర్ వద్ద ఆపశృతి చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్య థియేటర్లో అల్లు అర్జున్ సినిమాను చూడడానికి రావడంతో, అభిమానులు భారీ సంఖ్యలో ఆయనను చూడడానికి ఎగబడ్డారు. దీంతో ఒక్కసారిగా తోపులాట జరగడంతో పోలీసులు వారిని చెదరగొట్టేందుకు ఛార్జ్ చేశారు. ఈ నేపథ్యంలోనే రేవతి అనే మహిళ ఈ సంఘటనలో మృతి చెందగా, ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. దీంతో పోలీసులు తొక్కిసలాటకు కారణం అంటూ అల్లు అర్జున్ తో పాటు సంధ్య థియేటర్ ఓనర్ పై కూడా కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే తాజాగా సంధ్య థియేటర్ ఓనర్ తొక్కిసలాటతో మాకేంటి సంబంధం? అంటూ తాజాగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్టుగా తెలుస్తోంది.


‘పుష్ప 2’ (Pushpa 2) బెనిఫిట్ షోలో జరిగిన ఈ అనుకోని సంఘటన కారణంగా ఓ కుటుంబంలో కోలుకొని విషాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనపై చిక్కడ పల్లి పోలీసులు కేసు నమోదు చేయగా, తొక్కిసలాటకు కారణమైన ముగ్గురిని అరెస్ట్ చేశారు. సంధ్య థియేటర్ ఓనర్, మేనేజర్, సెక్యూరిటీ మేనేజర్లను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు. ఈ నేపథ్యంలోనే తాజాగా సంధ్య థియేటర్ ఓనర్ ‘సంఘటనతో మాకేంటి సంబంధం ?’ అంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం హాట్ టాపిక్ గా మారింది.

“పుష్ప 2 (Pushpa 2)మూవీ ప్రీమియర్ షోలో రేవతి మృతికి, మాకు ఎలాంటి సంబంధం లేదు” అంటూ థియేటర్ ఓనర్ రేణుకా దేవి పిటిషన్ దాఖలు చేసినట్టుగా తెలుస్తోంది. ఆ పిటిషన్ లో ప్రీమియర్ షో, బెనిఫిట్ షోలకు ప్రభుత్వమే అనుమతినిచ్చిందని గుర్తు చేసిన ఆమె… పైగా ప్రీమియర్ షోలను తామేమి నిర్వహించలేదని వెల్లడించారు. ఆ షోను డిస్ట్రిబ్యూటర్లే నిర్వహించారని క్లారిటీ రేణుకా దేవి వివరించారు. అయినప్పటికీ తమ బాధ్యతగా బందోబస్తు కల్పించామని, కానీ తమపై తీవ్రమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం అన్యాయం అని ఆ పిటిషన్ లో రేణుకా దేవి పేర్కొన్నారు.


ఇక ఈ కేసులో అల్లు అర్జున్ (Allu Arjun) పై కూడా కేసు నమోదు అయింది. అయితే మృతి చెందిన మహిళ కుటుంబానికి అల్లు అర్జున్ రీసెంట్ గా రూ.25 లక్షల సాయం ప్రకటించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఆమె కుటుంబానికి తను అన్ని విధాలుగా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. మరోవైపు ఈ ఘటనపై మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు అందింది. పోలీసులు అనుమతులు లేకుండానే ప్రీమియర్ షో వేశారని హీరో అల్లు అర్జున్ పైన అధికారుల పైన చర్యలు తీసుకోవాలంటూ రవికుమార్ అనే న్యాయవాది ఫిర్యాదును దాఖలు చేశారు. సంధ్య థియేటర్ యాజమాన్యం తగిన భద్రత ఏర్పాటు చేయడంలో విఫలమైందని తన ఫిర్యాదులో న్యాయవాది రవికుమార్ పేర్కొన్నారు. ఇక ఇప్పుడు ఈ తొక్కిసలాట వివాదంపై సంధ్య థియేటర్ ఓనర్ డిస్ట్రిబ్యూటర్ల వైపు వేలు చూపించడంతో, దీనిపై డిస్ట్రిబ్యూటర్లు ఎలా రియాక్ట్ అవుతారు అన్నది ఆసక్తికరంగా మారింది. అంతేకాకుండా ఈ వివాదంపై కోర్టు తీర్పు ఎలా ఉండబోతోంది అని ఎదురు చూస్తున్నారు. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం రేవతి మృతి తరువాత రాష్ట్రంలో బెనిఫిట్ షోలను రద్దు చేసింది.

Tags

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×