BigTV English

Sama Ram Mohan reddy: కేసీఆర్ ను టార్గెట్ చేస్తున్న కేటీఆర్.. అలా అనొద్దు ప్లీజ్.. సామా రామ్మోహన్ రెడ్డి

Sama Ram Mohan reddy: కేసీఆర్ ను టార్గెట్ చేస్తున్న కేటీఆర్.. అలా అనొద్దు ప్లీజ్.. సామా రామ్మోహన్ రెడ్డి

Sama Ram Mohan reddy: మాజీ సీఎం కేసీఆర్ లక్ష్యంగా కేటీఆర్ కామెంట్స్ చేస్తున్నారు. అలా అనడం నాకు నచ్చడం లేదు. కేటీఆర్ ఇప్పటికైనా ఆ మాటలు మానుకో అంటూ.. టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి తాజాగా కేటీఆర్ ను ఉద్దేశించి కామెంట్స్ చేశారు. అసలు కేసీఆర్ లక్ష్యంగా కేటీఆర్ కామెంట్స్ చేశారో లేదో కానీ, సామా చేసిన కామెంట్స్ మాత్రం ఇప్పుడు వైరల్ గా మారాయి.


ఇటీవల తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించి అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. తెలంగాణ తల్లి విగ్రహంపై ఎవరైనా అవాస్తవాలు ప్రచారం చేస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ మాత్రం ఒక్క అడుగు కూడా వెనుకడుగు వేయకుండా విమర్శల పర్వం సాగిస్తోంది. ఈ విమర్శలపై టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి స్పందించారు.

సామా మాట్లాడుతూ.. కేటీఆర్ తెలంగాణ తల్లి విగ్రహం పై, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పై దిగజారి మాట్లాడుతున్నారని అటువంటి కామెంట్స్ పట్టించుకొనే స్థితిలో ప్రజలు లేరన్నారు. బీఆర్ఎస్ పరిస్థితి రోజురోజుకీ దిగజారి పోవడానికి కారణం మాత్రం కేటీఆర్ అంటూ సామా విమర్శలు గుప్పించారు. కేటీఆర్ మాట్లాడే మాటలకు కేసీఆర్ కృంగిపోతున్నారని, కేటీఆర్ మమ్మల్ని గురిపెట్టి చేసే విమర్శలన్నీ కేసీఆర్ కు తగులుతున్నాయన్నారు. కేటీఆర్ మాట్లాడుతున్న మాటలు దుర్గంధంగా తయారయ్యారని, ఈ మాటలను స్వయంగా కేసీఆర్ కూడా ఒప్పుకోని పరిస్థితి ఉందన్నారు.


భార్యను మారుస్తారు గాని తల్లిని మారుస్తారా అంటూ కేటీఆర్ అనడం చూస్తుంటే, ఆ విషయం కేసీఆర్ లక్ష్యంగా కేటీఆర్ అడుగుతున్నట్లు ఉందని సామా అభిప్రాయపడ్డారు. కేటిఆర్, కవిత ఇద్దరూ కలిసి తెలంగాణ తల్లిని ఆఫ్రికా తల్లి అంటున్నారని, కవితను ప్రపంచమంతా లిక్కర్ రాణి అంటున్నారన్న విషయాన్ని కవిత గుర్తు పెట్టుకోవాలన్నారు. మీకు తెలంగాణకు ఎటువంటి సంబంధం లేదని, ఆ బంధం మీ పార్టీని భారత రాష్ట్ర సమితిగా మార్చినప్పుడే పోయిందన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి అంటూ పార్టీకి నామకరణం ఉండడమే నామోషీగా ఫీల్ అయ్యారని, ఇప్పుడు అధికారికంగా తెలంగాణ తల్లి రూపాన్ని ప్రకటిస్తే ఓర్వలేని రాజకీయాలకు కేటీఆర్ తెర తీస్తున్నట్లు తెలిపారు.

Also Read: Manchu Vishnu : జర్నలిస్ట్ పై మోహన్ బాబు దాడి… వివాదానికి ఆజ్యం పోసిన విష్ణు కామెంట్స్

పదేళ్ల కాలంలో ఏనాడూ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఎందుకు రాలేదని, అధికారికంగా ప్రకటన ఇచ్చారా అంటూ సామా ప్రశ్నించారు. ఉద్యమ సమయంలో యువకులు ఛాతీ మీద TG అని రాసుకుంటే అధికారంలోకి వచ్చాక TS అని ఎందుకు పెట్టారంటూ సూటిగా అడిగారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని యావత్ తెలంగాణ ప్రజలు హర్షిస్తున్నారని, కేవలం కల్వకుంట్ల కుటుంబం, వాళ్ళ గడిలలో ఉన్న వాళ్ళు మాత్రమే వ్యతికేస్తున్నారని సీరియస్ అయ్యారు. మీ డ్రామాలను, వేషాలను తెలంగాణ సమాజం గమనిస్తుందని, మీరు మాట్లాడే ప్రతి మాటను అసెంబ్లీ వేదికగా తిప్పికొడతామని సామా రామ్మోహన్ రెడ్డి అన్నారు.

Related News

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Phone Tapping Case: ప్రూఫ్స్‌తో సహా.. ఉన్నదంతా బయటపెడ్తా.. సిట్ విచారణకు ముందు బండి షాకింగ్ కామెంట్స్

Hyderabad Drugs: హైదరాబాద్‌‌ డ్రగ్స్‌ ఉచ్చులో డాక్టర్లు.. 26 లక్షల విలువైన?

Big Stories

×