BigTV English

Pushpa 2 : 23 ఏళ్ల పవన్ రికార్డును బ్రేక్ చేసిన బన్నీ… ఏ థియేటర్లో అంటే?

Pushpa 2 : 23 ఏళ్ల పవన్ రికార్డును బ్రేక్ చేసిన బన్నీ… ఏ థియేటర్లో అంటే?

Pushpa 2 : హైదరాబాద్లోని ఐకానిక్ థియేటర్ సంధ్య 70 ఎంఎంలో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నెలకొల్పిన అల్లు అర్జున్ (Allu Arjun) తిరగ రాశారు. గత 23 ఏళ్లుగా చెక్కు చెదరకుండా ఉన్న ఆ రికార్డును ‘పుష్ప 2’ (Pushpa 2) మూవీతో అల్లు అర్జున్ బ్రేక్ చేయడం విశేషం.


క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన పాన్ ఇండియా మూవీ ‘పుష్ప 2’ (Pushpa 2) మేనియా ఇంకా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ థియేటర్లలో ప్రేక్షకులకు పూనకాలు తెప్పిస్తోంది. ఫలితంగా మూవీ రిలీజ్ అయ్యి నాలుగు వారాలు పూర్తవుతున్నప్పటికీ ఈ మూవీకి వస్తున్న రెస్పాన్స్ ఏమాత్రం తగ్గట్లేదు. తాజాగా ‘పుష్ప 2’ మూవీ నాలుగు వారాల్లోనే సంధ్య థియేటర్లో రూ.1.59 కోట్లకు పైగా కలెక్షన్లు కొల్లగొట్టి, గత 23 ఏళ్లుగా ఉన్న పవన్ కళ్యాణ్ రికార్డును గల్లంతు చేసింది.

2001లో ‘ఖుషి’ (Khushi) మూవీతో పవన్ కళ్యాణ్ సంధ్య థియేటర్ దగ్గర అరుదైన రికార్డును క్రియేట్ చేశారు. అప్పట్లోనే పవన్ కళ్యాణ్ రూ.1.53 కోట్లు ఈ సంధ్య థియేటర్లో రాబట్టారు. తాజాగా ‘పుష్ప 2’ (Pushpa 2) మూవీతో అల్లు అర్జున్ ఈ రికార్డును బ్రేక్ చేసినప్పటికీ, ‘ఖుషి’ ఇప్పటికీ సంధ్య థియేటర్ చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. ఎందుకంటే దానికి ప్రత్యేకమైన కారణాలే ఉన్నాయి. ‘ఖుషి’ మూవీ 2000ల మొదట్లోనే రిలీజ్ అయింది. అప్పట్లో క్యూలో నిలబడి టికెట్లు తీసుకోవాల్సి ఉండేది. ముందు వరస నుంచి బాల్కనీ వరకు టికెట్ ధరలు రూ.5 నుంచి రూ. 50 వరకు ఉండేవి. ప్రీమియర్ల కోసం అప్పట్లో అధికారుల నుంచి అనుమతి లేదు. అంతేకాకుండా అప్పట్లో థియేటర్ల దగ్గర బ్లాక్ లో టికెట్లు అమ్మడం కూడా సాధారణ విషయమే. అయితే ఇవేవీ అప్పట్లో ‘ఖుషి’ మూవీ బాక్స్ ఆఫీస్ కలెక్షన్లకు యాడ్ అవ్వలేదు. ఫలితంగా ఆ సమయంలో కేవలం అధికారిక కలెక్షన్లు మాత్రమే నమోదు అయ్యాయి.


కానీ ఇప్పటి పరిస్థితి వేరు. ‘పుష్ప 2’ సినిమా కోసం టికెట్ ధరలు గతంలో ఎన్నడూ లేని విధంగా పెరిగాయి. బెనిఫిట్ షోలకైతే ఏకంగా రూ.900 నుంచి రూ. 1500 పైనే ఉన్నాయి. ఇక సాధారణ టికెట్ ధర ఫస్ట్ క్లాస్ సీట్లకు 250 నుంచి, మల్టీప్లెక్స్ లలో 500 దాకా చేరింది. ఫలితంగా ఈ మూవీ రికార్డులను బ్రేక్ చేసింది. అయితే ఇప్పుడు ‘ఖుషి’ మూవీ రికార్డును ‘పుష్ప 2’ బ్రేక్ చేసినప్పటికీ, పరిస్థితుల దృష్ట్యా దేని రికార్డు దానికే అన్నట్టుగా ఉంటుంది. ఇక సంధ్య థియేటర్ మెగా సినిమాలకు బలమైన కోటగా చెప్పుకుంటారు. ఇలాంటి థియేటర్లో ‘పుష్ప 2’ ఈ ఫీట్ ను సాధించడం మేకర్స్ కి గర్వకారణం అని చెప్పాలి.

ఇదిలా ఉండగా మరోవైపు అల్లు అర్జున్ సంధ్య థియేటర్ దగ్గర జరిగిన వివాదంతోనే సమస్యల్లో పడిన సంగతి తెలిసిందే. ‘పుష్ప 2’ (Pushpa 2) ప్రీమియర్ల సందర్భంగా ఇదే సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట జరగ్గా, రేవతి అనే మహిళా ప్రాణాలు కోల్పోయింది. దీంతో అల్లు అర్జున్ పై కేసు నమోదు కాగా, విచారణ జరుగుతోంది.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×