Allu Arjun: ఒకే ఇంట్లో ఇద్దరు చిన్నపిల్లలు ఉంటే.. ఒకడు ఏది చేస్తే రెండోవాడు అదే చేస్తాను అని పట్టుపడతాడు. ఇప్పుడు ఇండస్ట్రీలో కూడా రామ్ చరణ్ – అల్లు అర్జున్ విషయంలో అదే జరుగుతుందని చెప్పుకొస్తున్నారు నెటిజన్స్. రామ్ చరణ్ ఏది చేస్తే.. అల్లు అర్జున్ అదే చేస్తానని పట్టుబడుతున్నట్లు ఉంటుంది. మొదటి నుంచి కూడా బన్నీ.. చరణ్ ను కాపీ కొడుతున్నాడు అంటే కొంతమంది నిజమే అంటారు.
లుక్, డ్యాన్స్, పాన్ ఇండియా మూవీస్, ట్యాగ్స్.. ఇలా ఇవన్నీ చరణ్ తరువాత బన్నీ స్టార్ట్ చేశాయి అని చెప్పుకొస్తున్నారు. ఆర్ఆర్ఆర్ తరువాత గ్లోబల్ స్టార్ గా చరణ్ మారాడు. ఇక అదే గ్లోబల్ ఇమేజ్ ను బన్నీ కూడా అందుకోవాలనుకున్నాడు. దానికోసం బన్నీ చాలా కష్టపడుతున్నాడు. పుష్ప దగ్గరనుంచి ఐకాన్ స్టార్ గా మారిన బన్నీ.. పుష్ప 2 తో గ్లోబల్ స్టార్ గా మారాలనుకుంటున్నాడు. ఇలా ప్రతి విషయంలో కూడా చరణ్ ను కాపీ కొడుతున్న బన్నీ.. ఇప్పుడు పుష్ప 2 ట్రైలర్ విషయంలో కూడా గ్లోబల్ స్టార్ నే ఫాలో అవుతున్నాడు.
Sai Dharam Tej: సింగిల్స్ డే.. ఒక వర్గానికి నువ్వు ఇన్స్పిరేషన్ బ్రో..
అసలు విషయం ఏంటంటే.. ఈ మధ్యనే రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ టీజర్ లక్నోలో రిలీజ్ చేసిన విషయం తెల్సిందే. ఒకప్పుడు ట్రైలర్స్ రిలీజ్ చేయాలంటే.. నార్మల్ గా యూట్యూబ్ లో రిలీజ్ చేసేవాళ్ళు. ఆ తరువాత టీజర్, ట్రైలర్ రిలీజ్ ను ఒక ఈవెంట్ లా మార్చారు. ఇక ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ కూడా ఒక పెద్ద పండగలా చేస్తున్నారు. గేమ్ ఛేంజర్ ఈసారి కొత్త ట్రెండ్ ను సెట్ చేశాడు. అదేంటంటే.. మన రాష్ట్రంలో కాకుండా వేరే రాష్టంలో టీజర్ ఈవెంట్ ను నిర్వహించారు. నవంబర్ 9న ఈ టీజర్ ఈవెంట్ లక్నోలో ఘనంగా జరిగింది.
గేమ్ ఛేంజర్ పాన్ ఇండియా సినిమా. అందులోనూ డైరెక్టర్ శంకర్ మొదటి తెలుగు సినిమా. ఆర్ఆర్ఆర్ తరువాత చరణ్ సోలో హీరోగా నటిస్తున్న సినిమా. ఇలా ఈ చిత్రంపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఇక రాజమౌళి సెంటిమెంట్ ఒకపక్క.. శంకర్ భారతీయుడు 2 డిజాస్టర్ ఇంకోపక్క. ఇవన్నీ అధిగమించాలి అంటే ప్రమోషన్స్ చాలా అంటే చాలా ముఖ్యం. అందుకే నిర్మాత దిల్ రాజు భారీ స్కెచ్ వేసి.. దేశం మొత్తం ప్రమోషన్స్ మొదలుపెట్టాడు. జనవరి 10 న రిలీజ్ వరకు గేమ్ ఛేంజర్ ప్రమోషన్స్ నిరంతరాయంగా జరుగుతూనే ఉంటాయి.
Pushpa Movie trailer update: పుష్ప ట్రైలర్ రిలీజ్ అయ్యేది అప్పుడే, బన్నీ ఫ్యాన్స్ కి పూనకాలే
ఇక ప్రమోషన్స్ కు ఆద్యంగా టీజర్ ను ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో రిలీజ్ చేశారు. అక్కడనుంచి మొదలుపెట్టి.. చివరి ప్రమోషన్ తిరుపతి వరకు దిల్ రాజు షెడ్యూల్ చేసి పెట్టుకున్నాడు. దీనికోసమే గేమ్ ఛేంజర్ టీజర్ ను లక్నోలో రిలీజ్ చేశారని టాక్. ఇక ఇప్పుడు అదే ఫంథాలో అల్లు అర్జున్ వెళ్తున్నాడు. అంటే చరణ్ తరువాత ఇంకెవరైనా ఇలా చేస్తే ఎవరు ఏమి అనేవాళ్ళు కాదేమో కానీ.. గేమ్ ఛేంజర్ టీజర్ రిలీజ్ వెంటనే పుష్ప 2 ట్రైలర్.. పాట్నాలో రిలీజ్ చేస్తున్నామని మేకర్స్ అధికారికంగా ప్రకటించడంతో.. చరణ్ ను కాపీ కొడుతున్న బన్నీ అని ట్రోల్స్ మొదలయ్యాయి.
పుష్ప తోనే ఐకాన్ స్టార్ గా మారిన బన్నీ.. పుష్ప 2 కోసం ఎంత కష్టపడ్డాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన మొదటి పార్ట్ పాన్ ఇండియా రేంజ్ లో హిట్ అయ్యింది. నేషనల్ అవార్డును బన్నీకి అందజేసేలా చేసింది. దానిమీద ఉన్న హైప్ తోనే సీక్వెల్ కోసం ఫ్యాన్స్ వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. డిసెంబర్ 5 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. పాన్ ఇండియా సినిమా కాబట్టి వీళ్లు కూడా దేశం మొత్తం ప్రమోషన్స్ చేయడం కోసం పాట్నాలో ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. మరి ఈ ట్రైలర్ తో బన్నీ ఎలాంటి రికార్డులు బద్దలుకొడతాడో చూడాలి.