BigTV English

Pushpa 3 Update : మూడో పార్ట్ కన్ఫర్మ్… టైటిల్‌ని కూడా రివీల్ చేశారు..!

Pushpa 3 Update : మూడో పార్ట్ కన్ఫర్మ్… టైటిల్‌ని కూడా రివీల్ చేశారు..!

Pushpa 3 Update : అల్లు అర్జున్(Allu Arjun)- సుకుమార్( Sukumar)కాంబినేషన్లో 2021లో విడుదలైన చిత్రం పుష్ప(Pushpa). ఈ సినిమా ఏ రేంజ్ లో సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ముఖ్యంగా పాన్ ఇండియా సినిమాగా విడుదలై.. నార్త్ ఇండియాలో మాత్రం ఊహించని ఇమేజ్ అందుకొని రూ.100 కోట్ల క్లబ్లో చేరి సరికొత్త రికార్డు సృష్టించింది. ఆ సినిమా తీసుకొచ్చిన క్రేజ్ ‘పుష్ప2’ పై అంచనాలను భారీగా పెంచేసింది. ఈ నేపథ్యంలోనే హై ఎక్స్పెక్టేషన్ తో భారీ బడ్జెట్ తో ‘పుష్ప-2’ సినిమాను డిసెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. మరో రెండు రోజుల్లో థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. అందుకు తగ్గట్లే టికెట్ సేల్స్ ఫ్యాన్స్ హడావిడి కూడా గట్టిగానే ఉంది.


పుష్ప 3 పై డైరక్టర్ క్లారిటీ..

ఈ నేపథ్యంలోనే మరోవైపు ‘పుష్ప3’ ఉంటుందా?లేదా? అనే విషయంపై ఎన్నో సందేహాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు వైరల్ అవుతున్న ఒక ఫోటో మాత్రం అభిమానులను ఇంకాస్త కన్ఫ్యూజన్ చేస్తోంది అని చెప్పవచ్చు. గత కొన్ని రోజుల క్రితం ‘పుష్ప3’ ఉండవచ్చనే రూమర్స్ గట్టిగా వినిపించాయి. కానీ దీనిపై ఎవరు అధికారిక ప్రకటన చేయలేదు. ఇదిలా ఉండగా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో హైదరాబాదులో సోమవారం సాయంత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ను చాలా ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో డైరెక్టర్ సుకుమార్ మాట్లాడుతూ..” మీ హీరో మరో మూడేళ్లు ఇస్తే పార్ట్ 3 కూడా చేస్తానని” బన్నీ అభిమానులతో చెప్పాడు సుకుమార్. ఇకపోతే ఒకవేళ సినిమా చేయాలన్నా కూడా ఇప్పట్లో కష్టమే.. ఎందుకంటే సుకుమార్ నెక్స్ట్ రామ్ చరణ్ (Ram Charan)తో పనిచేస్తాడు. అటు త్రివిక్రమ్ (Trivikram) కూడా బన్నీ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో పుష్ప 3 కోసం మరో మూడేళ్లు.. అంటే ఇక మిగతా హీరోలు, దర్శకులు కూడా ఎదురు చూడాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే మూడో పార్ట్ పై ఎవరి సందేహాలు వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు.


పుష్ప 3 పై అప్డేట్ ఇచ్చిన సౌండ్ ఇంజనీర్..

ఇదిలా ఉండగా మరొకవైపు సౌండ్ ఇంజనీర్ గా పనిచేసిన రసూల్ పొకుట్టి (Resul pookutty)తాజాగా తన ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టారు. పోస్ట్ ప్రొడక్షన్ పూర్తయిందనే విషయాన్ని తెలియజేశారు. కానీ బ్యాక్ గ్రౌండ్లో స్క్రీన్ పై మాత్రం పుష్ప 3 : ద ర్యాంపేజ్ అని ఉంది. దీన్ని బట్టి చూస్తే పార్ట్ 3 కూడా ఉందని, అందుకే టైటిల్ ని కూడా ప్రకటించారు. రసూల్ పోస్ట్ అలా పెట్టి ఇలా డిలీట్ చేశారు. దీంతో ఫ్యాన్స్ లో సరికొత్త అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇకపోతే సౌండ్ ఇంజనీర్ రసూల్ పొకుట్టి ఒకప్పుడు రాజమౌళి దర్శకత్వం వహించిన ప్రపంచం మెచ్చిన ఆర్ఆర్ఆర్ మూవీ ను గే మూవీ అంటూ సంబోధించారు. అప్పట్లో ఈ విషయం కాక సంచలనంగా మారింది కానీ ఇప్పుడు పుష్ప 3 పై అప్డేట్ ఇచ్చినట్టే ఇచ్చి డిలీట్ చేశారు రసూల్.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×