Anasuya Bharadwaj Tweet : హాట్ బ్యూటీ అనసూయ భరద్వాజ్ ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు చేస్తూ దూసుకెళ్తోంది. అయితే ఆమె సినిమాల కంటే ఎక్కువగా ఎప్పటికప్పుడు వివాదాలతో వార్తల్లో నిలుస్తుంది అన్న సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి అనసూయ భరద్వాజ్ సోషల్ మీడియా వేదికగా చేసిన కామెంట్ హాట్ టాపిక్ గా మారింది.
న్యూస్ రీడర్ గా కెరీర్ ను ప్రారంభించి, యాంకర్ గా మారి, ఆ తర్వాత సినిమాల్లో నటిస్తూ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ విశేష సంఖ్యలో అభిమానులను సంపాదించుకుంది అనసూయ. ఇక జబర్దస్త్ షోతో బాగా పాపులర్ అయిన ఈ బ్యూటీ తన అందం, వాక్చాతుర్యంతో భారీ సంఖ్యలో అభిమానులను సంపాదించుకుంది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడు ఎప్పటికప్పుడు గ్లామరస్ ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులకు ట్రీట్ ఇస్తూ ఉంటుంది. అలాగే సోషల్ మీడియా వేదికగా ఎవరైనా తనపై నెగిటివ్ కామెంట్స్ చేస్తే అస్సలు ఊరుకోదు. స్ట్రాంగ్ కౌంటర్ తో సమాధానం ఇచ్చి పడేస్తుంది ఈ బ్యూటీ. ఈ నేపథ్యంలోనే నిన్న ‘పుష్ప 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో సందడి చేసిన అనసూయ, తాజాగా ట్విట్టర్ వేదికగా చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.
‘దూరపు కొండలు నునుపు’ అంటూ అనసూయ ట్వీట్ చేసింది. అయితే అసలు ఆమె ఏ ఉద్దేశంతో ఈ ట్వీట్ చేసింది? ఎందుకు చేసింది ? అనే విషయం కొత్త చర్చకు దారి తీసింది. కొంతమంది మాత్రం అనసూయ చేసిన ఈ ట్వీట్ ని విజయ్ దేవరకొండకు అనువదిస్తున్నారు. ఎందుకంటే చాలాకాలంగా అనసూయ, విజయ్ దేవరకొండ మధ్య కోల్డ్ వార్ సాగుతున్న సంగతి తెలిసిందే. అర్జున్ రెడ్డి సినిమా నుంచే అనసూయ, విజయ్ దేవరకొండ మధ్య వివాదం మొదలైంది. ఈ నేపథ్యంలోనే తాజాగా అనసూయ చేసిన ట్వీట్ విజయ్ దేవరకొండ ను టార్గెట్ చేసేలా ఉంది అని కామెంట్స్ చేస్తున్నారు.
ఇక ఆ ట్వీట్ వెనక అనసూయకు ఉన్న ఉద్దేశం ఏంటో తెలీదు గానీ… నెటిజన్లు మాత్రం విజయ్ దేవరకొండ, రష్మిక లవ్ మ్యాటర్ గురించి ఆమె ఇలా ట్వీట్ చేసిందని కామెంట్స్ చేస్తున్నారు. రీసెంట్ గా రష్మిక తను రిలేషన్షిప్ లో ఉన్నానని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా హైదరాబాద్లో జరిగిన ‘పుష్ప 2’ ఈవెంట్ లో రష్మిక మందన్న ఇచ్చిన స్పీచ్ అందరిని ఆకట్టుకుంది. కానీ ఆమె స్పీచ్ ఇచ్చిన విధానం, స్లాంగ్ విజయ్ దేవరకొండ స్టైల్ లో ఉందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అనసూయ సెటైరికల్ గా, రష్మిక కి వార్నింగ్ లాగా ‘దూరపు కొండలు నునుపు’ అని పోస్ట్ చేసిందని అంటున్నారు. కానీ అందులో ఉన్న నిజం ఏంటో అనసూయకే తెలియాలి. మరి దీనిపై ఆమె క్లారిటీ ఇస్తుందా? అనేది చూడాలి.