Pushpa movie event: ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమాల్లో పుష్ప 2 ఒకటి. ఈ సినిమా మీద ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. రీసెంట్గా రిలీజ్ అయిన ట్రైలర్ కూడా విపరీతమైన అంచనాలను పెంచుతుంది. చాలా అంశాలను ట్రైలర్ లో చూపించాడు సుకుమార్. ట్రైలర్ మొత్తంలో కొన్ని విజువల్స్ నెక్స్ట్ లెవెల్. దేవిశ్రీప్రసాద్ (Devi Sri Prasad) బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బీభత్సంగా ఇచ్చాడని చెప్పాలి. సుకుమార్ సినిమా అంటే దేవి ఎలా పని చేస్తాడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అది ఎన్నో సినిమాలు నుంచి ప్రూవ్ అవుతూ వస్తుంది. డిసెంబర్ 5న ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ ట్రైలర్ ఈవెంట్ ను పాట్నాలో నిర్వహించింది చిత్ర యూనిట్. ఈ ఈవెంట్ కు భారీగా ప్రేక్షకులు హాజరయ్యారు. చాలామంది బాలీవుడ్ హీరోలు కూడా ఆశ్చర్యపడేలా ఈ సినిమా ట్రైలర్ ఈవెంట్ జరిగింది. నార్త్ మార్కెట్ ని పుష్ప టీం బాగా వాడుకుంది.
ఇకపోతే పుష్ప సినిమాకి సంబంధించిన ఈవెంట్ ను హైదరాబాద్ లో ప్లాన్ చేస్తుంది చిత్ర యూనిట్. ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీ లో జరగనుంది. ఒకవేళ రామోజీ ఫిలిం సిటీ లో పర్మిషన్ దొరకకపోతే చిత్తూరులో ప్లాన్ చేయనున్నట్లు సమాచారం వినిపిస్తుంది. హైదరాబాద్లో ఈ మధ్య సినిమా ఫంక్షన్స్ కు పెద్దగా పర్మిషన్స్ దొరకడం లేదు. దేవర సినిమా విషయంలో కూడా ఇలానే జరిగింది. చివరి నిమిషంలో ఈవెంట్ కూడా క్యాన్సిల్ అయిపోయింది. ఇక అలాంటి పొరపాటు ఈ సినిమా విషయంలో జరగకూడదని చెప్పి మరోచోట ప్లాన్ చేసింది చిత్ర యూనిట్. ఈ సినిమాలో అల్లు అర్జున్ మాట్లాడే యాస కూడా చిత్తూరు ప్రాంతానికి సంబంధించింది అందుకే చిత్ర యూనిట్ అక్కడ ఈ సినిమాకు సంబంధించిన ఈవెంట్ ప్లాన్ చేస్తుంది. అయితే దీని గురించి అధికారిక ప్రకటన త్వరలో రావాల్సి ఉంది.
Also Read : Pushpa 2 Trailer: అప్పుడు బన్నీ విష్ చేయలేదు, ఇప్పుడు మెగా ఫ్యామిలీ ట్వీట్ చెయ్యలేదు
ఇక టైలర్ విషయానికొస్తే మొదటి నుంచి చివరి వరకు ఆకట్టుకునే విధంగా డిజైన్ చేశారు. చాలా సందేహాలు కూడా ఈ ఈ ట్రైలర్ తో మొదలయ్యాయి. గంధపు చెక్కలుతో శవాన్ని కాల్చడం, చీర కట్టుకొని అల్లు అర్జున్ ఫైట్ చేయడం. సొంత ఫ్లైట్లో దిగడం. ఇలా చాలా రకమైన షాట్స్ ను ట్రైలర్ లో పొందుపరిచారు. ఈ సినిమాకి సంబంధించి మరో ఇద్దరు సంగీత దర్శకులు కూడా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేయనున్నట్లు సమాచారం వినిపిస్తుంది. అలానే డాన్సింగ్ క్వీన్ శ్రీ లీలా ఈ సినిమాలో ఐటెం సాంగ్ చేసింది. ఈ సాంగ్ కు సంబంధించిన విజువల్ కూడా ట్రైలర్ పెట్టారు. సుకుమార్ సినిమాల్లో ఐటెం సాంగ్ కి ఎంతటి ప్రత్యేకత ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.