BigTV English

Vedha Movie : వేద మూవీ .. అదరగొడుతున్న “పుష్ప పుష్ప” సాంగ్.. ప్రీరిలీజ్ ఈవెంట్ కు బాలయ్య గెస్ట్..

Vedha Movie : వేద మూవీ .. అదరగొడుతున్న “పుష్ప పుష్ప” సాంగ్.. ప్రీరిలీజ్ ఈవెంట్ కు బాలయ్య గెస్ట్..

Vedha Movie : కన్నడ స్టార్ హీరో శివ రాజ్‌కుమార్ నటించిన “వేద” చిత్రంలోని ఓ పాటను ఇటీవల రిలీజ్ చేశారు. ప్రముఖ నిర్మాత వివేక్ కూచిబొట్ల చేతులు మీదగా “పుష్ప పుష్ప” వీడియో సాంగ్ విడుదలైంది. ఇటీవల కార్తికేయ, ధమాక వంటి హిట్ చిత్రాలకు నిర్మాణ భాగస్వామిగా వివేక్ కూచిబొట్ల ఉన్నారు. ఫిబ్రవరి 9న “వేద” విడుదల కాబోతోంది.


వివేక్ కూచిబొట్ల ఏం చెప్పారంటే..
“డిసెంబర్ లో కన్నడలో రిలీజై మంచి విజయం సాధించిన “వేద” సినిమాను కంచి కామాక్షి కలకత్తా కాళీ క్రియేషన్స్ పతాకంపై రాధాకృష్ణ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ పాట కూడా చాలా బాగుంది. ఈ సినిమా పెద్ద విజయం అందుకుంటుందని భావిస్తున్నాను” అని వివేక్ కూచిబొట్ల అన్నారు.

శివ రాజ్‌కుమార్ కు ప్రత్యేక చిత్రం ..
హీరో శివ రాజ్‌కుమార్‌ కు వేద 125వ చిత్రం. అతని భార్య గీత నేతృత్వంలోని గీతా పిక్చర్స్ పై నిర్మించిన మొదటి సినిమా కూడా ఇదే కావడం విశేషం. ఇటీవల కన్నడలో విడుదలై సంచలనం సృష్టించిన ఈ సినిమా ఫిబ్రవరి 9న తెలుగులో రిలీజ్ కు సిద్ధమైంది. మాములుగా సినిమాలు శుక్రవారం రిలీజ్ అవుతుంటాయి. కంటెంట్ పై ఉన్న నమ్మకంతో ఈ సినిమాను ఒకరోజు ముందుగానే రిలీజ్ చేస్తున్నారు. కంచి కామాక్షి కలకత్తా కాళీ క్రియేషన్స్ ద్వారా ఈ సినిమా తెలుగులో రిలీజ్ కానుంది. దీనికి సంబంధించిన టైటిల్, మోషన్ పోస్టర్స్ ను ఇదివరకే ఆవిష్కరించింది చిత్ర బృందం. ఈ సినిమాను సపోర్ట్ చేస్తున్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు చిత్ర బృందం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. అలానే ఈ సినిమాపై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ట్వీట్ చేస్తూ ఈ చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. ఎ. హర్ష దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ డ్రామా చిత్రం కన్నడలో డిసెంబర్ 23న విడుదలై సంచలనం సృష్టించింది. శివన్న, ఘనవి లక్ష్మణ్, అదితి సాగర్, శ్వేత చంగప్ప, ఉమాశ్రీ ఈ చిత్రంలో నటించారు.


నిర్మాత వి.ఆర్.కృష్ణ మండపాటి ఏం చెప్పారంటే..
‘‘ ఈ సినిమా ఫస్ట్ లుక్ కి, మోషన్ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా హక్కులను కథ నచ్చి కొన్నాను. ఒక మంచి సినిమాకు ఎప్పుడూ తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారు. ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేయడానికి చాలామంది ప్రయత్నాలు చేశారు. కానీ నాకు అవకాశం దక్కింది. శివ రాజ్ కుమార్ ఫ్యామిలీకి తెలుగులోనూ ఎంత ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మనం కూడా శివన్న అని పిలుచుకుంటాం.’’ అని నిర్మాత వి.ఆర్. కృష్ణ చెప్పారు.

నేడే ప్రీరిలీజ్ ఈవెంట్..
‘వేద’ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లోని దసపల్లా హోటల్‌లో సాయంత్రం 6 గంటలకు నిర్వహించనున్నారు. శివ రాజ్‌కుమార్‌కు అత్యంత సన్నిహితుడైన నందమూరి బాలకృష్ణ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. బాలయ్య రాకతో ప్రీరిలీజ్ ఈవెంట్ కు అభిమానులు భారీగా తరలివచ్చే అవకాశం ఉంది.

నటీనటులు : శివరాజ్ కుమార్ , ఘనవి లక్ష్మణ్
దర్శకత్వం : హర్ష
నిర్మాత : గీతా శివ రాజ్‌కుమార్
సినిమాటోగ్రఫీ : స్వామి. జె. గౌడ్
ఎడిటర్: దీపు ఎస్. కుమార్
సంగీతం : అర్జున్‌ జన్య
పి.ఆర్. ఓ : వి. ఆర్. మధు
డిజిటల్ మీడియా: ప్రసాద్ లింగం

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×