BigTV English

PVCU Movies :’జై హనుమాన్’ 7వ మూవీనా? ఈ కన్ఫ్యూజ్ ఏంటి మాస్టారు.. ఆ రెండిటి పరిస్థితి ఏంటి?

PVCU Movies :’జై హనుమాన్’ 7వ మూవీనా? ఈ కన్ఫ్యూజ్ ఏంటి మాస్టారు.. ఆ రెండిటి పరిస్థితి ఏంటి?

PVCU Movies :’ హనుమాన్’ వంటి పాన్ ఇండియా సినిమాతో క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ‘ప్రశాంత్ వర్మ సినీమాటిక్ యూనివర్స్’ (PVCU) ను మొదలు పెట్టిన విషయం తెలిసిందే. అయితే ఇందులో భాగంగా ఆయన పలువురు స్టార్స్ తో సూపర్ హీరోల సినిమాలను తెరకెక్కిస్తున్నారు. తాజాగా ప్రశాంత్ వర్మ నుంచి వచ్చిన కొత్త అనౌన్స్మెంట్ మూవీ లవర్స్ ను కన్ఫ్యూజన్ లోకి నెట్టేసింది. ఎందుకంటే ‘జై హనుమాన్’ మూవీ ప్రశాంత్ వర్మ సినీమాటిక్ యూనివర్స్ లో 7వ మూవీ అని వికీపీడియాలో ఉండడంతో మరి ఆ మధ్యలో రావలసిన రెండు సినిమాల సంగతేంటి ? అనేది ఇప్పుడు అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న.


ప్రశాంత్ వర్మ సినీమాటిక్ యూనివర్స్ (PVCU)లో భాగంగా తెరకెక్కుతున్న సినిమాల్లో ఇప్పటిదాకా కేవలం మనకు తెలిసిన సినిమాలు ఐదు మాత్రమే. ప్రశాంత్ వర్మ ఇప్పటిదాకా అనౌన్స్ చేసిన సినిమాలలో మొదటి సినిమా ‘హనుమాన్’ (Hanuman), రెండవ సినిమా ‘సింబా’ (Simba), మూడవ సినిమా ‘మహాకాళి’ (Mahakali), నాలుగో సినిమా ‘అధీరా’. ఇక తాజాగా ‘హనుమాన్’ మూవీ కి సీక్వెల్ గా రాబోతున్న ‘జై హనుమాన్’ (Jai Hanuman) సినిమాను ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో ఏడవ మూవీ గా అనౌన్స్ చేశారు. దీంతో మధ్యలో మిస్ అయిన ఆ రెండు సినిమాలు ఏంటి ? అనే అనుమానం నెలకొంది. ఎందుకంటే ఇప్పటిదాకా ప్రశాంత్ వర్మ ఆ రెండు సినిమాల గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. మరి ప్రశాంత్ వర్మ సినీమాటిక్ యూనివర్స్ లో రావాల్సిన 5, 6 సినిమాలలో నటించే హీరో హీరోయిన్లు ఎవరు? ఎప్పుడు వీటిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇస్తాడు? ఆ రెండు సినిమాలకు సంబంధించిన బ్యాక్ డ్రాప్ ఏమై ఉంటుంది ? అసలు ఆ రెండు కథలు ఏంటి? అనేది ఆసక్తికరంగా మారింది. మరి వీటిపై ప్రశాంత్ వర్మ తన అభిమానులకు ఎప్పుడు క్లారిటీ ఇస్తాడో చూడాలి.

ఇదిలా ఉండగా తేజ సజ్జ హీరోగా నటించిన ‘హనుమాన్’ మూవీతో ఈ ఏడాది సంక్రాంతికి బిగ్గెస్ట్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు ప్రశాంత్ వర్మ. ఈ మూవీతో ఆయన ఓవర్ నైట్ పాపులర్ కావడంతో పాటు పాన్ ఇండియా డైరెక్టర్ గా మారాడు. ఈ మూవీకి సీక్వెల్ గా ‘జై హనుమాన్’ (Jai Hanuman) మూవీ వచ్చేస్తుంది. ఇక ప్రశాంత్ వర్మ అనౌన్స్ చేసిన మరో సినిమా ‘సింబా’లో మోక్షజ్ఞ హీరోగా నటిస్తున్నాడు. అలాగే రీసెంట్ గా దసరా కానుకగా ‘మహాకాళి’ అనే సినిమాను అనౌన్స్ చేశాడు. కానీ అందులో నటించబోయే నటీనటుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అలాగే ప్రశాంత్ వర్మ తన దర్శకత్వంలో కళ్యాణ్ దాసరిని పరిచయం చేస్తూ ‘అధీర’ అనే సినిమాను రూపొందిస్తున్నారు. ఇది కూడా సూపర్ హీరో సినిమానే కాగా, ఇప్పటికే దీనికి సంబంధించిన గ్లిమ్స్ రిలీజ్ కావడంతో పాటు అంచనాలను పెంచింది. అయితే ఆ గ్లిమ్స్ రిలీజ్ అయ్యి ఇప్పటికే చాలాకాలం అవుతుంది. కానీ దీనికి సంబంధించిన అప్డేట్స్ బయటకు రాకపోవడంతో మూవీ ఆగిపోయింది అనే వార్తలు కూడా వినిపించాయి.


Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×