Indian Railways: భారతీయ రైల్వే సంస్థ ప్రయాణీకులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటూనే ఉన్నది. ప్రయాణీకులకు అనుకూలంగా పలు చర్యలు చేపడుతున్నది. చాలా మంది తరచుగా రైలు ప్రయాణం చేస్తున్నప్పటికీ, పెద్దగా రైల్వే నియమ నిబంధనల గురించి తెలియదు. రైల్వేకు సంబంధించి ఓ కీలక నిబంధన గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
నిత్యం కోట్లాది మంది ప్రజలు రైలు ప్రయాణం చేస్తారు. ఎంతో కొంత తమతో పాటు లగేజీని తీసుకెళ్తారు. అయితే, ఒక్కో ప్రయాణీకుడు రైల్లో ఎంత పరిమితి వరకు లగేజీ తీసుకెళ్లాలి? అనే విషయంలో పెద్దగా క్లారిటీ ఉండదు. ఒక్కోసారి పరిమితికి మించి లగేజీ తీసుకెళ్లడం వల్ల ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. అందుకే రైల్వే ప్రయాణం చేసే ప్యాసింజర్లు ఎంత పరిమితిలో లగేజీ తీసుకెళ్లాలి? లగేజీ పరిమితి ఆయా క్లాసులకు వేర్వేరుగా ఉంటుందా? ఒకవేళ పరిమితికి మించి లగేజీ తీసుకెళ్తే ఏమవుతుంది? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
రైలులో ఎంత లగేజీ తీసుకెళ్లే అవకాశం ఉంది?
భారతీయ రైల్వే నిబంధనల ప్రకారం సాధారణంగా ఒక్కో ప్రయాణీకుడు 40 నుంచి 70 కిలోల లగేజీనికి ఉచితంగా తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. అయితే, ఆయా క్లాస్ ను బట్టి లగేజీ పరిమితి మారుతుంది. రైల్లోని ఫస్ట్ ఏసీ కోచ్ లో ప్రయాణించే ప్యాసెంజర్లు 70 కిలలో వరకు లగేజీని తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. ఇంతకు మించి లగేజీ తీసుకెళ్లాలంటే ముందుగానే రిజర్వేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక సెకెండ్ ఏసీలో ప్రయాణించే వాళ్లు 50 కిలలో వరకు లగేజీని తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. థర్డ్ ఏసీ ప్రయాణీకులు 40 కిలలో లగేజీ తీసుకెళ్లవచ్చు. స్లీపర్ క్లాస్ ప్రయాణీకులు సైతం 40 కిలోల వరకు లగేజీని తీసుకెళ్లవచ్చు. ఒకేవేళ పరిమితికి మించితే ముందుగానే రైల్వే అధికారులకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ఎలాంటి అనుమతి లేకుండా ఎక్కువ మోతాదులో లగేజీ తీసుకెళ్తే రైల్వే అధికారులు జరిమానా విధించే అవకాశం ఉంటుంది.
Read Also: ఈ రైల్లో టికెట్ లేకుండానే జర్నీ చెయ్యొచ్చు, మీరూ ఓసారి ట్రై చేయండి!
లగేజీపై పరిమితులు ఎందుకంటే?
వాస్తవానికి గతంలో రైల్వే ప్రయాణీకులు ఇంతే మోతాదులో లగేజీ తీసుకెళ్లాలనే నిబంధన ఏమీ లేదు. కానీ, ప్రయాణీలు ఒక్కోసారి పెద్ద మొత్తంలో లగేజీతో స్టేషన్ కు రావడంతో పాటు రైలు ఎక్కే సమయంలో ఇబ్బందులు తలెత్తడాన్ని అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే రైలు ప్రయాణీకులు తీసుకెళ్లాల్సిన లగేజీ మీద పరిమితులు విధించారు. ఆయా క్లాసులను బట్టి 40 నుంచి 70 కేజీల వరకు లగేజీని తీసుకెళ్లే అవకాశం కల్పించారు. ఈ నిబంధనతో రైలు ఎక్కే సమయంలో ప్రయాణీకులకు పెద్దగా ఇబ్బందులు ఎదురుకావడం లేదని అధికారులు వెల్లడించారు. కొన్ని సందర్భాల్లో ఎక్కువ మొత్తంలో లగేజీని తీసుకెళ్లాల్సి ఉంటే ముందుకు రైల్వే అధికారులను చెప్పాలని సూచిస్తున్నారు. లేదంటే జరిమానా విధించే అవకాశం ఉంటుందంటున్నారు.
Read Also: మహా కుంభమేళా స్పెషల్ ప్యాకేజీ.. తక్కువ ఖర్చుతో అయోధ్య, వారణాసి చూసే అవకాశం!