BigTV English

Raj Tarun – Malvi Malhotra: రాజ్ తరుణ్ – మాల్వీ మల్హోత్రా ‘తిరగబడరసామీ’ కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్..

Raj Tarun – Malvi Malhotra: రాజ్ తరుణ్ – మాల్వీ మల్హోత్రా ‘తిరగబడరసామీ’ కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్..
Advertisement

Raj tarun – Tiragabadara Saami: రాజ్ తరుణ్ హీరోగా నటిస్తోన్న కొత్త సినిమా ‘తిరగబడరా సామి’. మాల్వీ మల్హోత్రా ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. ఎప్పుడో షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా రిలీజ్‌కు రెడీగా ఉంది. మొదటి ఈ సినిమాను ఫిబ్రవరి 23న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. కానీ అనివార్య కారణాల వల్ల ఈ చిత్రాన్ని వాయిదా వేశారు. ఈ సారి జులై 19న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు.


కానీ రాజ్ తరుణ్‌ ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమా ప్రమోషన్లకు హాజరు కావడం కుదరదు. కాబట్టి మేకర్స్ తమ సినిమాను మరో డేట్‌కి వాయిదా వేశారు. ఈ సారి ఆగస్టు 2న ఈ చిత్రాన్ని విడుదల చేయబోయితున్నట్టు అధికారికంగా తెలిపారు. ఈ మేరకు ఒక పోస్టర్‌ను రిలీజ్ చేశారు. అయితే మేకర్స్ ఎందుకు ఈ డేట్‌ను ఎంచుకున్నారంటే.. ఈ సమయంలో ప్రస్తుతం నడుస్తున్న కేసుల వ్యవహారం ఓ కిలిక్కి వస్తుందని.. ఆ తర్వాత రాజ్ తరుణ్ ప్రమోషన్లలో పాల్గొంటాడని మేకర్స్ భావిస్తున్నారట. మరి వారు భావించినట్టుగానే ఈ కేసుల వ్యవహారం ఓ కొలిక్కి వస్తుందా లేదా చూడాలి.

ఇక రాజ్ తరుణ్- లావణ్యల ప్రేమ విషయానికొస్తే.. ఇప్పుడు ఎక్కడ విన్నా రాజ్ తరుణ్ పేరే వినిపిస్తోంది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి రాజ్ తరుణ్ మోసం చేశాడని అతడి మాజీ ప్రియురాలు లావణ్య నార్సింగ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. మాల్వీ మల్హోత్రా అనే నటితో రాజ్ తరుణ్ ఎఫైర్ నడుపుతున్నాడని ఆ ఫిర్యాదులో పేర్కొంది. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు, కాల్ రికార్డింగ్‌ను సైతం బయటపెట్టింది. దీంతో ఈ వ్యవహారం హాట్ టాపిగా మారింది. గత వారం రోజుల నుండి రాజ్ తరుణ్ అండ్ లావణ్యల ప్రేమ వ్యవహారమే నడుస్తోంది. సినిమాను తలపించే విధంగా రోజుకో ట్విస్ట్ ఇస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.


Also Read: ఏం ట్విస్టులురా బాబు.. సినిమాను తలపిస్తున్న లావణ్య- రాజ్ తరుణ్ లవ్ స్టోరీ

ఇక నిన్న (జూలై 10) లావణ్య.. మాల్వీ మల్హాత్రాపై ఫిర్యాదు చేసింది. తనను, తన తమ్ముడిని వేధిస్తున్నారంటూ ఫిర్యాదులో పేర్కొంది. ఆపై రాజ్ తరుణ్‌పై మరిన్ని ఆరోపణలు చేసింది. తనకు అబార్షన్ చేయించాడని తెలిపింది. ఈ మేరకు ఫొటోలు, మెడికల్ రిపోర్టులతో పాటు తనను టార్చర్ చేసినట్లుగా ఉన్న ఆధారాలను పోలీసులకు అప్పగించింది. దీంతో నార్సింగ్ పోలీసులు రాజ్ తరుణ్‌పై కేసు నమోదు చేశారు.

ఈ కేసులో రాజ్ తరుణ్ ఎ1 కాగా మాల్వీ మల్హోత్రాను ఏ2గా, మయాంక్ మల్హోత్రాను ఏ3 నిర్దారించారు. అంతేకాకుండా లావణ్య ఇచ్చిన ఫిర్యాదులో రాజ్‌ తరుణ్ తనను 2014లో పెళ్లి చేసుకున్నట్లు తెలిపింది. 2016లో తను ప్రెంగ్నెంట్ కాగా 2 నెలల్లో సర్జరీ చేయించి అబార్షన్ చేశాడని అందులో వెల్లడించింది. అంతేకాకుండా రాజ్ తరుణ్ అండ్ మాల్వీ మల్హోత్రా కలిసి తనని డ్రగ్స్ కేసులో ఇరికించారని కూడా తెలుపుతూ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. ఇప్పటికే ఎన్నో మలుపులు తిరిగిన ఈ కేసు.. ఇక ముందు మరెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.

Tags

Related News

Influencer Bhavani Ram : కన్నీళ్లు తెప్పిస్తున్న ఇన్‌ఫ్లుయెన్సర్ భవాని స్టోరీ… అప్పుడు ట్రోల్ చేశారు.. ఇప్పుడు సంపాదన ఎంతంటే?

Lazawal Ishq Show: పాక్‌‌లో డేటింగ్ రియాల్టీ షో.. వెంటనే ఆపాలంటూ గోలగోల, ఎందుకంటే?

Venu Swamy: శత్రువుల నాశనం కోసం వేణు స్వామి పూజలు…నీటిపై తేలియాడుతూ అలా!

Bigg Boss 9 Wildcard Entry: 6 గురు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్… యాడ దొరికిన సంతరా ఇది.. అంతా స్క్రాపే

PVRInox : తింటూ సినిమా చూసే ఎక్స్పీరియన్స్, ఏంట్రా బాబు ఆ సౌండ్స్ ను ఎలా భరించాలి

Durga Rao: టిక్ టాక్ దుర్గారావు ఇంట్లో విషాదం.. సమాధి దగ్గరే.. కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం!

Rakesh Poojary: ‘కాంతారా-1’లో కడుపుబ్బా నవ్వించిన.. ఈ నటుడు ఎలా చనిపోయాడో తెలుసా? కన్నీళ్లు ఆగవు!

Janu lyri- Deelip Devagan: జాను లిరితో బ్రేకప్.. దిలీప్ రియాక్షన్ ఇదే.. సెలబ్రిటీలం కాబట్టే అంటూ!

Big Stories

×