Rajamouli: దిగ్గజ దర్శక ధీరుడు రాజమౌళి (Rajamouli) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ‘శాంతి నివాసం’ అనే టీవీ సీరియల్ ఎపిసోడ్ ద్వారా తన కెరీర్ ను ఆరంభించి, ఆ తర్వాత దర్శకుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఇక స్క్రిప్ట్ తీసుకొని తిరుగుతున్న సమయంలో ఏ ఒక్క హీరో కూడా ఈయనకు అవకాశం ఇవ్వలేదు. కానీ ఎన్టీఆర్ (NTR ) ‘స్టూడెంట్ నెంబర్ వన్’ సినిమా కోసం అవకాశం కల్పించడం తో రాజమౌళి తన టాలెంట్ ఏంటో నిరూపించుకున్నారు. ఆ తర్వాత రాజమౌళి మళ్లీ ‘సింహాద్రి’ సినిమాని కూడా ఎన్టీఆర్ తోనే చేసి అందరినీ ఆకట్టుకున్నారు. ఇక తర్వాత విక్రమార్కుడు, సై, మగధీర, ఈగ వంటి చిత్రాలు చేసి అలరించిన రాజమౌళి.. ప్రభాస్, రాణాతో కలసి మల్టీ స్టారర్ మూవీగా ‘బాహుబలి’ సినిమాను తెరకెక్కించారు. ఇక ఈ సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న రాజమౌళి.. బాహుబలి 2 కూడా చేసి అందరినీ అబ్బురపరిచారు.
ఎస్ఎస్ఎంబీ 29 తో రికార్డ్ క్రియేట్ చేయనున్న రాజమౌళి..
ఇకపోతే ఈ సినిమా తర్వాత రాజమౌళి.. రామ్ చరణ్, ఎన్టీఆర్ తో కలిసి ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చేసి ఏకంగా ఆస్కార్ వరకు వెళ్లారు. ఈ సినిమాలో ‘నాటు నాటు’ పాటకు ఉత్తమ సంగీత దర్శకుడిగా ఎంఎం కీరవాణి(MM Keeravani)కి, ఉత్తమ రచయితగా చంద్రబోస్(Chandrabose ) కి ఆస్కార్ అవార్డు లభించిన విషయం తెలిసిందే. ఇక ఈసారి ఎలాగైనా సరే ఉత్తమ దర్శకుడిగా అందుకోవాలనే దిశగా అడుగులు వేస్తున్నారు రాజమౌళి. ఇక ప్రస్తుతం మహేష్ బాబుతో ఎస్ఎస్ఎంబీ 29 అనే వర్కింగ్ టైటిల్ తో సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే హైదరాబాద్, ఒడిశా వంటి ప్రాంతాలలో సినిమా షూటింగ్ కూడా కంప్లీట్ అయింది. ఇక మే నెల నుంచి మరో ప్రదేశంలో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఎస్ఎస్ఎంబీ 29 కోసం రికార్డ్ స్థాయిలో రాజమౌళి రెమ్యునరేషన్..
ఇకపోతే ఇప్పుడు ఈ సినిమాను హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కిస్తున్నారు రాజమౌళి. అందులో భాగంగానే పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) తో పాటు ప్రియాంక చోప్రా (Priyanka Chopra) వంటి భారీ తారాగణాన్ని భాగం చేశారు. ఇక మహేష్ బాబు(Maheshbabu ) కి ధీటుగా పృథ్వీరాజ్ సుకుమారన్ పోటీ పడబోతున్నారంటూ వార్తలు రాగా.. ఇప్పుడు ఈయన కాకుండా నల్ల జాతీయుడిని ఈ సినిమాలో మెయిన్ విలన్ గా తీసుకోబోతున్నట్లు సమాచారం. ఇకపోతే ఇదంతా కాస్త పక్కన పెడితే, దాదాపు రూ.1000 కోట్ల భారీ బడ్జెట్ తో దుర్గా ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా కోసం మహేష్ బాబు కంటే రెండింతల భారీ రెమ్యూనరేషన్ ను రాజమౌళి తీసుకోబోతున్నారని వార్తలు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఈ ఒక్క సినిమా కోసం రాజమౌళి ఏకంగా రూ.200 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నట్లు సమాచారం. అమెజాన్ ఫారెస్ట్ లో అడ్వెంచర్ మూవీగా వస్తున్న ఈ సినిమాతో రాజమౌళి మరెన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తారో చూడాలి. ఇకపోతే రాజమౌళి ఈ రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకోవడం నిజమైతే మాత్రం స్టార్ హీరోలు కూడా ఈ విషయంలో వెనక్కి తగ్గాల్సిందే అని అభిమానులు కూడా కామెంట్లు చేస్తున్నారు. ఇప్పటివరకు ఆయన తన సినిమాలకు రెమ్యునరేషన్తో పాటు సినిమా లాభాల్లో వాటా తీసుకున్న రాజమౌళి ఇప్పుడు ఈ సినిమాతో ఇంకెన్ని లాభాలు అందుకుంటారో చూడాలి.