SBLC Tunnel Update: SLBC టన్నెల్‌లో బురద తొలగింపు ప్రక్రియ పూర్తైంది. 63 రోజులుగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగింది. ప్రమాదంలో చనిపోయిన ఎనిమిది మందిలో ఇద్దరు మృతదేహాలు వెలికితీయగా.. మరో ఆరుగురి అవశేషాలు కనిపించలేదు. ప్రమాద ప్రాంతం నుండి 260 మీటర్ల మేర బురద, TBM శిథిలాలను తొలగించారు. మిగిలిన 50 మీటర్ల ప్రాంతం రిస్క్ అని తేల్చడంతో ఆ ప్రాంతంలో కంచె ఏర్పాటు చేశారు. ఇన్ టన్నెల్ ప్రధాన ద్వారం దగ్గర రెస్క్యూ టీం క్యాబిన్లు ఖాళీ చేశారు. అటు సింగరేణి మైన్స్ రెస్క్యూ సిబ్బంది వెనుదిరిగాయి. టన్నెల్‌ను నిపుణుల ఉపకమిటీ పరిశీలించి.. రెస్క్యూపై ఓ నిర్ణయం తీసుకోనుంది.
కాగా.. శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగ మార్గంలో 63 రోజులుగా సహాయ చర్యలు ముమ్మరంగా కొనసాగించారు. ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ, సింగరేణి రెస్క్యూ బృందాలు రక్షణ చర్యలను నిర్వహించాయి. ఇటీవల కేరళ నుంచి ప్రత్యేకంగా క్యాడవర్ డాగ్స్‌తో తప్పిపోయిన ఏడుగురి జాడ గుర్తించేందుకు తీసుకొచ్చారు. అవి రెండు మృత దేహాలను గుర్తించిన సంగతి తెలిసిందే..
ఈ ఏడాది ఫిబ్రవరి 22న ఎస్ ఎల్ బీసీ టన్నెల్ సొరంగ నిర్మాణం చేపడుతున్న టన్నెల్ బోరింగ్ మిషన్.. పై బాగంలో విపరీతంగా నీరు, బురద పొంగి దూసుకుపోవడంతో.. పనుల్లో ఉన్న కార్మికులు ఎనిమింది కార్మికులు చిక్కుకుపోయారు. ఇప్పటికే ఇద్దరి మృతదేహాలను వెలికితీయగా.. మిగతా ఆరుగురి కోసం 63 రోజులుగా సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.
టన్నెల్ లోపల శాస్త్రవేత్తలు, టన్నెల్ నిపుణుల సూచనలతో.. సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నట్టు.. ఇటీవల స్పెషల్ ఆఫీసర్ శివ శంకర్ తెలిపారు మీడియాతో మాట్లాడారు. నీటి ప్రవాహం వేగంగా వస్తుందని, నివారించేందుకు భారీ మోటార్లతో డీ వాటరింగ్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. చివరి వరకు వెంటిలేషన్ సదుపాయం ఉందని, రెస్క్యూ టీమ్‌కు అవసరమైన అన్ని వసతులు సమకూర్చినట్లు ఆయన తెలిపారు. కన్వేయర్ బెల్ట్ సాయంతో మట్టిని ఎప్పటికప్పుడు బయటకు తరలిస్తున్నామన్నారు.
ఒకటికి రెండు సార్లు మట్టిని క్షుణ్ణంగా పరిశీలించి ఆరుగురి ఆచూకీని కనుగొంటున్నట్టు తెలిపారు. టీబీఎం పార్ట్స్‌ను లోకో ట్రెయిన్ ద్వారా వెంటవెంటనే బయటకు తెస్తున్నామన్నారు. ఇందులో అన్ని రకాల రెస్క్యూ టీమ్‌లు పాల్గొంటున్నాయన్నారు. ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి, ఉన్నతాధికారులకు నివేదికలు అందిస్తున్నామన్నారు.
Also Read: పాక్‌కు వణుకు పుట్టిస్తాం.. బిచ్చమెత్తుకునేలా చేస్తాం.. బండి వార్నింగ్
విపత్తు నిర్వహణ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, కలెక్టర్ బదావత్ సంతోష్, ఎస్పీ రఘునాథ్ గైక్వాడ్, ఇతర రెస్క్యూ బృందాలు, సీనియర్ అధికారులు వారితో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. రెస్క్యూ కార్యకలాపాలను వేగవంతం చేయడానికి తగిన సూచనలు, మార్పులు, చేర్పులు చేస్తున్నారు.
అయితే తాజాగా ప్రమాద ప్రాంతం నుండి 260 మీటర్ల మేర బురద, TBM శిథిలాలను తొలగించారు. మిగిలిన 50 మీటర్ల ప్రాంతం డేంజర్ అని తేల్చడంతో ఆ ప్రాంతంలో కంచె ఏర్పాటు చేశారు. దీంతో రెస్క్యూ ఆపరేషన్ ఆపేశారు. మరి మిగతా ఆరుగురి మృతదేహాలు పరిస్థితి ఏంటనేది ప్రశ్నార్ధకంగా మారింది.