Bandi Sanjay on Pakistan : తుపాకీ పట్టినోడు చివరికి ఆ తుపాకీకే బలికాక తప్పదు.. పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టేలా చేస్తాం.. అంటూ దాయాది దేశానికి మాస్ వార్నింగ్ ఇచ్చారు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్. కశ్మీర్, పహల్గాంలో ఉగ్రవాదుల మారణహోమం రాక్షసత్వానికి పరాకాష్ట అని మండిపడ్డారు. బిచ్చమెత్తుకునే దుస్థితికి చేరినా పాక్ బుద్ధి మాత్రం మారడం లేదన్నారు. అభివృద్ధిలో దూసుకుపోతున్న భారత్‌ను చూసి ఓర్వలేకపోతోందని చెప్పారు. 30 ఏళ్లుగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నామని ఆ దేశ రక్షణ మంత్రి అంగీకరించారని గుర్తు చేశారు. ఉగ్రవాదాన్ని అంతమొందించేందుకు నరేంద్ర మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. మోదీ సర్కార్ తీసుకునే కఠిన నిర్ణయాలకు దేశ ప్రజలంతా అండగా నిలవాలని పిలుపు ఇచ్చారు బండి సంజయ్.
Also Read : ఉగ్రదాడి.. ఏపీ, తెలంగాణలోని 14 ప్రాంతాల్లో హైఅలర్ట్
700 మందికి ఉద్యోగాలు
హైదరాబాద్, మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో ‘రోజ్ గార్ మేళా’ కార్యక్రమం నిర్వహించారు. 10 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తానన్న మాటను ప్రధాని మోదీ నిలబెట్టుకున్నారన్నారు బండి సంజయ్. ఇప్పటి వరకు 14 రోజ్ గార్ మేళాలను నిర్వహించి.. 9 లక్షల 25 వేల ఉద్యోగాలను భర్తీ చేసినట్టు చెప్పారు. తాజాగా 15వ రోజ్ గార్ మేళా ద్వారా దేశవ్యాప్తంగా 51 వేలకుపైగా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నామని అన్నారు. చిన్న అవినీతికి, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా నిర్ణీత గడువులోగా 10 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసిన ఘనత మోదీ సర్కారుదేనన్నారు. ఈ కార్యక్రమంలో సుమారు 700 మంది అభ్యర్థులకు నియామక పత్రాలు అందించారు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్.
Also Read : పీవోకే స్వాధీనం సాధ్యమేనా?
అమెరికా, చైనాను దాటేద్దాం..
ఉద్యోగావకాశాల సృష్టికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నది మోదీ సంకల్పమని చెప్పారు. స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా, మేక్ ఇన్ ఇండియాతో ఉద్యోగాలు చేసే స్థాయి నుంచి.. ఉద్యోగాలు సృష్టించే రేంజ్‌కు భారతీయ యువతను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. కరోనా సమయంలో అమెరికాతో సహా ప్రపంచమంతా ఆర్ధిక సంక్షోభంలో కూరుకుపోతే.. ఆత్మ నిర్భర్ భారత్ ప్యాకేజీతో దేశంలో ఆర్ధిక సుస్థిరతను సాధించిన ఘనత మోదీ ప్రభుత్వానిదేనని చెప్పారు. భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చి 2047 నాటికి 100 ఏళ్లు పూర్తి కానున్న సందర్భంగా.. అప్పటికల్లా అమెరికా, చైనాను అధిగమించి భారత్ ప్రపంచంలోనే నెంబర్ వన్ కావాలన్నదే మోదీ ఆకాంక్ష అని బండి సంజయ్ తెలిపారు.
Also Read : పాకిస్తాన్‌పై భారత్ సర్జికల్ స్ట్రైక్స్ ఎలా చేసిందంటే.. కంప్లీట్ డీటైల్స్
Also Read : ఇండియా vs పాకిస్తాన్.. ఎవరి ఆర్మీ పవర్‌ఫుల్?
Also Read : రంగంలోకి అజీత్ దోవల్.. ఇక టెర్రరిస్టులకు నరకమే..