BigTV English

Ramya Krishna : రాజమౌళి ఈ సీన్ చూడవయ్యా.. రమ్యకృష్ణ ఎంతపని చేసిందో చూడండి.. పరువు పాయే

Ramya Krishna : రాజమౌళి ఈ సీన్ చూడవయ్యా.. రమ్యకృష్ణ ఎంతపని చేసిందో చూడండి.. పరువు పాయే

Ramya Krishna: తెలుగు ఇండస్ట్రీలో స్టార్ సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ అంటే తెలియని వారు ఉండరు. దశాబ్ద కాలాలపాటు తెలుగు తమిళం, కన్నడ,మలయాళం, హిందీ అనేక సినిమాలో నటించి మెప్పించారు. ఈమె చిన్న వయసులోనే సినీ రంగంలో అడుగుపెట్టి ఇండస్ట్రీలో తనదైన ముద్రవేశారు. తెలుగులో దాదాపు అందరూ స్టార్ హీరోలతో రమ్యకృష్ణ నటించారు. గత సంవత్సరం గుంటూరు కారం మూవీలో హీరో తల్లి క్యారెక్టర్ లో నటించి మంచి విజయాన్ని అందుకున్నారు. ప్రస్తుతం తెలుగులో కొన్ని సినిమాల్లో నటిస్తూ, టీవీ ప్రోగ్రామ్స్ లోనూ పాల్గొంటున్నారు. తాజాగా జీ తెలుగు అప్సర అవార్డ్స్ 2025 ప్రోగ్రాం లో రమ్యకృష్ణ పాల్గొన్నారు. అందులో బాహుబలి చిత్రం పై ఆమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఆ వివరాలు చూద్దాం ..


రాజమౌళి ఈ సీన్ చూడవయ్యా..

అప్సర అవార్డు ప్రోమో తాజాగా రిలీజ్ చేసారు . ప్రోమో స్టార్టింగ్ లో రమ్యకృష్ణ, సీనియర్ నటుడు మురళీమోహన్ చేతుల మీదగా అప్సర అవార్డును అందుకుంటారు. ఆమె మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా ఒక ఛానల్ ని రన్ చేసి, ఇన్ని సంవత్సరాలు నడపడం అన్నది అది ఈజీ కాదు చాలా గ్రేట్ అని అంటారు. ఆమె పరమేశ్వర వీడు బతకాలి అనే డైలాగ్ చెబుతుండగా యాంకర్ రవి ఒక చిన్న బొమ్మను తీసుకువచ్చి వీడు అని ఫన్నీగా చూపిస్తాడు. బాహుబలి లో అమరేంద్ర బాహుబలి ఎంట్రీ సీన్ ను రవి రీ క్రియేట్ చేయడంతో దీన్ని రాజమౌళి చూడకూడదు అని ఆమె అంటారు. ఈ ప్రోమో అంతా చాలా ఫన్నీగా సాగుతుంది. ప్రోమో చివర్లో రాజమాతగా, రమ్యకృష్ణ దర్జాగా చైర్ లో కూర్చోవడంతో, అక్కడున్న సెలబ్రిటీలంతా అభినందిస్తారు. అప్సర అవార్డ్స్ లో ఎంతోమంది సెలబ్రిటీలు పాల్గొననున్నారు. సుకుమార్, సమంత, రోజా, రమ్యకృష్ణ,మంచు లక్ష్మి, అమల తదితరులు పాల్గొన్నారు. ప్రోమో చుసిన ఫాన్స్ రాజమౌళి ఈ సీన్ చూసారా రమ్యకృష్ణ ఎంతపని చేసిందో  అని కామెంట్స్ పెడుతున్నారు .


అవార్డు అందుకున్న రమ్యకృష్ణ ..

రమ్యకృష్ణ దాదాపు ఇండస్ట్రీలో 35 సంవత్సరాలుగా కొనసాగుతున్న సీనియర్ నటి. మొదట హీరోయిన్ గా నటించి మెప్పించిన రమ్యకృష్ణ కొంతకాలం గ్యాప్ తర్వాత రీ ఎంట్రీ ఇచ్చారు. ఇక యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రాజమౌళి కాంబోలో వచ్చిన బాహుబలి చిత్రంలో శివగామి గా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ మూవీ తరువాత రమ్యకృష్ణ కోసం దర్శకులు క్యూ కట్టారని చెప్పొచ్చు. ఆ తర్వాత వరుసగా సినిమాల్లో నటించారు. గత సంవత్సరం సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా గుంటూరు కారం సినిమాలో ఆయనకు తల్లి పాత్రలో నటించి మెప్పించారు. తెలుగులోనే కాక తమిళం, మలయాళం, కన్నడ హిందీ భాషల్లో నటిస్తున్నారు. తాజాగా జాట్ మూవీలోను రమ్యకృష్ణ నటించారు. ఇక సినిమాలోనే కాక, టీవీ ప్రోగ్రామ్స్లోనూ రమ్యకృష్ణ పాల్గొంటారు. జీ తెలుగు అప్సర అవార్డ్స్ మే 24న జరగనుంది. ఇది దీనికి సంబంధించిన తాజా ప్రోమో రిలీజ్ చేశారు. ఈ అప్సర అవార్డ్ ను రమ్యకృష్ణ అందుకున్నారు.ఇక ఈ ప్రోమో చూసిన వారంతా ఫుల్ ఎపిసోడ్ కోసం ఎదురుచూస్తున్నారు. జీ తెలుగులో మే 24 శనివారం సాయంత్రం ఐదు గంటల 30 నిమిషాలకు ఈ ప్రోగ్రాం టెలికాస్ట్ కానుంది.

Samantha,: సమంత – రాజ్ డేటింగ్ కి స్వస్తి.. పెళ్లికి గ్రీన్ సిగ్నల్.. స్టార్ నటి ఆశీర్వాదం..

 

Related News

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Actress Mohini: అలా చేయాలని బలవంతం చేశారు.. చాలా ఏడ్చాను, బాలయ్య హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!

Big Stories

×