Samantha : సమంత (Samantha) తాజాగా ‘శుభం’ మూవీతో నిర్మాతగా మారి ఫస్ట్ సినిమాతోనే హిట్ మూవీని తన ఖాతాలో వేసుకుంది.అయితే ఈ మూవీ హిట్ అయిన నేపథ్యంలో తాజాగా శుభం మూవీకి సంబంధించి సక్సెస్ మీట్ ని గ్రాండ్ గా నిర్వహించారు చిత్ర యూనిట్. ఇందులో భాగంగా సినిమాలో నటించిన ఎంతోమంది నటీనటులు ఈ ఈవెంట్లో పాల్గొని సినిమా షూటింగ్ సమయంలో తమకు ఎదురైన అనుభవాలను స్టేజ్ పై పంచుకున్నారు. అలా సీనియర్ నటి మధుమణి (Madhumani )రాజ్ (Raj) – సమంతల ప్రయాణం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. మరి ఇంతకీ సీనియర్ నటి మధుమణి ఏం మాట్లాడింది అనేది ఇప్పుడు చూద్దాం..
సమంత మూవీలో అవకాశం.. కానీ..
ప్రవీణ్ కండ్రేగుల డైరెక్టర్ గా తెరకెక్కిన శుభం మూవీకి సమంత నిర్మాతగా చేసింది. ఈ సినిమాతో కొత్తవారిని తెలుగు తెరకు పరిచయం చేసింది సమంత.. అయితే ఈ సినిమాకి సంబంధించి సక్సెస్ మీట్ ని నిర్వహించారు. ఈ సక్సెస్ మీట్ లో సీనియర్ నటి మధుమణి మాట్లాడుతూ.. ” సమంతతో కలిసి చేసే ఛాన్స్ నాకు వస్తుందో రాదో అని చాలా బాధపడ్డా.ఇప్పటికే 400 సినిమాల్లో నటించాను. కానీ సమంతతో ఒక్క సినిమా కూడా చేయలేదు. అయితే మొదట్లో రంగస్థలం సినిమాలో సమంతకి తల్లి పాత్రలో చేసే అవకాశం నాకే వచ్చింది.కానీ అనుకోని కారణాలవల్ల ఆ సినిమా నుండి నన్ను తీసేశారు. కానీ ఆరోజు చాలా బాధపడ్డాను. మంచి ఛాన్స్ మిస్ అయ్యానని. కానీ మళ్ళీ సమంత నిర్మాతగా చేసిన శుభం సినిమాలో అవకాశం రావడం చాలా సంతోషంగా అనిపించింది. అయితే ఈ సినిమా ఫస్ట్ డే షూటింగ్లో పాల్గొన్న సమయంలోనే నాకు చికెన్ గున్యా వచ్చింది”. అంటూ తెలిపింది.
సమంత – రాజ్ బంధం కొనసాగాలి – నటి మధుమణి
“ఆ తర్వాత సినిమా నుండి నన్ను తీసేస్తారని, సినిమా మిస్ అయినందుకు ఎంతో బాధపడిపోయాను.4 నెలలు ఇంట్లోనే ఉన్నాను. కానీ నా అదృష్టం కొద్దీ ఈ సినిమాలో నన్ను తీసివేయలేదు. 4 నెలల తర్వాత మళ్లీ శుభం సినిమాలో జాయిన్ అయ్యా. శుభం సినిమాలో నా క్యారెక్టర్ చూసి చాలామంది మెచ్చుకుంటున్నారు. ఈ క్యారెక్టర్ వల్ల నాకు మరో 6 సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు సమంతకు కృతజ్ఞతలు. రాజ్ నిడిమోరు, మీరు ఇద్దరు కలిసి శుభం మూవీతో మీ ప్రయాణాన్ని స్టార్ట్ చేశారు.ఈ ప్రయాణాన్ని ఎప్పటికీ ఆపకుండా ఎల్లప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. శతమానం భవతి” అంటూ దీవించింది.అయితే సీనియర్ నటి మధుమణి మాటలతో సమంత రాజ్ ల మధ్య ఉన్న బంధం అఫీషియల్ గా బయటపడింది.తాజాగా సమంత మేనేజర్ వీరి మధ్య ఏమి లేదని క్లారిటీ ఇచ్చినప్పటికీ సమంతతో వర్క్ చేసిన మధుమణి సమంత – రాజ్ ల బంధం ఇలాగే ఉండాలని దీవించడంతో వీరి మధ్య నిజంగానే రిలేషన్ ఉందని నెటిజన్స్ కామెంట్లు పెడుతున్నారు.
Nagarjuna : ఆ సినిమా చేయనంటే నేనే ఒప్పించా.. నాగార్జున సినిమాపై వెంకట్ బోల్డ్ కామెంట్స్