Saudi Arabia: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. ఏ పేరు గురించి చెప్పనక్కర్లేదు. ఫ్యూచర్ మరో 10 లేదా 20 ఏళ్ల దీని హవా కొనసాగవచ్చని అంచనా వేస్తున్నారు టెక్ నిపుణులు. వివిధ రంగాలకు క్రమంగా విస్తరిస్తోంది. ఏ రంగాన్ని కూడా వదల్లేదు ఏఐ. దీనివల్ల ఉద్యోగాలు పోతాయని పలు సంస్థలు, యువత గగ్గోలు పెడుతున్నారు. తాజాగా వైద్య రంగంలోకి ఎంట్రీ ఇచ్చేసింది. ప్రపంచంలో తొలి ఏఐ ఆసుపత్రి సౌదీ అరేబియాలో ప్రారంభమైంది.
వైద్య రంగంలో టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. చివరకు మనుషులకు బదులుగా యంత్రాలు చికిత్స అందించే రోజులు దగ్గరలో ఉన్నాయి. సౌదీ అరేబియాలో జరుగుతున్న ఓ ప్రయోగం ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. ప్రపంచంలోనే తొలిసారిగా ఏఐ ఆధారంగా రోగులకు వైద్య సేవలు అందించే క్లినిక్ సౌదీలో ప్రారంభమైంది. వైద్య చరిత్రలో ఇదొక మైలురాయిగా నిలిచిపోనుంది.
చైనాకు చెందిన మెడికల్ టెక్నాలజీ సంస్థ సిని ఏఐ-సౌదీ అరేబియాకు చెందిన అల్మూసా హెల్త్ గ్రూప్‌తో కలిసి శ్రీకారం చుట్టింది. లీడర్స్ మ్యాగజైన్ ఈ విషయాన్ని సంయుక్తంగా వెల్లడించాయి. రోగులు తమ సమస్యలను తొలుత ఏఐ డాక్టర్‌కు వివరిస్తారు. అవసరమైతే డాక్టర్లు రంగంలోకి దిగుతారు. లేకుండా ఏఐ డాక్టర్లు అన్నీ చూసుకుంటారు.
షాంఘై కేంద్రంగా పని చేస్తున్న సిని ఏఐ సంస్థ కీలక విషయాలు బయటపెట్టింది. ఏఐ అనేది వినూత్న వైద్య సేవల వ్యవస్థ. రోగిని ప్రశ్నించడం దగ్గర నుంచి మందులు సూచించడం వరకు కార్యకలాపాలను స్వతంత్రంగా నిర్వహిస్తారు ఏఐ డాక్టర్లు. కాకపోతే మానవ వైద్యులు రోగ నిర్ధారణ, చికిత్స ఫలితాలను సమీక్షించే భద్రతా పర్యవేక్షకులు (సేఫ్టీ గేట్‌కీపర్స్)గా వ్యవహరిస్తారని తెలిపింది.
ALSO READ: రక్తంలో నుంచి ప్లాస్మా తొలగించిన నిత్య యవ్వనుడు
ప్రస్తుతం ఏఐ డాక్టర్ శ్వాసకోశ సంబంధిత వ్యాధులకు మాత్రమే. ఉబ్బసం, గొంతు నొప్పి వంటి సుమారు 30 రకాల వ్యాధులు ఉన్నాయి. త్వరలో ఏఐ డాక్టర్ డేటాబేస్‌ను విస్తరించి మిగతా విభాగాలకు సేవలు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చైనా కంపెనీ మాట. శ్వాసకోశ, జీర్ణకోశ, చర్మ సంబంధిత వ్యాధులతో కలిపి మొత్తం 50 రకాల వ్యాధులకు సేవలు అందించాలన్నది సిని ఏఐ లక్ష్యం.
పైలట్ ప్రాజెక్టు కింద సేకరించిన రోగుల నిర్ధారణ డేటాను సౌదీ అధికారులకు అందజేస్తారు. ఏడాదిన్నర లోపు దీనికి ఆమోదం వస్తుందని అంచనా వేస్తోంది. ప్రస్తుతం ట్రయల్‌కు ముందు నిర్వహించిన పరీక్ష జరుగుతోంది. అందులో తప్పుల శాతం కేవలం 0.3 శాతం ఉందని ఆ కంపెనీ మాట.
గతంలో AI అనేది వైద్యులకు సహాయం మాత్రమే చేసిందని, ఇప్పుడు రోగులకు చికిత్స చేయడానికి ప్రయాణంలో చివరి అడుగు వేస్తున్నామని సిని AI CEO జాంగ్ షావోడియన్ అన్నారు. ఈ క్లినిక్‌కు వచ్చిన రోగులు ముందుగా ఏఐ డాక్టర్ డాక్టర్ హువాతో మాట్లాడతారు. వారికి ఒక టాబ్లెట్ కంప్యూటర్ ఇస్తారు.
రోగులు తమకున్న సమస్యలను ఆ టాబ్లెట్ ద్వారా ఏఐ డాక్టర్‌కు వివరిస్తారు. ఆ సమయంలో ఏఐ డాక్టర్.. రోగులను మరిన్ని ప్రశ్నలు అడుగుతుంది. మానవ డాక్టర్ల సాయంతో రోగి శరీర ఉష్ణోగ్రత, ఇతర డేటా చిత్రాలను సేకరించి విశ్లేషిస్తుంది.