Pushpa 2 movie pre release event : ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులంతా ఎదురుచూస్తున్న సినిమా పుష్ప 2. ఇదివరకే వచ్చిన పుష్ప సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. డిసెంబర్ 5న రిలీజ్ కాబోతున్న పుష్ప 2 సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఇక ఈ తరుణంలో ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది చిత్ర యూనిట్. ఈ ఈవెంట్ కు ముఖ్యఅతిథిగా ఎస్.ఎస్ రాజమౌళి హాజరయ్యారు. ఎస్ ఎస్ రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు సినిమాకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చిన ఘనత ఎస్ఎస్ రాజమౌళికి దక్కుతుంది. బాహుబలి లాంటి సినిమాను ఆలోచించడమే సాహసం అనుకుంటే, అటువంటి సినిమాను వెండితెరపై ఆవిష్కరించి తెలుగు సినిమా స్థాయిని పెంచారు.
ఇప్పటివరకు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఎస్ఎస్ రాజమౌళి రికార్డ్స్ ని ఎవరు బ్రేక్ చేయలేదు. పుష్ప సినిమా ఎస్.ఎస్.రాజమౌళి రికార్డ్స్ ను బ్రేక్ చేస్తుంది అని చాలామంది ఊహిస్తున్నారు. డిసెంబర్ 5న ఇది తెలియనుంది. ఎస్.ఎస్. రాజమౌళి విషయానికి వస్తే దర్శకుడు సుకుమార్ తో రాజమౌళికి మంచి పరిచయం ఉంది. మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వం వహించిన సినిమా నేనొక్కడినే. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా ఊహించిన సక్సెస్ సాధించలేకపోయింది. చాలామంది ఈ సినిమాను డిజాస్టర్ గా తేల్చి చెప్పేశారు. ఆ తరుణంలో ఎస్ ఎస్ రాజమౌళి ఈ సినిమా గురించి ఏకంగా సుకుమార్ తో ఒక ఇంటర్వ్యూ చేశాడు. ఆ ఇంటర్వ్యూలో చాలా అంశాలను వాళ్ళిద్దరూ చర్చించుకున్నారు. ఒక సందర్భంలో ఎస్ ఎస్ రాజమౌళి మాట్లాడుతూ నేను ఆర్య సినిమా చూసినప్పుడు నాకు సరైన పోటీ ఎవడో వచ్చాడు అనుకున్నాను. వీడితో పోటీ పెట్టుకోవడం కంటే కూడా ఫ్రెండ్షిప్ చేయడం చాలా ఈజీ అంటూ మీతో ఫ్రెండ్షిప్ చేయడం మొదలు పెట్టాను అని ఒక సందర్భంలో చెప్పుకొచ్చాడు.
ఇక ప్రస్తుతం కూడా సుకుమార్ తో ఉన్న ఫ్రెండ్షిప్ వాళ్ళనే రాజమౌళి ఈ ఈవెంట్ కి హాజరయ్యాడు అని చెప్పాలి. ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో వీరిద్దరికి ఉన్న గుర్తింపు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏదేమైనా రాజమౌళి రికార్డును సుకుమార్ క్రాస్ చేస్తాడా.? అని క్యూరియాసిటీ చాలామందిలో ఉంది. ఇక ఎస్ ఎస్ రాజమౌళి ఈ సినిమా ఈవెంట్ కి గెస్ట్ గా హాజరవ్వడంతో చాలామందికి రాజమౌళి ఏం మాట్లాడుతాడు అని ఆసక్తి పెరుగుతుంది. అలానే తన రికార్డ్స్ ప్రస్తావన తీసుకొస్తాడా అని ఆలోచన కూడా చాలామందికి ఉంది. ఏదేమైనా పుష్ప సినిమాకు రాజమౌళి ఏ స్థాయిలో ఎలివేషన్ ఇస్తాడని చాలామంది ఎదురు చేస్తున్నారు. ఈ ఈవెంట్ కి రాజమౌళి ముఖ్య అతిథిగా హాజరవ్వడం వెనక ఆంతర్యం ఏమిటో ఇంకొన్ని క్షణాల్లో తెలియనుంది.
Also Read : RGV On Media : నేను ఏ సినిమా షూటింగ్ చేస్తే నీకు ఎందుకు.?