BigTV English

KKR: కేకేఆర్ కెప్టెన్ గా ఆ డేంజర్ ప్లేయర్ ?

KKR: కేకేఆర్ కెప్టెన్ గా ఆ డేంజర్ ప్లేయర్ ?

KKR: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025  ( Indian Premier League 2025 ) మెగా టోర్నమెంట్ కు సంబంధించిన మెగా వేలం మొన్న జరిగిన సంగతి తెలిసిందే. నవంబర్ 24 అలాగే నవంబర్ 25వ తేదీలలో… ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ కు ( Indian Premier League 2025 )  సంబంధించిన మెగా వేలం నిర్వహించారు. ఇందులో చాలా మంది ప్లేయర్లు పాల్గొనడం జరిగింది. కానీ కొంత మంది పై కోట్ల వర్షం కురిస్తే… మరి కొంత మందిని కొనుగోలు చేయడానికి కూడా 10 ఫ్రాంచైజీలు ఆసక్తి చూపించలేదు.


Also Read: U19 Asia Cup India vs Japan: U 19 ఆసియా కప్ లో టీమిండియా గ్రాండ్ విక్టరీ..

దీంతో అజింక్య రహనే ( Ajinkya Rahane ) లాంటి ప్లేయర్లు Un Sold గా మిగిలిపోయారు. కానీ చివరికి అజింక్య రహనే ( Ajinkya Rahane ) ను… కేకేఆర్ జట్టు కొనుగోలు చేయడం జరిగింది. గత సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో కీలక రోల్ ప్లే చేశాడు అజింక్య రహనే ( Ajinkya Rahane ) . కానీ వేలంలో మాత్రం అజింక్య రహనే ( Ajinkya Rahane ) ను కొనుగోలు చేసేందుకు చెన్నై సూపర్ కింగ్స్ ఆసక్తి చూపించలేదు. కానీ ఎవరు కొనుగోలు చేయని అజింక్య రహనే ( Ajinkya Rahane ) ను కేకేఆర్ జట్టు కొనుగోలు చేసి సంచలనానికి తెర లేపింది.


అయితే అతన్ని కొనుగోలు చేసిన కేకేఆర్ జట్టు మరో సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వచ్చే సీజన్లో కేకేఆర్ జట్టు కెప్టెన్ గా అజింక్య రహనే ( Ajinkya Rahane )  ను ఫైనల్ చేయబోతున్నారట. ఈ మేరకు జట్టు సభ్యులతో కూడా కేకేఆర్ ఓనర్స్ చర్చించినట్లు తెలుస్తోంది. వాస్తవంగా కేకేఆర్ ప్లేయర్ అజింక్య రహానే.. పైన టెస్ట్ ప్లేయర్ అనే ముద్ర ఉంది. కానీ అప్పుడప్పుడు ఆయన ఫాస్ట్ ఇన్నింగ్స్ కూడా ఆడతాడు. జట్టును నడిపించగల సత్తా కూడా అతనికి ఉంది.

అందుకే అజింక్య రహనే ( Ajinkya Rahane ) ను కెప్టెన్ చేయాలని డిసైడ్ అయ్యారట. వాస్తవంగా వెంకటేష్ అయ్యర్ ను కెప్టెన్ చేస్తారని అందరూ అనుకున్నారు. కానీ చివరి క్షణంలో.. రహనేను ఫైనల్ చేశారట కేకేఆర్ జట్టు ఓనర్స్. కేకేఆర్ జట్టుతో పాటు లక్నో, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ( Royal Challengers Bangalore team ) లాంటి జట్లకు కూడా కొత్త కెప్టెన్స్ రాబోతున్నారు. లక్నోకు రిషబ్ పంత్ కెప్టెన్ అవుతారని ప్రచారం జరుగుతోంది.

Also Read: IND vs AUS 2nd Test: రెండో టెస్ట్‌ కోసం టీమిండియాలో భారీ మార్పులు..రోహిత్‌ ఎక్కడంటే ?

అటు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు కేఎల్ రాహుల్ సారథ్యం వహించబోతున్నారని సమాచారం. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ( Royal Challengers Bangalore team ) … భువనేశ్వర్ కుమార్ ను కెప్టెన్ చేయబోతున్నారట. ఇక పంజాబ్ కింగ్స్ కు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ అవుతారని చర్చ జరుగుతోంది. ఇక మిగతా జట్లకు ఎప్పటిలాగే కెప్టెన్స్ ఉండబోతున్నారు.

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×