BigTV English

Nandamuri Mokshagna: వారసుడు అప్పుడే రెండోదా.. తారకరత్నలా చేయడు కదా.. ?

Nandamuri Mokshagna: వారసుడు అప్పుడే రెండోదా.. తారకరత్నలా చేయడు కదా.. ?

Nandamuri Mokshagna: వారసుడు ఎప్పుడు వస్తాడు.. ?  వారసుడు ఎప్పుడు వస్తాడు.. ? అని  ఎన్నో ఏళ్లుగా నందమూరి అభిమానులు ఎదురుచూస్తూ వచ్చారు. ఇక ఎట్టకేలకు  ఈ ఏడాది వారసుడు దిగాడు.  నందమూరి బాలకృష్ణ నట వారసుడిగా నందమూరి మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ ఈ ఏడాది జరిగింది. తన కొడుకు తెరంగేట్రం బాధ్యతలు  బాలయ్య  సీనియర్ చేతుల్లో పెడతాడేమో అనుకున్నారు కానీ, జనరేషన్ కు తగ్గట్టు ఆలోచించి నట సింహం..  కొడుకును టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ చేతిలో పెట్టాడు.


ఈ ఏడాది హనుమాన్ తో పాన్ ఇండియా లెవెల్లో భారీ విజయాన్ని అందుకున్న ప్రశాంత్ వర్మ.. మోక్షును సింబాగా చూపించడానికి సిద్దమయ్యాడు. మోక్షు హీరోగా నటిస్తున్న సింబా చిత్రం ఈ మధ్యనే పట్టాలెక్కింది. ఇక ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయిన దగ్గరనుంచి.. ఈ సినిమాలో  ఆ స్టార్ హీరోయిన్ కూతురు నటిస్తుంది అంటే.. ఈ స్టార్ హీరోయిన్ కూతురు నటిస్తుందని పుకార్లు షికార్లు చేశాయి. ఇక చివరికీ ఏ హీరోయిన్ కూతురు నటిస్తుంది అనేది క్లారిటీ కూడా రాలేదు.

Vedhika: పిల్ల భలే.. దీని ఫిగర్ భలే.. అసలైన యక్షిణి కూడా ఇంత అందంగా ఉండదేమో


ఇక ఇవన్నీ పక్కన పెడితే.. మోక్షు అప్పుడే రెండో సినిమాను కూడా లైన్లో పెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మొదటిదే ఇంకా ఫినిష్ అవ్వలేదు.. అప్పుడే రెండోదా.. ? అనే అనుమానం రావచ్చు. కానీ, వారసుడు ఒక్కసారి రంగంలోకి దిగాడు అంటే.. ఇక ఆపడం కష్టమే అని అనుకోవడమే. అందుతున్న సమాచారం ప్రకారం.. మోక్షజ్ఞ  రెండో సినిమాకు వెంకీ  అట్లూరి దర్శకత్వం వహిస్తున్నాడట.

సార్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నా వెంకీ.. ఆ హిట్ పరంపరను కొనసాగిస్తూ ఈ ఏడాది లక్కీ భాస్కర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దీపావళీ  కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. దీంతో  ఈ హిట్ డైరెక్టర్ ను కూడా బాలయ్య లిస్ట్ లో పెట్టేసాడని తెలుస్తోంది. ఇప్పటికే కథా చర్చలు జరుగుతున్నాయని అంటున్నారు.

RGV On Media : నేను ఏ సినిమా షూటింగ్ చేస్తే నీకు ఎందుకు.?

అంతేకాకుండా ఈ మధ్యనే మోక్షు కొత్త లుక్ లీక్ అయ్యింది. మొదటి సినిమాకు ఉన్న లుక్ కాకుండా.. కొత్తగా కనిపించడంతో.. వెంకీ సినిమా కోసమే ఈ లుక్ మేకోవర్ చేస్తున్నట్లు టాక్ నడుస్తోంది. అయితే ఇక్కడ ఫ్యాన్స్ మాత్రం కొద్దిగా ఆందోళనకు గురవుతున్నారు.

మొదటి  సినిమా హిట్ అయ్యి.. నిదానంగా ఆచితూచి అడుగులు వేయడం బెటర్ అని.. ఇలా వరుస సినిమాలు ఒప్పుకొని ఒకేసారి రిలీజ్ లు చేస్తే అంచనాలు అందుకోవడం కష్టమవుతుందని చెప్పుకొస్తున్నారు. అంతేకాకుండా  మోక్షును నందమూరి తారకరత్నతో పోలుస్తున్నారు.

NTR Meal: ఎన్టీఆర్ ఫ్యాన్స్ కొత్త ప్రయోగం.. పేదవారి ఆకలి తీర్చేలా..

తారకరత్న మొదటి సినిమా  ఒకటో నెంబర్ కుర్రాడు  రిలీజ్ కాకముందే.. ఆయన ఒకేసారి 5 సినిమాలను లైన్లో పెట్టాడట. అయితే మొదటి సినిమా తప్ప మిగతా సినిమాలు కొన్ని పట్టాలెక్కాయి.. కొన్ని మధ్యలోనే ఆగిపోయాయి.

ఇక ఇప్పుడు మోక్షు కూడా ఇలానే వరుస సినిమాలు చేయకుండా.. ఆలోచించి చేస్తే బావుంటుందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. అయితే మోక్షు వెనుక బాలయ్య బాబు ఉండడంతో అంతా  ఆయనే చూసుకుంటాడు అనే దైర్యం కూడా ఉందని చెప్పుకొస్తున్నారు. మరి ఇందులో నిజమెంత అనేది  తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు ఆగాల్సిందే.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×