BIG TV Kissik Talk Show:రాజీవ్ కనకాల ఈ పేరు గురించి పెద్దగా పరిచయం చేయనవసరం లేదు. నటుడిగా అందరికీ సుపరిచితమే, ఈ మధ్యకాలంలో రాజీవ్ ఎక్కువగా సినిమాల్లో కనిపించడం లేదు. అడపా దడపా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. రీసెంట్ గా హోమ్ టౌన్ వెబ్ సిరీస్ లో నటించి మెప్పించారు. ఆయన నటించిన హోమ్ టౌన్ అనే వెబ్ సిరీస్ ఆహా లో ప్రసారమైంది. రాజీవ్ కనకాల, ఝాన్సీ ముఖ్యపాత్రలు పోషించిన ఈ సిరీస్ ని 90 బయోపిక్ మేకర్స్ వారు నిర్మించారు. నవీన్ మేడారం నిర్మాణంలో 90స్ ఏ మెలోడీ క్లాసిక్ బయోపిక్ తర్వాత ఈ హోమ్ టౌన్ ని నిర్మించడం జరిగింది. ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో రాజీవ్ కనకాల యాక్టివ్ గా పాల్గొంటున్నాడు. ఈ క్రమంలోనే బిగ్ టీవీ కిస్సిక్ షో లో రాజీవ్ కనకాల యాంకర్ వర్షతో ముచ్చటించారు. తన వెబ్ సిరీస్ సంబంధించిన విషయాలతో పాటు వ్యక్తిగత, తారక్ కి తనకి మధ్య ఉన్న బాండింగ్ గురించి కూడా పంచుకున్నారు. రాజీవ్ తారక్ గురించి ఏం మాట్లాడారో ఇప్పుడు చూద్దాం.
జూనియర్ ఎన్టీఆర్ చిల్డ్రన్స్ డే వచ్చిందంటే నా ఫోన్ పట్టుకోవాలంటే భయం అని చెప్పారు. దాని గురించి మీరు చెప్పండి అని అడిగిన యాంకర్ వర్ష ప్రశ్నకి రాజీవ్ సమాధానం ఇస్తూ ” తారక్ నేను క్లోజ్ ఫ్రెండ్స్. తను చిన్న వయసులోనే పెద్ద హీరో అయిపోయాడు. మేమిద్దరం కలిసి చాలా సార్లు వర్క్ చేశాము. తను నాకన్నా ఎక్కువ వర్క్ చేసేవాడు. తన వయసుకి మించి తను ఎక్కువ కష్టపడేవాడు. నాకన్నా వయసులో చిన్నవాడే కదా.. అందుకని నేను నా ఫోన్లో చిన్న పిల్లాడి పేరుతో తన నేమ్ ని సేవ్ చేసుకొని, తనకి అదే పేరుతో చిల్డ్రన్స్ డే రోజు మెసేజ్ చేసే వాడిని. ప్రతి సంవత్సరం చిల్డ్రన్స్ డే రోజు కచ్చితంగా మెసేజ్ చేసేవాడిని. ఆ మెసేజ్ చూసి తారక్ కి కోపం వచ్చేది. నేను అలా మెసేజ్ చేయటం తనకి నచ్చదు. అయినా కానీ నేను చేసేవాడిని. అయితే తారక్ నుంచి మీకు రిప్లై ఏం రాదా అని అడుగగా.. ఒక్కొక్కసారి రిప్లై ఏమి ఇవ్వడు కానీ, తనకి కోపం వచ్చిందంటే మాత్రం భయంకరంగా బూతులు తిట్టి మెసేజ్ చేసేవాడు. నాకు కూడా తారక్ అలా ఉండడమే ఇష్టం. ఏదో సరదాగా ఇద్దరం మంచి స్నేహితులుగా అలా బూతులు తిట్టుకుంటూ ఉంటాము అని నవ్వుతూ సమాధానం ఇచ్చారు రాజీవ్.
మీరు ఇప్పటికే ఆయనను రెగ్యులర్ గా కలుస్తారా అని వర్షా అడగడంతో ” ఇప్పుడంటే కొంచెం బిజీగా ఉంటున్నాడు. అయినా టైం చూసుకుని నేను వాళ్ళింటికి వెళ్తూనే ఉంటాను. ఇద్దరికీ కాస్త టైం దొరికినప్పుడల్లా ఒకరినొకరం కలుస్తాం. వాళ్ళింటికి వెళ్లినప్పుడు నాకోసం స్పెషల్ గా వంట చేసి పెడతాడు. పైనాపిల్ కర్రీ తారక్ చేస్తాడు. ఆ రుచే వేరు. అది మీకు ఎక్కడ దొరకదు. ఎప్పుడైనా నేనే కుదిరినప్పుడు తారక్ తో చెప్పి యూట్యూబ్ లో ఒక వీడియో చేసి పెట్టమని చెప్తాను. అది చాలా బాగుంటుంది. నాకు చాలా ఇష్టం కూడా అని రాజీవ్ తన మనసులో ఎన్టీఆర్ పై ప్రేమని మరోసారి బయటపెట్టారు .