Rajendra Prasad: టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు నటకిరీటి రాజేంద్రప్రసాద్ (Rajendra Prasad)ఇటీవల కాలంలో పలు వివాదాలలో నిలుస్తున్నారు. ముఖ్యంగా సినిమా వేదికలపై ఈయన ఇతరులను ఉద్దేశించి మాట్లాడే మాటల కారణంగా వార్తల్లో నిలుస్తున్నారు.ఇటీవల పుష్ప సినిమా గురించి హీరో గురించి నోరు జారారు. అలాగే ప్రముఖ క్రికెటర్ డేవిడ్ వార్నర్ గురించి కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇటీవల ప్రముఖ డైరెక్టర్ ఎస్వి కృష్ణారెడ్డి పుట్టినరోజు వేడుకలలో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆలీని ఉద్దేశించి ఈయన మాట్లాడిన వ్యాఖ్యలు తీవ్రదుమారం రేపాయి.
కూతురు పోయిన బాధలో….
ఈ వేదికపై ఎంతోమంది సినిమా సెలబ్రిటీల ముందు రాజేంద్రప్రసాద్ ఆలీని దుర్భాషలాడారు. ఇక ఈ ఘటన గురించి సోషల్ మీడియాలో రాజేంద్రప్రసాద్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. ఇలా రాజేంద్రప్రసాద్ గురించి తప్పుగా సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్న నేపథ్యంలో ఈ ఘటన గురించి వెంటనే ఆలీ స్పందిస్తూ ఒక వీడియో విడుదల చేశారు. ఆయన నా కంటే పెద్దవారు, కుటుంబ సభ్యులతో సమానం. పొరపాటున ఏదో నోరు జారారే తప్ప ఉద్దేశపూర్వకంగా అనలేదని దీంట్లో ఎవరు తప్పు పట్టాల్సిన పని లేదంటూ అలీ వివరణ ఇచ్చారు. ఇటీవల తన కుమార్తె చనిపోవడంతో ఆయన ఆ బాధలో ఉన్నారని, ఈ విషయాన్ని ఎవరు సీరియస్ గా తీసుకోవద్దని కోరారు. ఇకపోతే తాజాగా ఈ ఘటన గురించి నటుడు రాజేంద్రప్రసాద్ ఏకంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని క్లారిటీ ఇచ్చారు.
అందరిని గొప్పగా పొగిడాను…
తాను ఎస్ వి కృష్ణారెడ్డి పుట్టినరోజు వేడుకలలో భాగంగా మాట్లాడిన విషయాలను ఉద్దేశపూర్వకంగా అనలేదని తెలిపారు. అక్కడ ఉన్నదంత నా కుటుంబమే అనుకున్నాను. అక్కడ కెమెరాలు ఉన్నాయి అనే విషయాన్ని నేను ఆలోచించలేదని నా కుటుంబంతో మాట్లాడినట్లే మాట్లాడానని తెలిపారు. నేను అందరిని పొగుడుతూ మాట్లాడాను. మీరు ఫుల్ వీడియో చూస్తే అర్థమవుతుంది. పూర్తి వీడియో కాకుండా ముక్కలు ముక్కలుగా చూసి నన్ను తప్పు పట్టడం సరైంది కాదని తెలిపారు. నేను మాట్లాడిన మాటలు గురించి అలీ స్పందిస్తూ నేను మాట్లాడిన దాంట్లో తప్పు లేదని చెప్పారు. అలాంటప్పుడు మీకెందుకు బాధ అంటూ రాజేంద్రప్రసాద్ ప్రశ్నించారు. ఈ ఘటన ద్వారా నేను ఒక విషయాన్ని అర్థం చేసుకున్నానని తెలిపారు.
ఇకపై నాకంటే పెద్దవాళ్ళైనా సరే, చిన్నవాళ్ళైనా సరే నేను వారిని ఏకవచనంతో పిలవను, ప్రతి ఒక్కరిని మర్యాదపూర్వకంగా బహువచనంతోనే పిలుస్తానని తెలిపారు. విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు గారు కూడా అలాగే అందరిని మర్యాదపూర్వకంగా పిలిచేవారు. ఇకపై నేను చచ్చేవరకు అందరిని మర్యాదపూర్వకంగా బహువచనంతోనే పిలుస్తాను తప్ప ఏక వచనంతో పిలిచనని ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం అలీ వివాదంపై రాజేంద్రప్రసాద్ చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.మరి ఇప్పటికైనా ఈ వివాదం గురించి సోషల్ మీడియాలో రాజేంద్రప్రసాద్ పై వచ్చే విమర్శలు ఆగుతాయా లేదా అనేది తెలియాల్సి ఉంది.