Rajendra Prasad :రాజేంద్రప్రసాద్ (Rajendra Prasad).. నట కిరీటిగా పేరు సొంతం చేసుకున్న ఈయన.. విలక్షణమైన నటనతో ఆడియన్స్ లో చెరగని ముద్ర వేసుకున్నారు. ముఖ్యంగా కామెడీ హీరోగా తన సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకొని .. మరొకవైపు స్టార్ హీరోల సినిమాలలో సెకండ్ హీరో పాత్రలు కూడా చేసి మెప్పించారు. ప్రస్తుతం వయసు మీద పడడంతో తన వయసుకు తగ్గట్టుగా హీరోలకు తండ్రిగా, మామగా పాత్రలు పోషిస్తూ ఆకట్టుకుంటున్నారు. ఇదిలా ఉండగా ఇటీవలే తన కూతురు స్వర్గస్తులైన విషయం తెలిసిందే. ఆ బాధ నుంచి బయటపడలేకపోతున్న రాజేంద్రప్రసాద్ అప్పుడప్పుడు మాట్లాడుతున్న మాటల కారణంగా ఇండస్ట్రీలో విమర్శలకు గురి అవుతున్నారు.
అందులో భాగంగానే ఇటీవల ఎస్వీ కృష్ణారెడ్డి పుట్టినరోజు వేడుకల్లో భాగంగా కమెడియన్ అలీ (Comedian Ali), రోజా (Heroine Roja) ల గురించి చేసిన అసభ్యకర పదజాలం ఆయనపై పూర్తిస్థాయిలో నెగిటివిటీని క్రియేట్ చేసింది. దీనిపై స్పందించిన రాజేంద్రప్రసాద్ నేను ఇలాగే మాట్లాడుతాను మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని కూడా చెప్పారు. దీంతో రాజేంద్రప్రసాద్ పై కొంతమంది నెగటివ్ గా రూమర్స్ క్రియేట్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రాజేంద్రప్రసాద్ చేత మాటలు పడ్డ అలీ కూడా “ఆయన పెద్దవారు.. ఏదో సందర్భంలో మాటలు తుల్లాయే తప్ప ఆయన కావాలని అనలేదు. దయచేసి ఆయనను ఎవరు ఏమి అనకండి” అంటూ కూడా చెప్పిన విషయం తెలిసిందే.
‘ మాస్ జాతర’ స్టోరీ లీక్ చేసిన రాజేంద్రప్రసాద్..
ఇకపోతే సోషల్ మీడియాలో రాజేంద్ర ప్రసాద్ పై నెగిటివిటీ పెరిగిపోతున్న నేపథ్యంలో.. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రాజేంద్రప్రసాద్ ఈ విషయాలపై స్పందిస్తూనే మరొకవైపు అనూహ్యంగా రవితేజ (Raviteja) ‘మాస్ జాతర’ స్టోరీ కూడా లీక్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ముఖ్యంగా రాజేంద్రప్రసాద్ చెప్పిన ఈ స్టోరీ విని.. రాజేంద్రప్రసాద్ స్పృహలోనే ఉన్నారా..? ఫ్లోలో ఇలా స్టోరీ చెప్పేసాడు ఏంటి? అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి అసలు విషయం ఏంటో ఇప్పుడు చూద్దాం.
సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న మాస్ మహారాజా రవితేజ, ప్రముఖ డైరెక్టర్ భాను భోగవరపు (Bhanu Bhogavarapu) దర్శకత్వంలో చేస్తున్న చిత్రం ‘మాస్ జాతర’. ఈ చిత్రంలో యంగ్ బ్యూటీ శ్రీలీల(Sree Leela) హీరోయిన్గా నటిస్తోంది. ఇకపోతే రవితేజ – శ్రీ లీల కాంబినేషన్లో ఇది వరకే ‘ధమాకా’ సినిమా వచ్చి బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మాస్ జాతర : మనదే ఇదంతా అనే ట్యాగ్ లైన్ తో వస్తున్న ఈ సినిమా ఆగస్టు 27వ తేదీన వినాయక చవితి సందర్భంగా విడుదల చేయబోతున్నట్లు ఇటీవల రవితేజ ఇంస్టాగ్రామ్ వేదికగా పోస్టర్తో పాటు రిలీజ్ డేట్ ప్రకటించారు.
మాస్ జాతర స్టోరీ ఇదేనా?
ఇకపోతే విడుదలకు కేవలం రెండు నెలలు మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇలాంటి టైమ్ లో రాజేంద్రప్రసాద్ ఇలా స్టోరీ లీక్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. “మాస్ జాతర సినిమాలో రవితేజ, నేను తాతా-మనవడి క్యారెక్టర్లలో నటిస్తున్నాము. సాయంకాలం అయితే చాలు మందేసి మరీ ఇద్దరం కొట్టేసుకుంటాము. బ్రహ్మాండంగా రాయబడి, అంతకుమించిన బ్రహ్మాండంగా సినిమా చిత్రీకరణ జరుగుతోంది. థియేటర్లలో మీరంతా నవ్వి నవ్వి సగం చచ్చిపోతారు” అంటూ సినిమా స్టోరీ రిలీజ్ చేశారు రాజేంద్రప్రసాద్. ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇకపోతే ఈ విషయం తెలిసి అభిమానులు కూడా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. అటు తాత – మనవడి మధ్య వచ్చే సన్నివేశాలతో పాటు కామెడీ సన్నివేశాల కోసం ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఆగస్టు 27న థియేటర్లలో చేయబోయే రచ్చ ఎలా ఉంటుందో చూడాలి.
ALSO READ:Benz Promo: రాఘవ లారెన్స్ బెంజ్ ప్రోమో రిలీజ్.. లోకేష్ యూనివర్స్‌లో కొత్త విలన్!