Indian Railways Jagriti Yatra: దేశ వ్యాప్తంగా ఎన్నో పర్యాటక ప్రదేశాలు, ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. వాటన్నింటినీ రైలు ప్రయాణం ద్వారా ఎక్స్ ప్లోర్ చేయాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అలాంటి వారి కోసం భారతీయ రైల్వే ఓ అద్భతమైన అవకాశాన్ని కల్పిస్తోంది. అతి తక్కువ ఖర్చుతో ఏకంతా దేశ వ్యాప్తంగా మేజర్ సిటీలను చుట్టి వచ్చేలా ఈ యాత్రను ప్లాన్ చేసింది. 15 రోజుల పాటు 8,000 కిలో మీటర్ల మేర కొనసాగుతుంది. ఈ యాత్ర ఏడాదికి ఒకేసారి ఉంటుంది. ఈ రైలుకు సంబంధించి టికెట్ ఛార్జీలు, రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
జాగృతి యాత్ర.. ఏడాదికి ఒకేసారి!
జాగృతి యాత్ర పేరుతో 2008 నుంచి ఈ రైలు నడుస్తుంది. కానీ, చాలా మందికి ఇప్పటికీ ఈ రైలు గురించి తెలియదు. ఈ రైలు లక్ష్యం పెంట్రపెన్యూర్ ద్వారా భారతదేశాన్ని బలంగా నిర్మించడం. ఈ రైలు ప్రయాణం ద్వారా యువత, ఎంట్రపెన్యూర్స్ గా ఎలా మారాలని తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఈ రైలులో కేవలం 500 మంది మాత్రమే ప్రయాణించడానికి అవకాశం ఉంటుంది. వీరిని ఎంట్రపెన్యూర్స్ గా ఎలా ఎదగాలనే అంశానికి సంబంధించి అవగాహన కల్పిస్తారు. ఈ ప్రయాణం 15 రోజుల పాటు 8,000 కిలో మీటర్ల దూరం ప్రయాణించే అవకాశం ఉంటుంది.
జాగృతి యాత్ర ఎక్కడి నుంచి ప్రారంభం అవుతుందంటే?
యువతకు ఎంతగానో ఉపయోగపడే ఈ యాత్ర ఢిల్లీ నుంచి ప్రారంభమవుతుంది. ఈ రైలు మొదటి స్టాప్ అహ్మదాబాద్. తరువాత ముంబై. ఆ తర్వాత బెంగళూరు మీదుగా మధురైకి చేరుకుంటుంది. అక్కడి నుంచి ఒడిశాకు వెళ్తుంది. అటు నుంచి మళ్లీ ఢిల్లీకి చేరుకుంటుంది. ఈ ప్రయాణంలో యువతీ యువకులను అనేక పుణ్యక్షేత్రాలతో పాటు పర్యాటక ప్రదేశాలకు తీసుకెళ్తారు.
2025లో ప్రయాణం ఎప్పుడు?
ఈ రైలు ప్రయాణం ప్రతి ఏటా నవంబర్ నుంచి ప్రారంభం అవుతుంది. ఈ యాత్రకు సంబంధించి ముందుగానే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రైలులో ప్రయాణించే వారి వయసు 21 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. ఈ ఏడాది జాగృతి యాత్రం నవంబర్ 7న ప్రారంభమై నవంబర్ 22న ముగుస్తుంది.
టికెట్ ధర ఎంత? ఎలా బుక్ చేసుకోవాలి?
ఇతర రైళ్లతో పోల్చితే ఈ రైలులో ప్రయాణ ఛార్జీలు చాలా తక్కువ. ఒకవేళ మీరు ఈ యాత్ర నిబంధనల పరిధిలోకి వస్తే, 15 రోజుల ప్రయాణానికి కేవలం రూ. 25 చెల్లిస్తే సరిపోతుంది. https://www.jagritiyatra.com/ లో ఈ యాత్రకు సంబంధించిన టికెట్ బుక్ చేసుకోవచ్చు. నవంబర్ లో మొదలయ్యే ఈ యాత్రకు అక్టోబర్ 15 నుంచి టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. ఈ రైలులో ప్రయాణించాలనకునే యువతను బాగా ఫిల్టర్ చేసిన తర్వాతే ఎంపిక చేస్తారు.
ఈ యాత్రతో కలిగే లాభం ఏంటి?
జాగృతి యాత్ర ద్వారా యువత కొత్త వ్యక్తులను కలుస్తారు. ఎప్పుడూ చూడని ప్రదేశాలను చూసే అవకాశం ఉంటుంది. ఆయా ప్రదేశాల గొప్పదనం తెలుసుకోవచ్చు. దేశంలోని ఆఫ్ బీట్ ప్రదేశాలను అన్వేషించడానికి మీకు ఈ యాత్ర ఎంతగానో ఉపయోగపడుతుంది.
Read Also: జపాన్ లో ఆహా అనిపించే అద్భుతమైన ఎయిర్ పోర్టులు, చూస్తే, ఆశ్చర్యపోవడం పక్కా!