Rajinikanth Coolie: సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) ఇప్పటికే తన సినిమాల ద్వారా ఎన్నో రికార్డులు క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు రెమ్యునరేషన్ తో కూడా సరికొత్త రికార్డు సృష్టించబోతున్నారు. ముఖ్యంగా ఆసియాలోనే అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటున్న హీరోగా నిలవబోతున్నారు సూపర్ స్టార్ రజనీకాంత్. ఇక అసలు విషయంలోకి వెళ్తే.. డైరెక్టర్ లోకేష్ కనగరాజు (Lokesh Kanagaraju) దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన చిత్రం కూలీ (Coolie). టాలీవుడ్ కింగ్ నాగార్జున(Nagarjuna ) ఇందులో కీలకపాత్ర పోషిస్తున్నారు. అలాగే ప్రముఖ స్టార్ హీరోయిన్ శృతిహాసన్ (Shruti Haasan), పూజా హెగ్డే (Pooja Hegde) హీరోయిన్లుగా నటిస్తున్నారు. దీనిని సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన గ్లింప్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోగా.. ఈ సినిమా ఆగస్టు 14వ తేదీన థియేటర్లలో చాలా గ్రాండ్ గా విడుదల కాబోతోంది.
ఆసియాలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోగా రజనీకాంత్..
ఇకపోతే విడుదలకు కేవలం రెండు నెలలు మాత్రమే మిగిలి ఉన్న నేపద్యంలో అటు షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. అసలు వివరాల్లోకి వెళ్తే.. ఈ సినిమా కోసం సూపర్ స్టార్ రజినీకాంత్ సుమారుగా రూ.260 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. దాదాపు రూ.400 కోట్లకు పైగా బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో నాగార్జున కీలక పాత్ర పోషిస్తున్నందుకు గానూ రూ. 24 కోట్లు తీసుకుంటున్నట్లు ఒక ప్రముఖ మీడియా సంస్థ వెల్లడించింది. ఇక ఈ చిత్రంతో రజినీకాంత్ ఆసియాలోనే అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోగా నిలవబోతున్నారని చెప్పవచ్చు. మొత్తానికైతే ఈ వార్త సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. ఇక దీనిపై చిత్ర బృందం అధికారికంగా ప్రకటిస్తుందేమో చూడాలి.
రజినీకాంత్ కెరియర్..
రజనీకాంత్ విషయానికి వస్తే.. కర్ణాటకలో బస్ డ్రైవర్ గా కెరియర్ మొదలుపెట్టి, ఆ తర్వాత నాటకాలు వేసేవారు. నాటకాలు ప్రదర్శిస్తున్న సమయంలోనే సినిమాలలో అవకాశాల కోసం ఎంతో ప్రయత్నం చేసిన ఈయనకు అనూహ్యంగా సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. ఇక అలా కోలీవుడ్ , టాలీవుడ్ భాషా చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా పాత్రలు పోషించి ప్రేక్షకులను అలరించిన రజనీకాంత్..ఆ తర్వాత హీరోగా మారారు ఇక ఇప్పుడు భాషతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్న విషయం. మొత్తానికైతే భారీ అంచనాల మధ్య ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్న రజినీకాంత్ ఇప్పుడు కూలి సినిమాతో ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధమయ్యారు.ఈ సినిమా తరువాత జైలర్ 2 సినిమా షూటింగ్ కూడా పూర్తి చేసి త్వరలోనే విడుదలకు సిద్ధం చేయబోతున్నారని చెప్పవచ్చు. మరి ఏడుపదుల వయసులో కూడా వరుస సినిమాలతో, యాక్షన్ పర్ఫామెన్స్ తో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారని చెప్పవచ్చు.
ALSO READ:Vijay Sethupathi: మహారాజ సీక్వెల్ కథ సిద్ధం.. షూటింగ్ ఎప్పుడంటే..?