BigTV English

AP Liquor case: జగన్‌కి మరిన్ని కష్టాలు? నిందితులకు సుప్రీంకోర్టులో ఊహించని షాక్.. సిట్ సోదాలు

AP Liquor case: జగన్‌కి మరిన్ని కష్టాలు? నిందితులకు సుప్రీంకోర్టులో ఊహించని షాక్.. సిట్ సోదాలు

AP Liquor case: ఏపీ లిక్కర్ స్కామ్‌లో రేపో మాపో కీలక పరిణామం చోటు చేసుకోనుందా? ఈ వ్యవహారం అంతా తాడేపల్లికి ప్యాలెస్‌కు చుట్టుకుంటుందా? సుప్రీంకోర్టు బెయిల్ రిజెక్ట్ చేయడంతో నిందితుల అరెస్టుల పర్వం కొనసాగనుందా? ఈ వ్యవహారంలో సిట్ దూకుడుగా వెళ్తోందా? జగన్‌కు అప్పటి కార్యదర్శి ధనుంజయరెడ్డి, ఓఎస్‌డీ కృష్ణమోహన్‌రెడ్డి, వ్యక్తిగత కార్యదర్శి కేఎన్‌ఆర్‌ నివాసాల్లో తనిఖీల వెనుక ఏం జరుగుతోంది? ఇవే ప్రశ్నలు వైసీపీ నేతలను వెంటాడుతున్నాయి.


ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ముగ్గురు నిందితులకు సుప్రీంకోర్టులో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. కృష్ణమోహన్‌రెడ్డి, ధనుంజయరెడ్డి, గోవిందప్పకు ముందస్తు బెయిల్‌ ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది. ఈ ముగ్గురు వేసిన పిటిషన్‌పై న్యాయస్థానం గురువారం విచారణ చేపట్టింది. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం తరపున ముకుల్‌ రోహత్గి వాదనలు వినిపించారు.

హైకోర్టులో విచారణ జరుగుతున్నప్పుడే నిందితులు సుప్రీంకోర్టులో మధ్యంతర బెయిల్ పిటిషన్ దాఖలు చేశారని వివరించారు. ఆ పిటిషన్‌ ఇప్పుడు విచారణకు ఆమోద యోగ్యం కాదన్నారు. హైకోర్టులో ముందస్తు బెయిల్ నిరాకరించినందున నిందితులు గతంలో దాఖలు చేసిన పిటిషన్‌ను సవరించాలన్నారు. లేకుంటే కొత్త పిటిషన్‌ను దాఖలు చేయాల్సి ఉంటుందన్నారు.


రాష్ట్ర ప్రభుత్వం తరపున అడ్వకేట్ వాదనలనతో ధర్మాసనం ఏకీభవించింది. ఈలోగా నిందితుల తరపు న్యాయవాది జోక్యం చేసుకున్నారు. కొత్తగా పిటిషన్ దాఖలు చేయడానికి అనుమతివ్వాలని కోరారు. అందుకు ధర్మాసనం అనుమతించింది. ఈ నెల 13వ వరకు మధ్యంతర రక్షణ కల్పించాలని నిందితుల తరపు న్యాయవాది అభ్యర్థించారు.

ALSO READ: పాకిస్తాన్‌కు కేఏ పాల్.. మోదీతో బిగ్ టాస్క్

ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో మధ్యంతర రక్షణ ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పింది న్యాయస్థానం. మిమ్మల్ని మీరే రక్షించుకోవాలని వ్యాఖ్యానించారు న్యాయమూర్తి. తదుపరి విచారణను ఈ నెల 13కు వాయిదా వేసింది.

సుప్రీంకోర్టులో నిందితులకు చుక్కెదురు కావడంతో సిట్ దూకుడు పెంచింది. మరోవైపు విజయవాడలోని వెటర్నరీ కాలనీలో జగన్‌కు అప్పటి కార్యదర్శి ధనుంజయరెడ్డి, ఓఎస్‌డీ కృష్ణమోహన్‌రెడ్డి, వ్యక్తిగత కార్యదర్శి కేఎన్‌ఆర్‌ నివాసాల్లో సోదాలు చేసింది. వారి ఇళ్ల నుంచి కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

వైసీపీ హయాంలో మద్యం కుంభకోణంలో వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ప్రభుత్వం ప్రధాన ఆరోపణ. దీనిపై లోతుగా విచారణ చేపట్టింది. కృష్ణమోహన్‌రెడ్డి, ధనుంజయరెడ్డి, భారతి సిమెంట్స్‌ పూర్తికాలపు డైరెక్టర్‌ గోవిందప్పలను సిట్‌ నిందితులుగా చేర్చింది. వీరిని ఏ 31, 32, 33 నిందితులుగా చేర్చింది.

ముడుపుల వసూళ్లు, మద్యం పాలసీ సిద్ధం చేయాలనే కుట్రకు రూపకల్పన చేసిన ప్రధాన నిందితుడు ఏ-1 రాజ్‌ కెసిరెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, ఆ పార్టీ మాజీ నేత విజయసాయిరెడ్డిలు ఈ కుంభకోణంలో భాగస్వాములు అయ్యారని గుర్తించింది సిట్. ఈ లెక్కన రేపోమాపో అరెస్టు జరిగే అవకాశం ఉందని అంటున్నారు కొందరు అధికారులు.

Related News

Andhra Is Back: ఆంధ్రా ఈజ్ బ్యాక్.. కూటమి కొత్త నినాదం..

Nara Lokesh: ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలిస్తామని మాటిచ్చాం.. అందుకే ఇంత కష్టపడుతున్నాం

AP Students: ఏపీ విద్యార్థులకు ఎంజాయ్.. వరుసగా మూడు రోజులు సెలవులు

AP Rain Alert: బిగ్ అలర్ట్.. రెండు రోజులు భారీ వర్షసూచన.. ఆ జిల్లాలలో ఎఫెక్ట్ ఎక్కువే!

AP new bar policy: ఏపీలో కొత్త బార్ పాలసీ.. ఇకపై మందుబాబులకు అక్కడ కూడా కిక్కే!

AP Cabinet: గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ కేబినెట్.. ఒకటి కాదు సుమా.. అవేమిటంటే?

Big Stories

×