Vijay Sethupathi:మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి (Vijay Sethupathi ) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. కోలీవుడ్ లో ఒకప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలు చేస్తూ ప్రేక్షకులను మెప్పించిన ఈయన.. ఈ మధ్య హీరోగా కూడా పలు సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఇదిలా ఉండగా ఈయన ప్రధాన పాత్రలో, నిథిలన్ స్వామినాథన్ (Nithilan Swaminathan) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మహారాజా (Maharaja). ఎటువంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఊహించని విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక గత ఏడాదిలో అటు కమర్షియల్ గానే కాకుండా ఇటు కథ పరంగా కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ సినిమా. ఈ సినిమాను దర్శకుడు తెరకెక్కించిన తీరు ఒక ఎత్తైతే.. అందులో విజయ్ సేతుపతి యాక్టింగ్ వేరే లెవెల్ అని చెప్పాలి. ఇక ఈ సినిమా తమిళ్లోనే కాకుండా తెలుగులో కూడా విడుదలై మంచి సక్సెస్ సొంతం చేసుకుంది.
మహారాజా సినిమా సీక్వెల్ కి కథ సిద్ధం..
ఇకపోతే మహారాజా సినిమాతో సూపర్ హిట్ అందుకున్న విజయ్ సేతుపతి, నిథిలన్ కాంబోలో ఇదే మూవీ కి సీక్వెల్ రాబోతుందని తెలుస్తోంది. కోలీవుడ్ మీడియా సమాచారం ప్రకారం.. నిథిలన్ స్వామినాథన్ మహారాజా సినిమా సీక్వెల్ కథను సిద్ధం చేశారట. విజయ్ సేతుపతికి స్టోరీ వినిపించగా.. ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అందుకే త్వరలోనే ఈ సినిమా అనౌన్స్మెంట్ కూడా రాబోతోందని సమాచారం. ఇక విజయ్ సేతుపతి కథను నమ్మి సినిమా చేశారు. కాబట్టి ప్రాజెక్ట్ అంత మంచి సక్సెస్ అయిందని అభిమానులు కూడా కామెంట్లు చేస్తున్నారు.ఇక మహారాజా సినిమా సీక్వెల్ ఎలా ఉంటుంది? అందులో ఏం చేస్తాడు? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గానే అనిపిస్తోంది.
త్వరలో షూటింగ్ షురూ..
అటు ఆడియన్స్ కూడా మహారాజా లాంటి సినిమాలు చూడాలని తెగ ఆరాటపడుతున్నారు. రెగ్యులర్ కమర్షియల్ సినిమాల కంటే బెటర్గా కథతో పాటు మంచి మెసేజ్ తో మహారాజా సినిమా వచ్చింది. అందుకే ఈ సినిమాను అంత పెద్ద హిట్ చేశారు. దీనికి తోడు మహారాజా సినిమాను ఈ మధ్యనే జపాన్లో విడుదల చేయగా అక్కడ కూడా మంచి రెస్పాన్స్ లభించింది. ఈ క్రమంలోనే మహారాజ సీక్వెల్ తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు.అసలే మహారాజ సినిమాతో పిచ్చెక్కిపోయిన ఆడియన్స్ కి దాని సీక్వెల్ మరింత ఆసక్తికరంగా ఎదురుచూసేలా చేస్తోంది. విజయ్ కథల సెలక్షన్ మీద అభిమానులకు మంచి కాన్ఫిడెన్స్ ఉంది. అందుకే ఈ సినిమా కూడా తప్పకుండా సూపర్ హిట్ అవుతుందని చెబుతున్నారు. ఇక ప్రస్తుతం విజయ్ సేతుపతి ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తో బెగ్గర్ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాతో పాటు ఒక వెబ్ సిరీస్ కి కూడా ఆయన సైన్ చేసినట్టు సమాచారం. ఇక ఈ రెండు పూర్తయిన వెంటనే మహారాజ 2 సినిమా షూటింగ్ మొదలు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఈసారి విజయ్ సేతుపతి ఏ విధంగా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తారో చూడాలి.
ALSO READ:Priyanka Chopra: మెట్ గాలాలో ప్రియాంక చోప్రా ధరించిన ఈ గ్రీన్ నెక్లెస్ అక్షరాల అన్ని కోట్లా..?