BigTV English

Earthquake hits Himachal Pradesh: భూకంపంతో వణికిన హిమాచల్‌ప్రదేశ్..

Earthquake hits Himachal Pradesh: భూకంపంతో వణికిన హిమాచల్‌ప్రదేశ్..
Earthquake in Himachal Pradesh
Earthquake in Himachal Pradesh

Earthquake in Himachal Pradesh: ప్రపంచవ్యాప్తంగా భూకంపాలు ప్రజలను వణికిస్తున్నాయి. ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. రెండురోజుల కిందట తైవాన్‌లో సంభవించిన భూకంపం నుంచి తేరుకోలేదు. ఇప్పుడు భారత్‌లోనూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి.


తాజాగా హిమాచల్ ప్రదేశ్‌లో రాత్రి భూకంపం సంభవించింది. ముఖ్యంగా చంబా టౌన్‌తోపాటు మనాలీ లోనూ భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 5.3గా నమోదైంది. ఈ విషయాన్ని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ అధికారులు తెలిపారు. కేవలం 10 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రాన్ని గుర్తించారు. రాత్రి తొమ్మిదిన్నర గంటల సమయంలో ప్రకంపనలు సంభవించినట్టు స్థానికులు చెప్పారు.

దీని ప్రభావం పక్కనేఉన్న పంజాబ్, హర్యానా రాష్ట్రాలపైనా పడింది. అక్కడ కూడా పలు చోట్ల భూప్రకంపనలు చోటు చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. మనాలీలో అయితే ఏడు సెకన్లపాటు భూమి వణికింది. అయితే చంబాలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు చెబుతున్నమాట. మరోవైపు రాత్రి నుంచి హిమాచల్‌ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల ప్రజలు రాత్రి నిద్రలేకుండా గడిపినట్టు సమాచారం.


https://twitter.com/SurbhiMeenaVS/status/1776073863513981267

 

Tags

Related News

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Big Stories

×