BigTV English

BIG TV Kissik Talk Show : ఆ పని చేయడం వల్ల డబ్బులు అన్ని పోయాయి.. ఇల్లు కూడా…

BIG TV Kissik Talk Show : ఆ పని చేయడం వల్ల డబ్బులు అన్ని పోయాయి.. ఇల్లు కూడా…

BIG TV Kissik Talk Show :ప్రముఖ నటుడు రాజీవ్, ఝాన్సీ నటించిన హోమ్ టౌన్ అనే వెబ్ సిరీస్ ఆహా లో ప్రసారమవుతుంది. హోమ్ టౌన్ ప్రమోషన్ లో భాగంగా జబర్దస్త్ వర్షా హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ టివి కిస్సిక్ టాక్స్ షో కి వచ్చారు. ఈ షో లో రాజీవ్ తన వ్యక్తిగత విషయాలు గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.


ఆ ఒక్కటి అమ్మేస్తా..

యాంకర్ వర్షా మాట్లాడుతూ.. మీరు ప్రొడక్షన్ చేసేటప్పుడు కొంచెం లాస్ వచ్చిందని అన్నారు కదా అది నిజమేనా అని అడగ్గా రాజీవ్ స్పందించారు. ” ఎవరికైనా లాస్ వస్తుంది. చిన్న అమౌంట్ అని కాదు, చాలా పెద్ద అమౌంట్ లాస్ అయ్యాను . నేను లాస్ అయ్యాను కదా అని ప్రొడక్షన్ ని ఇక్కడితో వదిలేయట్లేదు. ఒకసారి నష్టం వచ్చింది అంటే దానికి చాలా కారణాలు ఉంటాయి. వాటిని నేను పరిష్కరించుకుంటూ ఎక్కడ తప్పులు జరిగాయి. నేను ఏ తప్పు చేశాను అని చూసుకొని, ఈసారి కొంచెం బెటర్ గా రావడానికి ప్రయత్నిస్తాను. ప్రొడక్షన్ చేయడం కన్నా నిజం చెప్పాలంటే నాకు యాక్టింగ్ చేయడం చాలా ఈజీ. ఫైనాన్షియల్ గా కూడా నాకు మనీ బాగా వచ్చేది. యాక్టింగ్ లోనే, మొహానికి రంగు వేసుకుని క్యార్వాన్ ఎక్కితే నా చేతిలో పారితోషికం పెట్టి మరి పంపిస్తారు. కానీ నేను ఓన్లీ యాక్టింగ్ ఫీల్డ్ లోనే కాకుండా ప్రొడక్షన్ వైపు మళ్లీ వస్తాను. నాకు ఎక్కువ సీరియల్స్ వల్ల లాస్ వచ్చింది. ఎపిసోడ్స్ తొందరగా ముగించడం.. కొన్ని కారణాలవల్ల తీసుకున్న సీరియల్ మధ్యలోనే ముగించడంతో ఎక్కువ లాస్ అయ్యాను. ఈ కొత్త సంవత్సరం నాకు ఈ వెబ్ సిరీస్ తో సక్సెస్ వచ్చింది. నాకు లక్ బాగా కలిసి వస్తే ఈ సంవత్సరం ఖచ్చితంగా ప్రొడక్షన్ వర్క్ మొదలు పెడతాను. నాకు చాలా ఇష్టమైన పని ఇది. అలాంటిది నేను ఎలా వదిలిపెడతాను. కచ్చితంగా ఫైనాన్షియల్ గా నిలదొక్కుకున్నాక స్టార్ట్ చేస్తాను “అని రాజీవ్ చెప్పారు.


మా మీద ప్రమోషన్స్ చేసుకుని అమ్ముకుంటున్నారు..

తను చేయబోయే ప్రొడక్షన్ గురించి మాత్రమే కాక తన ఫైనాన్షియల్, ఆస్తుల గురించి కూడా రాజీవ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. రాజీవ్ మాట్లాడుతూ.. పెద్దగా మాకు ఆస్తి అంటూ ఏమీ లేదు. ఒక ఇల్లు తప్ప, అందరూ అనుకుంటున్నట్లు నాకెక్కడ ఇల్లులు, ఆస్తులు లేవు. అవన్నీ రూమర్సే, సుమ కి గాని నాకు గాని ఉన్నది ఇల్లు ఒకటే. ఇంతకుముందు వేరే ఇల్లు ఉండేది. ఆ ఫ్లాట్ ని అమ్మేశాము. ఫైనాన్షియల్ గా వచ్చిన ప్రాబ్లమ్స్ ని తట్టుకోలేక ఇల్లు అమ్మేయాల్సి వచ్చింది. ఇప్పుడు మేము ఉంటున్న ఇల్లు కూడ త్వరలో అమ్మచ్చు. దానికి ఫైనాన్షియల్ గా ఉన్న ఇబ్బందులే కారణం. అందరూ మాకు ఆస్తులు ఉన్నాయి అని అనుకోవడానికి కారణం.. నేనేదైనా షూటింగ్ సమయంలో సైట్ చూడడానికె వెళ్తాను, కొనడానికి కాదు. ఇక్కడ ఎంత రేటు ఉంది అని నేను వెళ్లి ఎంక్వయిరీ చేస్తున్న సమయంలో అందరూ నేను ఆ సైట్ ని కొనేసినట్టుగా పుకార్లు పుట్టిస్తారు. అమ్ముకునే వాళ్ళు కూడా ఇక్కడ సుమా గారికి ఇల్లు ఉంది. రాజీవ్ ఇక్కడే ఉంటున్నారు అని చెప్పి ఫ్లాట్ లు అమ్ముకుంటున్నారు . ఇదంతా ఒక రకమైన పబ్లిసిటీ. అంతేకానీ నాకు ఎటువంటి స్థలాలు లేవు” అని రాజీవ్ చెప్పారు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×