Vinayakan:సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) హీరోగా నటించిన ‘జైలర్’ సినిమాలో విలన్ పాత్రలో నటించి, తన అద్భుతమైన నటనతో అందరిని ఆకట్టుకున్నారు వినాయకన్ (Vinayakan). జైలర్ సినిమాకు ముందు ఎన్నో సినిమాలలో నటించినా.. పెద్దగా గుర్తింపు రాలేదు. అయితే ఈ సినిమాతో గుర్తింపు లభించింది. అయితే ఆ తర్వాత కాలంలో ఆయన చేస్తున్న చేష్టల వల్ల అందరూ ఇబ్బందులు పడుతున్నారు. దీంతో అతనిపై పలు రకాల కేసులు కూడా నమోదవుతున్నాయి. ముఖ్యంగా జైలర్ సినిమా తర్వాత వరుస వివాదాలలో చిక్కుకుంటున్న వినాయకన్ ఈసారి కూడా మరో కొత్త వివాదంలో ఇరుక్కున్నారు. గత ఏడాది పోలీసులపై దాడి చేసిన వినాయకన్.. ఈసారి పక్కింటి వారిని టార్గెట్ గా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.
తాగి, పక్కింటి వారిపై దాడి..
అసలు విషయంలోకి వెళితే..మలయాళ నటుడు వినాయకన్ తాగి.. పక్కంటి వారితో వివాదం పెట్టుకుంటున్నాడు. అందుకు సంబంధించిన ఒక వీడియో కూడా ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తోంది. ఆ వీడియోలో తన ఇంటి బాల్కనీలో లుంగీ కట్టుకొని నిలబడి, పొరుగింటి వారితో గొడవపడ్డారు. ఇక వారిపై అరుస్తూ, బూతులు తిడుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మద్యం తాగిన కారణంగా తూగుతూ.. సరిగ్గా నిలబడలేని పరిస్థితిలో వినాయకన్ కనిపించారు.అయితే ఇలా పక్కింటి వారితో గొడవ పడడానికి గల కారణాలు తెలియదు. కానీ ప్రస్తుతం ఈ విషయం మాత్రం సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతోంది.
గతంలో కూడా పలు వివాదాల్లో చిక్కుకున్న వినాయకన్..
గత ఏడాది సెప్టెంబర్ నెలలో హైదరాబాద్ విమానాశ్రయంలో జైలర్ సినిమా విలన్ వినాయకన్ సీఐఎస్ఎఫ్ సిబ్బందిపై దాడికి పాల్పడ్డాడు. గొడవ జరిగిన సమయంలో సీఐఎస్ఎఫ్ అధికారిపై చేయి చేసుకున్నాడు. అయితే ఆ సమయంలో ఆయన మత్తులో ఉన్నట్లు సమాచారం. గోవాకు వెళ్లేందుకు కనెక్టింగ్ ఫ్లైట్ ఎక్కేందుకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. అయితే ఈ ఘటనపై స్పందించిన వినాయకన్.. తాను ఎటువంటి తప్పు చేయలేదని, సీఐఎస్ఎఫ్ అధికారులు తనను ఎయిర్పోర్ట్ లోని ఒక గదిలోకి తీసుకెళ్లి, దాడి చేశారని అన్నారు. అంతే కాదు కావాలంటే సీసీటీవీ ఫుటేజీ కూడా చెక్ చేసుకోమని తెలిపాడు. ఇక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వినాయకన్ కు, సీఐఎస్ఎఫ్ అధికారి మధ్య మాటల వాగ్వాదం జరగగా.. ఆ తర్వాత సదరు కానిస్టేబుల్ పై చేయి చేసుకున్నాడని, అందుకే అరెస్టు చేశామని తెలిపారు. అంతేకాదు గత ఏడాది ఒక టీ కొట్టు వ్యక్తితో కూడా గొడవపడిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మద్యం మధ్యలో ఆ టీ కొట్టు వ్యక్తిపై గొడవ పడినట్లు సోషల్ మీడియాలో వీడియోలు చక్కర్లు కట్టాయి.
2023లో కూడా వివాదంలో చిక్కుకున్న వినాయకన్..
2023 అక్టోబర్ నెలలో కూడా కేరళ పోలీసులు ఈయనను అరెస్ట్ చేశారు. ఎర్నాకులం టౌన్ నార్త్ పోలీస్ స్టేషన్ పరిధిలో మద్యం మత్తులో గొడవకు దిగాడు. తమను ఇబ్బంది పెడుతున్నాడని అపార్ట్మెంట్ వాసులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు, అక్కడికి చేరుకొని ఈయనను పోలీస్ స్టేషన్ తరలించారు. ఇక మద్యం మత్తులో ఉన్న వినాయకన్ కోపంతో ఊగిపోయాడట.మర్యాదగా పోలీసులు నచ్చ చెప్పే ప్రయత్నం చేసినా.. వినకపోవడంతో చివరికి ఆయనపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు సమాచారం. ఇలా ప్రతిసారి కూడా వివాదాల్లో చిక్కుకుంటూ అందరిని ఆశ్చర్య పరుస్తున్నారు వినాయకన్.<
In Kerala Malayalam Actor #Vinayakan who worked with @rajinikanth in Jailor movie got arrested by Kochi Police for being loud with the Police. Are you finding it funny?Then here is more:
Vinayakan had a dispute with his wife and he called the Police for the same. But the Police… pic.twitter.com/1eB2LYd8KL— NCMIndia Council For Men Affairs (@NCMIndiaa) October 28, 2023
/p>
#Jailer villain #Vinayakan Worst behaviour and Attitude 🤡😠
— Tharani ᖇᵗк (@iam_Tharani) November 22, 2024
#Vinayakan 🥃🔞🙉
Actor or Drunker 😡
He should be banned from acting.— Tharani ᖇᵗк (@iam_Tharani) January 20, 2025