
Rakul Preet Singh:తెలుగు, తమిళ చిత్రాలతో పాటు ఇప్పుడు బాలీవుడ్ సినిమాల్లోనూ నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తోన్న బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్. సినిమాలతో పాటు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ అమ్మడు తాజాగా ఓ ఎమోషనల్ పోస్ట్ చేసింది. 16 ఏళ్ల బంధం నేటితో ముగిసిందని తన దుఃఖాన్ని వ్యక్తం చేసింది. ఇంతకీ ఆ బంధం ఎవరితోనో తెలుసా.. ఆమె ప్రేమగా పెంచుకున్న కుక్కతో. రకుల్ బ్లాసమ్ అనే కుక్కను పెంచుకుంది. ఆ కుక్క చనిపోయింది. ఆ బాధతో ఆమె బోషితో ఉన్న ఫొటోను తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. బాధను వ్యక్తం చేసింది. ‘‘బ్లాసమ్ నువ్వు మా జీవితాల్లోకి 16 ఏళ్ల ముందు వచ్చావు. ఇన్నేళ్లలో ఎంతో సంతోషాన్ని మాకు పంచావు. నేను నీతోనే పెరిగాను. నిన్ను చాలా మిస్ అవుతున్నాం. నువ్వు చాలా మంచి జీవితాన్ని అనుభవించావు. నువ్వు ఎలాంటి బాధను భరించలేదని నేను అనుకుంటున్నాను. బోషి నీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను’’ అంటూ రకుల్ తన బాధను తెలియజేసింది.
రకుల్ ప్రస్తుతం దక్షిణాదిన ఇండియన్ 2 మినహా మరో సినిమా చేయటం లేదు. వరుస బాలీవుడ్ సినిమాలకే పరిమితమైంది. మరో వైపు బాలీవుడ్ నటుడు, నిర్మాత జాకీ భగ్నానీతో ఆమె ప్రేమలో ఉంది. ఈ ఏడాదిలో వీరి పెళ్లి జరిగే అవకాశం ఉందని సినీ వర్గాల సమాచారం. కానీ వారిద్దరూ దానిపై ఎలాంటి వివరణ ఇవ్వలేదు.