BigTV English

Rakul Preet Singh: ఏ వ్యక్తితో నాకు సంబంధం లేదు.. నా పేరు వాడితే బాగోదు.. రకుల్ ఫైర్

Rakul Preet Singh: ఏ వ్యక్తితో నాకు సంబంధం లేదు.. నా పేరు వాడితే బాగోదు.. రకుల్ ఫైర్

Rakul Preet Singh: మంత్రి కొండా సురేఖ .. టాలీవుడ్ హీరోయిన్స్ పై చేసిన వ్యాఖ్యలు హీటెక్కిస్తున్నాయి. కేటీఆర్ ను విమర్శిస్తూ.. ఆమె హీరోయిన్స్ కు డ్రగ్స్ అలవాటు చేస్తున్నారని, ఆయనకు భయపడి ఎంతోమంది ఇండస్ట్రీకి దూరమవుతున్నారని ఆరోపించారు. అంతేకాకుండా చాలామంది హీరోయిన్స్ జీవితాలను కేటీఆర్ నాశనం చేశాడని మాట్లాడారు. ఇక ఇందులోకి అక్కినేని కుటుంబాన్ని లాగి .. సమంత- నాగ చైతన్య విడాకులు తీసుకోవడానికి కారణం కూడా కేటీఆర్ అని కూడా మాట్లాడారు.


సమంత పేరు వాడారు కాబట్టి అందరూ ఆమె గురించి మాట్లాడడం మొదలుపెట్టారు. అయితే ఇందులో రకుల్ ప్రీత్ సింగ్ పేరు కూడా వచ్చింది.  కేటీఆర్, డ్రగ్స్  గొడవ అనగానే  చాలామంది రకుల్ పేరును తీసుకొచ్చి.. ఆమె కూడా ఇందులో ఉందని  సోషల్ మీడియాలో హైలైట్ చేయడం మొదలుపెట్టారు. తాజాగా రకుల్ ఈ వివాదంపై స్పందించింది.  తమ మౌనాన్ని బలహీనతగా భావించవద్దని తెలిపింది.  తాను పూర్తిగా రాజకీయాలకు వ్యతిరేకిని అని.. రాజకీయ లబ్ది కోసం తన పేరును వాడితే అస్సలు బాగోదని  ఫైర్ అయ్యింది.

” తెలుగు చలనచిత్ర పరిశ్రమ దాని సృజనాత్మకత మరియు వృత్తి నైపుణ్యానికి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. నేను ఈ అందమైన పరిశ్రమలో గొప్ప ప్రయాణం చేసాను. ఇప్పటికీ ఇండస్ట్రీలో యాక్టివ్ గానే ఉన్నాను. ఇలాంటి నిరాధారమైన మరియు దుర్మార్గపు పుకార్లు మా సోదరి మహిళలపై వ్యాప్తి చెందడం బాధాకరం. మరింత నిరుత్సాహపరిచే విషయం ఏమిటంటే, చాలా బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న మరో మహిళ దీన్ని చేస్తోంది.


గౌరవం కోసం.. మేము మౌనంగా ఉంటున్నాం.. కానీ, అది మా బలహీనత అని తప్పుగా భావించవద్దు. నేను పూర్తిగా రాజకీయ వ్యతిరేకిని. ఏ వ్యక్తి/రాజకీయ పార్టీతో సంబంధం లేదు. రాజకీయ మైలేజీని పొందే మార్గంలో నా పేరును హానికరమైన రీతిలో ఉపయోగించడం మానేయమని నేను కోరుతున్నాను. కళాకారులు  సృజనాత్మక వ్యక్తులను రాజకీయ స్లగ్ ఫెస్ట్ నుండి దూరంగా ఉంచాలి.  వారి పేర్లను కల్పిత కథలతో ముడిపెట్టడం ద్వారా హెడ్ లైన్స్ లో వచ్చేందుకు ఉపయోగించకూడదు” అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×