CM CUP 2024 Logo Released: యువత వ్యసనాలవైపు వెళ్లొద్దని, క్రీడల వైపు ఎక్కువగా మక్కువ చూపాలంటూ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. నగరంలోని ఎల్బీ స్టేడియంలో గురువారం సీఎం కప్ – 2024 లోగోను, పోస్టర్ ను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పలు సూచనలు చేశారు.
Also Read: కేటీఆర్ ఏకాకి అయ్యారా.. సమంత, అక్కినేని ఫ్యామిలీకి టాలీవుడ్ సపోర్ట్.. బీఆర్ఎస్ నేతలు మాత్రం మౌనం!
‘క్రీడాకారులు ఓటమికి ఎన్నడూ నిరాశ చెందవద్దు. తెలంగాణలో గ్రామీణ క్రీడలను ప్రోత్సాహిస్తున్నాం. గత పదేళ్లలో క్రీడలను ప్రోత్సహించలేదు. ఆ పదేళ్లలో యువత మత్తు పదార్థాలకు అలవాటుపడ్డారు. సౌత్ కొరియా స్పోర్ట్స్ వర్సిటీ ఒలింపిక్స్ లో సత్తా చాటింది. వాళ్లలో ఉన్నది, మనలో లేనిది పట్టుదల ఒక్కటే. హైదరాబాద్ లో యంగ్ ఇండియా స్పోర్ట్స్ వర్సిటీని ప్రారంభిస్తాం. యంగ్ ఇండియా కోచింగ్ సెంటర్ ను ప్రారంభిస్తాం. నిఖత్ జరీన్ ప్రయాణం మనకు స్ఫూర్తిదాయకం. నిఖత్ జరీన్ కు ప్రభుత్వం గ్రూప్-1 ఉద్యోగం ఇచ్చింది. ఆమె కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకునే ప్రయత్నం చేశాం.
నిఖత్ జరీన్, సిరాజ్, సింధు మన రాష్ట్రానికే కాదు.. దేశానికే ఆదర్శం. తెలంగాణలో క్రీడల్లో రాణిస్తే ఎలాంటి ప్రయోజనం ఉంటుందనడానికి నిఖత్ జరీన్ నిదర్శనమని పేర్కొన్నారు. నిబంధనలు సడలించి మహ్మద్ సిరాజ్‌కు కూడా ఉద్యోగం ఇచ్చామని తెలిపారు. తెలంగాణలో క్రీడలను ప్రోత్సహించడం కోసం యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నామని వివరించారు రేవంత్. 2028 ఒలింపిక్స్‌లో దేశం తరుపున తెలంగాణ క్రీడాకారులు గోల్డ్ మెడల్స్ తీసుకురావాలని ఆకాంక్షించారు’ అంటూ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
Also Read: దసరా కానుకగా బంపర్ ఆఫర్.. మీకు ఈ శుభవార్త తెలిస్తే… వెంటనే అప్లై చేసేస్తారు!