Cure Psoriasis: ఏళ్ల తరబడి ఇబ్బంది పెట్టే చర్మ సమస్యల్లో సోరియాసిస్ వ్యాధి కూడా ముఖ్యమైనది. ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్న వారిలో చర్మం మీద మచ్చలు, పొడిగా ఉండే, తెల్లటి పొలుసులు ఏర్పడతాయి. ఇది ఎక్కువగా మోచేతులు, మోకాళ్లు, తల మీద కనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో దీని వల్ల చర్మంపై మంట, దద్దుర్లు, దురద వంటివి వస్తాయి. అయితే, దీన్ని సహజంగా తగ్గించుకోవచ్చా? శాశ్వతంగా నయం చేయగలమా? అనే ప్రశ్నలు చాలా మందిలో ఉంటాయి.
సోరియాసిస్ ఎందుకు వస్తుంది?
సోరియాసిస్ అనేది ఒక ఆటోఇమ్యూన్ వ్యాధి అని డెర్మటాలజిస్ట్‌లు చెబుతున్నరు. అంటే మన శరీర రోగ నిరోధక వ్యవస్థే తప్పుగా స్పందించి, ఆరోగ్యకరమైన చర్మ కణాలను వేగంగా తయారుచేస్తుంది. దీనివల్ల చర్మం మీద ఎర్రటి మచ్చలు ఏర్పడతాయని వైద్యులు చెబుతున్నారు.
చాాలా మందిలో జన్యుపరమైన కారణాల వల్ల సోరియాసిస్ వచ్చే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరికొందరిలో వాతావరణ మార్పులు, దుమ్ము, కాలుష్యం, మద్యపానం, ధూమపానం వంటివి కూడా సోరియాసిస్ రావడానికి కారణం కావచ్చని అంటున్నారు.
సహజంగా తగ్గించడం సాధ్యమేనా?
ఈ సమస్య నుంచి తప్పించుకోవడానికి ఎన్ని మందులు వాడినా పెద్దగా ప్రయోజనం ఉండదు. అటువంటి సమయంలో సోరియాసిస్‌ను తగ్గించుకునే ప్రయత్నం చేయాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. సోరియాసిస్‌ను పూర్తిగా నివారించలేకపోయినా, దాని లక్షణాలను తగ్గించడానికి కొన్ని మార్గాలు ఉన్నాయట.
సోరియాసిస్ వల్ల వచ్చే దురద మంట నుంచి ఉపశమనం కల్పించడంలో అలోవెరా ఎంతో సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. అలొవెరా చర్మాన్ని చల్లగా ఉంచేందుకు సహాయపడుతుందట. అంతేకాకుండా దురద, మచ్చలను తగ్గించేందుకు హెల్ప్ చేస్తుంది. రోజుకు రెండుసార్లు సోరియాసిస్ ప్రభావిత ప్రాంతాల్లో అలోవెరా జెల్‌ని అప్లై చేయడం వల్ల మంట దురద త్వరగా తగ్గిపోతాయని నిపుణులు చెబుతున్నారు.
సోరియాసిస్ సమస్యతో ఇబ్బంది పడుతున్న వారికి కొబ్బరి నూను చాలా హెల్ప్ చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇది చర్మాన్ని మృదువుగా కూడా ఉంచుతుందట. సోరియాసిస్ కారణంగా చర్మం పొడిబారిన భాగాల్లో నూనెను అప్లై చేయడం వల్ల చర్మం తడిగా ఉంటుందట. దీని వల్ల పొలుసులు రాకుండా ఉంటాయని డెర్మటాలజిస్ట్‌లు చెబుతున్నారు.
ALSO READ: అతి నిద్ర వల్ల అన్ని అనర్థాలు జరుగుతాయా..?
సోరియాసిస్ సమస్యను తగ్గించేందుకు నిమ్మపండు రసం హెల్ప్ చేస్తుందట. శరీరాన్ని నెచురల్‌గా డిటాక్సిఫై చేయడంలో కూడా ఇది సహాయపడుతుందని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. అయితే నిమ్మకాయను నేరుగా చర్మానికి అప్లై చేస్తే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉందట. దీన్ని తరచుగా తీసుకునే ఆహారంలో చేర్చుకోవడం వల్ల సోరియాసిస్ సమస్య ప్రభావాన్ని తగ్గించడం మరింత ఈజీ అవుతుందని నిపుణులు వెల్లడిస్తున్నారు.
దీని ప్రభావాన్ని తగ్గించుకోవాలంటే ఈ చిట్కాలను పాటించడంతో పాటు జీవనశైలి, ఆహారపు అలవాట్లలో కొన్ని మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్న వారు కొన్ని రకాల ఆహారాలను తీసుకోవడం తగ్గించాలని సూచిస్తున్నారు. చికెన్, మాంసం, వంకాయ, గోంగూర, పైనాపిల్ వంటివి అధికంగా తీసుకోవడం వల్ల సోరియాసిస్ సమస్య మరింత పెరగే అవకాశం ఉందట. అందుకే వీలైనంత వరకు వీటిని తినకూడదనే డాక్టర్లు సూచిస్తున్నారు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.