Shiva Rajkumar : సాధారణంగా ఒక్కొక్కసారి ఎంత పెద్ద వాళ్ళు అయినా సరే నాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తే.. చిన్న పిల్లలు అయిపోతారు అనడంలో సందేహం లేదు. ఇప్పుడు సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ (Shiva Raj Kumar) కూడా అలాగే చిన్నపిల్లవాడు అయిపోయారు. పిల్లాడి దగ్గర సైకిల్ లాక్కొని మరీ ఆయన సైకిల్ తొక్కి అందర్నీ ఆశ్చర్యపరిచారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇన్ని రోజులు క్యాన్సర్ తో పోరాడి.. ఈ ఏడాది మొదట్లో క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకొని.. దిగ్విజయంగా క్యాన్సర్ ను జయించిన శివరాజ్ కుమార్ ఆరోగ్యం పై కాస్త శ్రద్ధ పెట్టారనే చెప్పాలి. అందులో భాగంగానే స్నేహితులతో కలిసి ఉదయం మార్నింగ్ వాకింగ్ కి వెళ్లిన ఆయన.. అక్కడ ఓ చిన్నపిల్లవాడు సైకిల్ తొక్కుతూ కనిపించడంతో ..పిల్లాడి దగ్గర సైకిల్ లాక్కొని మరీ సైకిల్ తొక్కి తన ఆనందాన్ని పంచుకున్నారు. ఆ తర్వాత ఆ బాలుడికి థాంక్స్ కూడా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు శివరాజ్ కుమార్ . ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో సూపర్ స్టార్ ఆటలు మామూలుగా లేవుగా అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్స్.
శివరాజ్ కుమార్ సినిమాలు..
కన్నడ సినీ నటుడిగా పేరు సొంతం చేసుకున్న శివరాజ్ కుమార్ నిర్మాత గానే కాదు టీవీ హోస్ట్ గా కూడా పనిచేశారు. కన్నడ కంఠీరవ గా గుర్తింపు తెచ్చుకున్న రాజకుమార్ పెద్ద కుమారుడే ఈయన. కన్నడ సినీ రంగంలో ఈయనకు శివన్నగా గుర్తింపు ఉంది. 1974 లో వచ్చిన ‘ శ్రీ శ్రీనివాస కళ్యాణ’ అనే సినిమా ద్వారా బాల నటుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. మొదటి సినిమాతోనే ప్రేక్షకులను అలరించిన ఈయన 1986లో వచ్చిన ‘ఆనంద్’అనే సినిమాతో .. ఉత్తమ బాల నటుడిగా సినిమా ఎక్స్ప్రెస్ అవార్డు అందుకున్నారు. ఇక తర్వాత 1986లో వచ్చిన ‘రథసప్తమి’ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్న శివన్న దాదాపు చాలా చిత్రాలలో హీరోగా నటించి అలరించారు.
Veera Dheera Sooran OTT: ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధమైన విక్రమ్ మూవీ.. ఎప్పుడు ఎక్కడ చూడొచ్చంటే..?
అతిధి పాత్రలకు ఇంపార్టెన్స్ ఇస్తున్న శివన్న..
ఇక ఈ మధ్య ఎక్కువగా భాషతో సంబంధం లేకుండా ప్రతిభాష ప్రేక్షకుడిని మెప్పించాలనే నేపథ్యంలో పలువురు స్టార్ హీరోల సినిమాలలో అతిథి పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల రజనీకాంత్ (Rajinikanth ) నటించిన ‘జైలర్’ సినిమాలో గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చి తన నటనతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నారు. ఇందులో నటించింది కేవలం రెండు షార్ట్స్ లో అయినా అక్కడ తన అద్భుతమైన స్టైల్ తో అందరిని ఆకట్టుకున్నారు. ఇకపోతే 2021 లో వచ్చిన జై భజరంగి సినిమా తెలుగులో కూడా రిలీజ్ చేసి ఇటు తెలుగు ఆడియన్స్ ని కూడా మెప్పించారు. ఇంకా కబ్జా, వేద, ఘోస్ట్ వంటి చిత్రాలకు నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. ఇక నటనతో ప్రేక్షకులను మెప్పించిన ఈయన కర్ణాటక ప్రభుత్వ సినిమా పురస్కారం ఫిలింఫేర్ అవార్డుతో పాటు సౌత్ ఫిలింఫేర్ అవార్డ్స్, సైమా అవార్డ్స్ తో పాటు చాలా అవార్డులే లభించాయి.
చిన్న పిల్లాడి సైకిల్ తీసుకుని..
సైకిల్ రైడ్ చేసిన శివన్న#shivannashivarajkumar #Shivanna #shivarajkumar #LatestNews #viralvideo #BIGTVcinema pic.twitter.com/KS4sMslkxz— BIG TV Cinema (@BigtvCinema) April 18, 2025