BigTV English

Ram Charan: ‘రంగస్థలం’ కాంబోకి రంగం సిద్ధమైంది.. ఈ సారి బాక్సాఫీసు బద్దలే

Ram Charan: ‘రంగస్థలం’ కాంబోకి రంగం సిద్ధమైంది.. ఈ సారి బాక్సాఫీసు బద్దలే
sukumar
sukumar

RC17 – Official announcement  ( Telugu film news ): మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన ‘రంగస్థలం’ మూవీ ఎంతటి ఘనవిజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ మూవీతో రామ్ చరణ్‌కు మంచి క్రేజ్ వచ్చింది. క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ తన మైండ్ బ్లోయింగ్ స్టోరీతో డైరెక్షన్ చేసి అందరినీ అలరించాడు.


ఇక ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వీరిద్దరి కాంబో మళ్లీ ఎప్పుడెప్పుడు సెట్ అవుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అలా ఎదురుచూస్తున్నవారికి తాజాగా ఓ న్యూస్ సర్ప్రైజ్ అందించింది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

రామ్ చరణ్ – దర్శకుడు శంకర్ డైరెక్షన్‌‌లో ‘గేమ్ ఛేంజర్’ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ మూవీపై అందరిలోనూ భారీ అంచనాలే ఉన్నాయి. ఇందులో రామ్ చరణ్ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నాడు.


Also Read : రామ్ చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్ మూవీల ఓటీటీ డీల్స్ ఫిక్స్.. కోట్లలో బిజినెస్

అందులో ఒకటి సాదా సీదా రాజకీయ నాయకుడిగా, మరొకటి ప్రభుత్వ అధికారిగా కనిపించబోతున్నాడు. ఈ మూవీ ఈ ఏడాది గ్రాండ్‌గా రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉంది. ఇకపోతే మరోవైపు దర్శకుడు సుకుమార్ ప్రస్తుతం పుష్ప 2 మూవీతో బిజీ బిజీగా ఉన్నాడు. ఈ మూవీలో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్నాడు.

ఫస్ట్ పార్ట్ ప్రపంచ వ్యాప్తంగా మంచి క్రేజ్ అందుకోగా.. ఇప్పుడు సెకండ్ పార్ట్‌పై సుకుమార్ ఫుల్ ఫోకస్ పెట్టాడు. ఈ చిత్రాన్ని మరింత గ్రాండ్‌గా తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ మూవీ ఆగస్టు 15న రిలీజ్ కానుంది.

ఇక గేమ్ ఛేంజర్ మూవీతో రామ్ చరణ్, పుష్ప 2 మూవీ సుకుమార్ బిజీగా ఉన్నారు. ఈ రెండు చిత్రాలు కంప్లీట్ చేసుకున్న తర్వాత వీరిద్దరూ మరోసారి కలవనున్నట్లు తెలుస్తోంది. రంగస్థలం సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న చరణ్, సుకుమార్ త్వరలో మరో సినిమాను పట్టాలెక్కించనున్నట్లు తెలుస్తోంది.

Also Read: బురద నీళ్లలో చిరంజీవి.. ‘విశ్వంభర’ కోసం మెగాస్టార్ డెడికేషన్‌కు హ్యాట్సాఫ్

రామ్ చరణ్ హీరోగా, దర్శకుడిగా సుకుమార్, అలాగే మ్యూజిక్ డైరెక్టర్‌గా దేవీశ్రీ ప్రసాద్ కాంబోలో మరో సినిమా రానున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రానికి మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మాణం వహించనున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన అనౌన్స్‌మెంట్‌ను రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా ఈ నెల అంటే మార్చి 27న వెల్లడించనున్నట్లు గుస గుసలు వినిపిస్తున్నాయి.

కాగా ఇటీవలే రామ్ చరణ్, ఉప్పెన ఫేం సానా బుచ్చిబాబుతో ఓ సినిమాను ప్రారంభించారు. ఈ మూవీ తాజాగా పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా స్టార్ట్ అయింది. ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది.

Related News

Bigg Boss 9 Wildcard Entry: 6 గురు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్… యాడ దొరికిన సంతరా ఇది.. అంతా స్క్రాపే

PVRInox : తింటూ సినిమా చూసే ఎక్స్పీరియన్స్, ఏంట్రా బాబు ఆ సౌండ్స్ ను ఎలా భరించాలి

Durga Rao: టిక్ టాక్ దుర్గారావు ఇంట్లో విషాదం.. సమాధి దగ్గరే.. కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం!

Rakesh Poojary: ‘కాంతారా-1’లో కడుపుబ్బా నవ్వించిన.. ఈ నటుడు ఎలా చనిపోయాడో తెలుసా? కన్నీళ్లు ఆగవు!

Janu lyri- Deelip Devagan: జాను లిరితో బ్రేకప్.. దిలీప్ రియాక్షన్ ఇదే.. సెలబ్రిటీలం కాబట్టే అంటూ!

Siva jyothi: ఘనంగా శివ జ్యోతి సీమంతపు వేడుకలు.. ఫోటోలు వైరల్!

Manchu Manoj: భార్యపై మనసులోని భావాలు.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్ట్ 

Tollywood: భార్య వేధింపులు తాళలేక ప్రముఖ నటుడు ఆత్మహత్య.. సెల్ఫీ వీడియో వైరల్!

Big Stories

×