BigTV English

Praneeth Rao Case: ఫోన్ ట్యాపింగ్ కేసు.. ప్రణీత్ రావు పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు..

Praneeth Rao Case: ఫోన్ ట్యాపింగ్ కేసు.. ప్రణీత్ రావు పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు..
Praneeth Rao Case
Praneeth Rao Case

Telangana High Court (Telangana today news): ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్ఐబీ డీఎస్పీ ప్రణీత్ రావు కు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. పోలీస్ కస్టడీని సవాల్ చేస్తూ ఆయన వేసిన పిటిషన్ ను న్యాయస్థానం కొట్టివేసింది.


ఫోన్ ట్యాపింగ్ కేసుపై ప్రణీత్ రావు హైకోర్టు పిటిషన్ వేశారు. తనను కస్టడీకి అప్పగించే విషయంలో షరతులు విధించలేదని పిటిషన్ లో పేర్కొన్నారు. విచారణ విషయాలను మీడియాకు ఉద్దేశపూర్వకంగా విడుదల చేస్తున్నారని ఆరోపించారు. పోలీస్ స్టేషన్ లోనూ సరైన సుదుపాయాలు లేవని పిటిషన్ లో పేర్కొన్నారు. ప్రణీత్ రావు తరఫున సీనియర్ లాయర్ గండ్ర మోహనరావు వాదనలు వినిపించారు.

పోలీసులు తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ నాగేశ్వరరావు వాదనలు వినిపించారు. కింది కోర్టు ఆదేశాల ప్రకారమే కస్టడీలో ప్రణీత్ రావును పోలీసులు విచారణ చేస్తున్నారని తెలిపారు. ఆయనను ప్రశ్నిస్తున్న పోలీస్ స్టేషన్ లో అన్ని సౌకర్యాలున్నాయని వివరించారు. ఫోన్ ట్యాపింగ్ పై ఫిర్యాదు చేసిన ఏసీపీ రమేష్ కు ప్రణీత్ రావు కేసు దర్యాప్తుతో ఎలాంటి ప్రమేయం లేదని స్పష్టం చేశారు. ప్రణీత్ రావు కుటుంబ సభ్యులతోనూ ఫోన్ లో మాట్లాడుతున్నారని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు.


Also Read: రాడిసన్‌ డ్రగ్స్‌ కేసులో ప్రధాన నిందితులు అరెస్ట్.. రూ. కోటి విలువైన కారు స్వాధీనం..

ప్రణీత్ రావు దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేయాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ నాగేశ్వరరావు కోరారు. ఇరుపపక్షాల వాదనలు విన్న తెలంగాణ హైకర్టు ప్రణీత్ రావు పిటిషన్ ను కొట్టివేసింది. ఇప్పటికే ప్రణీత్ రావు పోలీస్ కస్టడీ నాలుగు రోజులు పూర్తైంది. మరో 3 రోజుల ఆయనను పోలీసులు ప్రశ్నించనున్నారు.

Tags

Related News

Rakhi Festival: తమ్ముడికి రాఖీ కట్టేందుకు సాహసం చేసిన అక్క.. 20 అడుగుల ఎత్తున్న రైల్వే బ్రిడ్జి గోడపై నుంచి..?

MLA Mallareddy: రాజకీయాలకు గుడ్ బై.. బిగ్ బాంబ్ పేల్చేసిన మల్లారెడ్డి.. అసలేమైంది..?

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Big Stories

×