BigTV English
Advertisement

RC16 : బర్త్ డే సర్ ప్రైజ్ వచ్చేసింది.. రామ్ చరణ్ ఏమున్నాడ్రా బాబు..

RC16 : బర్త్ డే సర్ ప్రైజ్ వచ్చేసింది.. రామ్ చరణ్  ఏమున్నాడ్రా బాబు..

RC16 : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఈ ఏడాది గేమ్ ఛేంజర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ మూవీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో ఫ్యాన్స్ ను నిరాచపరిచింది. ప్రస్తుతం రామ్ చరణ్ బుచ్చిబాబు దర్శకత్వంలో తన 16వ సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమాకు మొదటించి భారీ అంచనాలు ఏర్పడ్డాయి. నేడు రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి అదిరిపోయే సర్ప్రైజ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్లకు పోస్టర్ విడుదలైంది. పోస్టర్ తో పాటు టైటిల్ని కూడా రివిల్ చేశారు. మరి ఆ టైటిల్ ఏంటి? పోస్టర్ ఎలా ఉందో? ఇప్పుడు మనం తెలుసుకుందాం.


రామ్ చరణ్ లుక్ అదిరిపోయింది..

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబు కాంబినేషన్లో సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. గ్రామీణ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్లో క్రికెట్ ప్రధానాంశంగా ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది.. ఈ సినిమా నుంచి రామ్ చరణ్ బర్త్ డే సర్ప్రైజ్ వచ్చేసింది. తాజాగా ఈ మూవీ టీం ఫస్ట్ లుక్ రివీల్ చేసింది. ‘పెద్ది’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో రామ్ చరణ్ తన స్టైలిష్, ఇంటెన్స్ అవతార్‌లో కనిపించాడు, ఇది అభిమానుల్లో భారీ ఉత్సాహాన్ని రేకెత్తించింది.. రామ్ చరణ్ గడ్డంతో కూడిన రగ్గడ్ లుక్‌లో, గ్రామీణ నేపథ్యంలో చాలా పవర్ ఫుల్ గా కనిపిస్తున్నాడు.. ఈ మూవీ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతుంది.


Also Read : మెగా కోటకు మహరాజు.. తండ్రికి తగ్గ తనయుడే “రామ్ చరణ్ “..

గ్లింప్స్ ఎప్పుడంటే..? 

రామ్ చరణ్ నటించిన తన 16వ సినిమా ఫస్ట్ లుక్ ను తాజాగా మేకర్స్ రిలీజ్ చేశారు. మాస్ లుక్ లో రామ్ చరణ్ కనిపిస్తున్నాడు. ఈ పోస్టర్ రిలీజ్ అయిన కొద్ది నిమిషాల్లోనే ట్రెండ్ అవుతుంది. పోస్టర్ ని చూసిన అభిమానులు గ్లింప్స్ వీడియోను విడుదల చెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ నుంచి మరో అప్డేట్ ని రిలీజ్ చేస్తామని నిర్మాతలు చెబుతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై అత్యంత భారీ బడ్జెట్తో పాన్ ఇండియా లెవల్లో ‘పెద్ది’ మూవీ రూపొందుతుండగా.. మైసూర్, హైదరాబాద్లోని ఓ ఫేమస్ బూత్ బంగ్లాలో టీం షూటింగ్ చేసింది. తదుపరి షెడ్యూల్ ఢిల్లీలో జరిగనుందని సమాచారం. గ్రామీణ నేపథ్యంలో క్రికెట్ ప్రధానాంశంగా తెరకెక్కుతోన్న ఈ మూవీలో చరణ్ రోల్ ఎలా ఉంటుందో అని అటు రామ్ చరణ్ ఫాన్స్, ఇటు సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొత్తానికి రామ్ చరణ్ బర్త్ డే సర్ ప్రైజ్అదిరిపోయింది.. ఈ పోస్టరు సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేస్తుంది. ఈ సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే వచ్చే ఏడాది వరకు వెయిట్ చేయాల్సిందే.. ఈ మూవీ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో మరో మూవీ చేయనున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత బాలీవుడ్ లో ఓ సినిమా చేసే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి..

 

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×