Nani : రోజులు మారుతున్న కొద్దీ అభివృద్ధి జరుగుతూనే ఉంటుంది. కొన్నిసార్లు కొంత అభివృద్ధి, కొత్త కొత్త టెక్నాలజీ మనుషుల మధ్య దూరాన్ని పెంచుతుందని కూడా చెప్పాలి. మొబైల్స్ లేని రోజుల్లో ఫ్రెండ్స్ అందరూ కలిసి మాట్లాడుకునే వాళ్ళు. ఏదైనా చెప్పాలంటే డైరెక్ట్ గా ఫ్రెండ్ ఇంటికి వెళ్లే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు మొబైల్ వచ్చే కాబట్టి డైరెక్ట్ గా ఫోన్ చేసి ఎక్కడైనా కలవాలంటే ప్లేస్ చెప్పేసుకుంటాం. ఇకపోతే వాట్సప్ వచ్చిన తర్వాత కొన్ని పనులు చాలా ఈజీ అయిపోయాయి. చాలామంది వాట్సాప్‌లో గ్రూప్స్ క్రియేట్ చేయడం మొదలుపెట్టారు. అయితే సామాన్యమైన జనాలు మాత్రమే కాకుండా సెలబ్రిటీలు కూడా వాట్సాప్ గ్రూపులో మెయింటైన్ చేసేవాళ్ళు. ముఖ్యంగా తెలుగు హీరోల అందరికీ కూడా ఒక వాట్సాప్ గ్రూప్ ఉండేది. దానిలో దాదాపు 143 మంది ఉండేవారట.
పాన్ ఇండియా హీరోల వాట్సాప్ గ్రూప్
ఎస్.ఎస్ రాజమౌళి బాహుబలి సినిమా తెరకెక్కించిన తర్వాత తెలుగు సినిమా రూపురేఖలు మారిపోయాయి. ఇప్పుడు ప్రస్తుతం ప్రతి హీరో కూడా పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలు చేస్తున్నారు. ఇక నాని నటిస్తున్న హిట్ 3 సినిమా మే 1న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ తరుణంలో పలు ప్రాంతాల్లో నాని ఇంటర్వ్యూస్ ఇస్తున్నాడు. ప్రతి ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు బయటకు వస్తున్నాయి.
రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన హీరోలు అంతా కూడా ఒక వాట్సాప్ గ్రూపులో ఉండేవాళ్ళట. అయితే ఆ గ్రూపులో రానా దగ్గుపాటి, ప్రభాస్, అల్లు అర్జున్, మంచు లక్ష్మి ఇలా చాలామంది ఆ గ్రూపులో ఉండేవారు. ఇదంతా జరిగి దాదాపు పది సంవత్సరాలు అవుతుంది. అయితే ఇప్పుడు ఆ గ్రూప్ యాక్టివ్ లో లేదు. చాలామంది వాళ్ల ఫోన్ నెంబర్స్ మార్చేశారు. అయితే ఆ గ్రూపును నాని మ్యూట్ లో పెట్టాను అని ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.
Also Read : Lalithaa jewellery Kiran Kumar : నేను మహానటి సావిత్రమ్మకు ఆ మాట చెప్పాను
వరుస హిట్ సినిమాలు
నాని విషయానికొస్తే జెర్సీ సినిమా తర్వాత నాని ఎంచుకున్న ప్రతి సినిమా కథ కూడా వైవిద్యంగా ఉంటుంది. కేవలం హీరో గానే కాకుండా నిర్మాతగా కూడా సినిమాలు చేస్తూ తనకంటూ ఒక స్టాండర్డ్ ఏర్పాటు చేసుకున్నాడు. చాలామంది కొత్త దర్శకులను తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి అందించే ప్రయత్నాలు చేస్తున్నాడు నాని. నాని నటిస్తున్న హిట్ 3 సినిమా పైన అందరికీ విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఇదివరకే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ మరియు టీజర్ చాలా ఇంప్రెస్సివ్ గా అనిపించాయి. ముఖ్యంగా యాక్షన్ ఫిలిమ్స్ ఇష్టపడే వాళ్లకు ఈ సినిమా విపరీతంగా నచ్చే అవకాశం ఉంది.