RC16: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan).. రాజమౌళి(Rajamouli )దర్శకత్వంలో వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో ఏకంగా గ్లోబల్ స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకున్నారు. ఈ సినిమా తీసుకొచ్చిన క్రేజ్ తో కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ (Shankar) దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ (Game Changer) సినిమా చేసి భారీ డిజాస్టర్ ను చవిచూశారు. ఈ నేపథ్యంలోనే ఈసారి ఎలాగైనా సరే మంచి సక్సెస్ అందుకోవాలనే కసితో ‘ఉప్పెన’ సినిమాతో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ప్రముఖ డైరెక్టర్ సుకుమార్(Sukumar ) శిష్యుడు బుచ్చిబాబు సనా (Bucchibabu Sana) రెండవ సినిమాకే అవకాశం కల్పించారు రామ్ చరణ్ . ముఖ్యంగా సుకుమార్ పైన ఉన్న నమ్మకంతోనే ఆయన బుచ్చిబాబుకి అవకాశం ఇచ్చారని సమాచారం.బుచ్చిబాబు కూడా రామ్ చరణ్ ను చాలా సరికొత్తగా చూపించాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే.
పోస్టర్ పై నెగిటివిటీ.. డైరెక్టర్ కి క్లాస్ పీకిన రామ్ చరణ్..
ఆర్ సి 16 అనే వర్కింగ్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమాకి ‘పెద్ది’ అని టైటిల్ ని కూడా ఫిక్స్ చేశారు. ఇకపోతే ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్ (Janhvi Kapoor)హీరోయిన్గా నటిస్తోంది. ఆర్ సి 16 సినిమా అనౌన్స్ చేశారు కానీ ఈ సినిమా నుండి అప్డేట్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోని నిన్న అనగా మార్చి 27వ తేదీన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు కావడంతో సినిమా నుండి ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్ ను అలాగే టైటిల్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇకపోతే ఫస్ట్ లుక్ పోస్టర్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తూ ఉండగా.. మొదటి పోస్టరే విమర్శలకు దారితీసింది .ఎన్నో అంచనాలు పెట్టుకున్న అభిమానులకు ఈ ఒక్క పోస్టర్ పూర్తిస్థాయిలో నిరాశ మిగిల్చింది. ముఖ్యంగా ఈ పోస్టర్ లో రామ్ చరణ్ (Ram Charan) పుష్పరాజ్(Pushpa Raj) గెటప్ లో కనిపించారని పూర్తిస్థాయిలో విమర్శలు వచ్చాయి. అసలే డిజాస్టర్ తర్వాత ఎన్నో అంచనాల మధ్య సినిమా చేస్తున్నారు. ఇలాంటి సమయంలో బర్తడే సందర్భంగా సినిమా నుండి రిలీజ్ చేసిన ఫస్ట్ పోస్టర్ పైనే విమర్శలు రావడంతో ఫైర్ అయిన రామ్ చరణ్ డైరెక్టర్ బుచ్చిబాబుకు క్లాస్ పీకినట్లు సమాచారం.
Samantha: సక్సెస్ అంటే విజయం కాదు.. ఏం కోల్పోయానో అప్పుడే తెలిసింది అంటున్న సమంత..?
ఇకపై ప్రతీదీ నా చేతుల్లోనే అంటున్న రామ్ చరణ్..
అంతేకాదు నిన్న పోస్టర్ పై నెగిటివిటీ ఏర్పడడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఇకపై సినిమా నుండి ఏది రిలీజ్ చేసినా చూసి చేయాలి. ప్రతీదీ నేను చూసి ఓకే చేసిన తర్వాతనే సోషల్ మీడియాలో విడుదల చేయాలి అంటూ బుచ్చి బాబుకు రామ్ చరణ్ చెప్పినట్లు సమాచారం. ముఖ్యంగా జడ్జిమెంట్ విషయంలో ఆచితూచి అడుగులు వేసే రామ్ చరణ్ ఇలా తొలిసారి మొదటి పోస్టర్ తోనే విమర్శలు ఎదుర్కోవడంతో.. ఈ ప్రభావం సినిమాపై పడే అవకాశం ఉందని, అందులో భాగంగానే.. తన సినిమా గురించి పక్కా ప్రణాళికతో ఇకపై.. అన్నీ తన చేతుల మీదుగానే జరిగేలా చూడాలని బుచ్చి బాబుకు చెప్పారట రామ్ చరణ్. ఇక ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మరి ఇకనైనా పెద్ది నుంచి విడుదల చేసే పోస్టర్లు, పాటలు, గ్లింప్స్ ను ఎంత జాగ్రత్తతో విడుదల చేస్తారో..? ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటాయో చూడాలి.