BigTV English

Metro Rail in Bangkok: భూకంపానికి రైలు ఎలా ఊగిపోయిందో చూశారా? గుండె దడ పుట్టించే వీడియో!

Metro Rail in Bangkok: భూకంపానికి రైలు ఎలా ఊగిపోయిందో చూశారా? గుండె దడ పుట్టించే వీడియో!

రెండు వరుస భూకంపాలు మయన్మార్‌, బ్యాంకాక్ లో అల్లకల్లోలం సృష్టించాయి. 7.4, 6.4 తీవ్రతతో వచ్చిన భూకంపాల ధాటికి జనాలు భయంతో ఇళ్లు, ఆఫీస్ లు వదిలి బయటకు పరుగులు తీశారు. మరోవైపు భారీ భవంతులు కళ్లముందే కుప్పకూలాయి. షాపింగ్ మాల్స్, రెస్టారెంట్లలో ఉన్న జనాలు భయంతో బయటకు వచ్చేశారు. భూకంపం ధాటికి మయన్మార్, బ్యాంకాక్ లో పవర్ సరఫరా నిలిచిపోయింది. జనాలు రోడ్ల మీద పరిగెత్తే విజువల్స్ తో పాటు బహుల అంతస్తుల భవనాలు కూలే విజువల్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఇక బ్యాంకాక్ మెట్రో స్టేషన్ లో భూకంపం ధాటికి రైలు ఊగిపోతున్న దృశ్యాలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.


బొమ్మలా ఊగిపోయినమెట్రో ట్రైన్..

భూకంపం ధాటికి బ్యాంకాక్ లోని ఓ మెట్రో స్టేషన్ లో ఆగి ఉన్న రైలు ఊగిపోతూ కనిపించింది. టన్నుల కొద్ది బరువు ఉండే మెట్రో రైరై బొమ్మ రైలులా కదిలింది. మెట్రో రైలు అలా ఊడడాన్ని చూసి అందరూ షాక్ అవుతున్నారు.  మెట్రో స్టేషన్ లో ఉన్న ప్రయాణీకులు భయంతో ఒకరి చేతులు మరొకరు పట్టుకుని నిలబడ్డారు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని కాసేపు అలాగే నిల్చున్నారు. రైలు ఊగిన విధానాన్ని చూస్తుంటే భూకంపం తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.


భయంతో ఎయిర్ పోర్టు రన్ మీద పడుకున్న ప్రయాణీకులు

ఇక బ్యాంకాక్ లో విమానం ఎక్కేందుకు ప్రయాణీకులు వెళ్తుండగా భూకంపం సంభవించింది. ఒక్కసారి వాళ్లంతా భయంతో వణిపోయి రన్ వే మీదే పడుకున్నారు. సుమారు 1.30 నిమిషాల పాటు అలాగే పడుకున్నారు. భూకంపం తీవ్రత ధాటికి విమానాలు పేక ముక్కల్లా కదులుతూ కనిపించాయి. ఈ విజువల్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

భవంతుల మీది నుంచి ఒలికిపోయిన స్విమ్మింగ్  పూల్స్ నీళ్లు

భారీ భూకంపం ధాటిక బ్యాంకాక్ లోనే పెద్ద భవంతులు ఊగిపోయాయి. ఈ నేపథ్యంలో ఆయా భవంతుల మీద నిర్మించిన స్విమ్మింగ్ పూల్స్ నుంచి నీళ్లు బయటకు ఒలికిపోతూ జలపాతాలను తలపించాయి. స్టార్ హోటళ్లు సహా ఇతర నివాస సముదాయాల మీది నుంచి నీళ్లు కిందపడ్డాయి. భవాల మీది నుంచి నీళ్లు కింద పడుతున్న విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

అటు భారీ భూకంపాల నేపథ్యంలో మయన్మార్ లో భారీ భవంతులు కూలి ఇప్పటి వరకు 20 మందికి పైగా చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. వందల సంఖ్యలో గాయపడ్డారు. శిథిలాల కింద చిక్కుకున్న క్షతగాత్రులను రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అటు థాయ్ లాండ్ లో అత్యవసర పరిస్థితి విధిస్తున్నట్లు ఆదేశ ప్రధాని వెల్లడించారు.

Read Also: మయన్మార్, బ్యాంకాక్ లో భారీ భూకంపం, 15 మంది మృతి, వందల మందికి గాయాలు

Related News

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Big Stories

×