Ram Charan : ఏంటి… బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కూమార్.. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కలిసి సినిమా చేయబోతున్నారా..? ఇప్పుడు ఇది బీ టౌన్‌తో పాటు తెలుగు సినీ ఇండస్ట్రీలో కూడా చెక్కర్లు కొడుతున్న వార్త. దీనికి కారణం అక్షయ్ కుమార్ నటిస్తున్న ఓ సినిమా సెట్స్‌లో రామ్ చరణ్ కనిపించడమే. వీరు ఇద్దరు ఒకే సెట్స్ పై కనిపించడంతో ఈ మల్టీస్టారర్ వార్తలు పుట్టుకొచ్చాయి. మరి అందులో ఎంత వరకు నిజం ఉందో చూద్దాం…
రామ్ చరణ్ ప్రస్తుతం RC16 మూవీ బిజీలో ఉన్నారు. బుచ్చిబాబు దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. దీని తర్వాత సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ మూవీ ఉంటుంది. ఇదింత పక్కన పెడితే… రామ్ చరణ్ తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో నటస్తున్న మూవీ సెట్స్ లో కనిపించాడు. వరుస డిజాస్టర్లతో ఐరన్ లెగ్ హీరోగా మారిపోయిన అక్షయ్ కుమార్ తో కనిపించాడు.
ప్రస్తుతం అక్షయ్ కుమార్ బాలీవుడ్ లో ‘భూత్ బంగ్లా’ అనే మూవీలో నటిస్తున్నాడు. హర్రర్ కామెడీ జానర్ లో వస్తున్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం రాజస్థాన్‌లో జరుగుతుంది. దీనికి ప్రియదర్శన్ డైరెక్టర్. హర్రర్ కామెడీ జానర్ లో వస్తున్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం రాజస్థాన్‌లో జరుగుతుంది. ఈ మూవీ షూటింగ్ జరుగుతున్న సెట్స్‌లో అక్షయ్ కుమార్ తో రామ్ చరణ్ కనిపించాడు. దానికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అక్షయ్ కుమార్, డైరెక్టర్ ప్రియదర్శన్ పక్కనే రామ్ చరణ్ ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అనేక వార్తలు క్రియేట్ అయ్యాయి. ఈ భూత్ బంగ్లా మూవీలో అక్షయ్ కుమార్ తో గెస్ట్ గా కనిపించబోతున్నాడా..? లేదా… ఇంకా ఏదైనా మల్టీస్టారర్ మూవీ చర్చల కోసం అక్కడికి వచ్చాడా అంటూ నెటిజన్లు నుంచి ప్రశ్నలు వస్తున్నాయి.
బాబోయ్ వద్దు అంటున్న ఫ్యాన్స్…
అక్షయ్ కుమార్ స్టార్ హీరోనే. కానీ, ఆయన ఈ మధ్య కాలంలో చేస్తున్న సినిమాలన్నీ కూడా బిగ్గెస్ట్ డిజాస్టర్లు అవుతున్నాయి. దీంతో బాలీవుడ్ అక్షయ్ కుమార్ డిజాస్టర్ హీరోగా మారిపోయాడు. అలాంటి హీరోతో మల్టీ స్టారర్ మూవీ అంటే… మెగా ఫ్యాన్స్ బాబోయ్ వద్దు అని అంటున్నారు. ఆయనతో సినిమా చేస్తే రామ్ చరణ్ కే నష్టం జరుగుతుందని అంటూ వాపోతున్నారు.
క్లారిటీ రావాల్సి ఉంది…
భూత్ బంగ్లా సెట్స్ లో రామ్ చరణ్ కనిపించడంపై ఎన్ని వార్తలు వస్తున్నా… మూవీ టీం నుంచి మాత్రం ఎలాంటి క్లారిటీ లేదు. ఇప్పటి వరకు వస్తున్న గాసిప్స్ ప్రకారం… అక్షయ్ కుమార్ నటిస్తున్న భూత్ బంగ్లా మూవీలో రామ్ చరణ్ గెస్ట్ రోల్ అంటే పర్లేదు కానీ, ఇద్దరు కలిసి ఒక మల్టీస్టారర్ మూవీ చేస్తేనే ప్రాబ్లం అని మెగా ఫ్యాన్స్ అంటున్నారు. రామ్ చరణ్ రెడీ అంటే చేయడానికి చాలా మంది స్టార్లు మల్టీ స్టారర్ చేయడానికి ఉన్నారని అంటున్నారు. అంతే కానీ, అక్షయ్ కుమార్ తో మల్టీస్టారర్ వద్దే వద్దు అని చెబుతున్నారు.