Anaganaga Australia lo Movie Review: ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరూ కూడా సినిమా తీసి పాపులారిటీ సంపాదించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. అలా కొత్త వారు ఎక్కువగా ఇండస్ట్రీలోకి వచ్చి సినిమాలు రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే. మరి ప్రమోషన్స్ లోపమో లేక వారి గురించి తెలియకనో తెలియదు కానీ ఆ సినిమాలు మాత్రం రిలీజ్ అవుతున్నాయి కానీ పూర్తిగా రీచ్ అవడం లేదు. కానీ కొంతమేర ప్రమోషన్స్ చేసి పబ్లిక్ లోకి వెళితే ఆ సినిమాలకు మంచి ఆదరణ కూడా లభిస్తోంది. ఇంకొన్ని సినిమాలు మాత్రం సినిమా పూర్తయ్యాక విడుదల చేయాలి కాబట్టే సినిమాను విడుదల చేస్తున్నారు. దీనికి తోడు ఈ మార్చి నెల మూడవ వారం పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలేవి విడుదల కావడం లేదు. ఈ క్రమంలోనే చిన్న సినిమాలు రిలీజ్ అయ్యి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.అలా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘అనగనగా ఆస్ట్రేలియాలో’. మరి ఈ సినిమా ఎంతవరకు ప్రేక్షకులను ఆకట్టుకుందో చూద్దాం..
కథ..
సహన ఆర్ట్స్ క్రియేషన్స్ పై డీ.టీ.ఆర్ శ్రీనివాస్ నిర్మించిన ఈ చిత్రంలో జ్యోతినాథ్ గౌడ్, సాన్య భట్నాగర్, జెడిఆర్ చెరుకూరి, రిషి ప్రధాన పాత్రలో నటించగా.. చంద్రశేఖర్ కొమ్మాలపాటి, ప్రభ అగ్రజా కీలకపాత్రలు పోషించారు తారకరామా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఈ సినిమాలో హీరో ఒక క్యాబ్ డ్రైవర్ గా హ్యాపీగా, సింపుల్ గా జీవితాన్ని లీడ్ చేస్తూ ఉంటాడు. మరొకవైపు హీరోయిన్ తన చదువు కోసం చిన్న చిన్న అసైన్మెంట్స్ రాసి, డబ్బులు సంపాదిస్తూ.. అలా వచ్చిన డబ్బుతో ఫీజులు కడుతూ చదువుకుంటూ వుంటుంది. ఇక అదే సమయంలో ఒక రాజకీయ నేత,తన కొడుకుని రాజకీయాల్లోకి తీసుకురావాలని ప్రయత్నం చేస్తాడు. కానీ ఒక రహస్యం కారణంగా అది వీలుపడదు. దాంతో రహస్యాన్ని వెతికి తీయడానికి ఒక క్రిమినల్ ని కూడా హైర్ చేస్తారు. ఇక అదే సమయంలో ఒకరోజు హీరోయిన్ తన అసైన్మెంట్ డబ్బులు తీసుకోవడానికి, ఒక వ్యక్తి రూమ్ కి వెళ్తే పొరపాటున ఆ క్రిమినల్ రూమ్ లోకి వెళ్లి అక్కడ చిన్నగా కొన్ని సామాన్లను కూడా ఆమె దొంగలిస్తుంది. ఇక అసలు విషయం ఏమిటంటే.. ఆ రూమ్ లోనే అతి పెద్ద స్కాం నడుస్తూ ఉంటుంది. తెలియకుండానే ఆ క్రిమినల్ కేసులో ఆమె కూడా ఇరుక్కుంటుంది. ఇక తర్వాత ఆ క్రిమినల్ కేస్ నుండి ఆమె ఎలా బయటపడింది..? రాజకీయ నేత కొడుకు పాలిటిక్స్ ఎంట్రీకి అడ్డుగా మారిన ఆ రహస్యం ఏమిటి? ఆ రహస్యాన్ని ఎవరు చేధించారు? అనే ఉత్కంఠ భరితమైన అంశాలతో ఈ సినిమా కథను చాలా అద్భుతంగా తెరకెక్కించారు.
విశ్లేషణ:
ఈ సినిమా పూర్తి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో కామెడీ, రొమాన్స్, స్కాం, బ్యాక్ డ్రాప్ ఇలా అన్ని కోణాలలో బ్యాలెన్స్ చేస్తూ కథ సాగుతుంది. ఇక క్లైమాక్స్ ఆడియన్స్ కూడా ఊహించి ఉండరు. మ్యూజిక్, స్క్రీన్ ప్లే, నటీనటుల నటన అన్ని కూడా సినిమాకు పునాదిగా మారాయి.
ఇక సినిమా ఫస్ట్ హాఫ్ లో కామెడీ ట్రాక్ ఆడియన్స్ ను కడుపుబ్బా నవ్విస్తుంది. ముఖ్యంగా ఆ రహస్యాన్ని వెతికే ఇద్దరు వ్యక్తుల మధ్య సాగే కామెడీ సినిమాకే హైలెట్. అలాగే ఈ క్రిమినల్ కేసులో హీరోయిన్ ఎలా చిక్కుకుంది? అనే విషయం సస్పెన్స్ గా మార్చారు. ఇక హీరో ఎంట్రీ అయితే హీరోయిన్ తన ప్రాణాల కోసం పరుగు తీయగా అనుకోకుండా హీరోని కలుస్తుంది.అలా ఈ అంశాలు ఆడియన్స్ కి ఒక కొత్త అనుభూతిని కలిగిస్తాయి.
హీరో తన ఊరి అభివృద్ధి కోసం మంచి పనులు చేస్తూ.. ఒక స్కూల్ కూడా కట్టాలని డబ్బు కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అయితే హీరోయిన్ దగ్గర చాలా పెద్ద మొత్తంలో డబ్బు ఉన్నా.. అది ప్రమాదకరమైన డబ్బు కావడంతో తీసుకోవాలా? వద్దా? రిస్కు ఎందుకు అనే కన్ఫ్యూజన్లో కూడా పడిపోతాడు. చివరికి ఇది దొంగ డబ్బే కదా.. మంచి పనికి ఉపయోగిద్దాం అనుకొని ప్లాన్ మొదలు పెడతాడు. అలా హీరో కూడా ఆ స్కామ్ లో ఇరుక్కుంటాడు. ఆ డబ్బుతో స్కూల్ కట్టించలేక దేశం వదిలి వెళ్ళిపోవాలనుకుంటాడు. సడన్ ట్విస్ట్ అప్పుడే మొదలవుతుంది. ఆ డబ్బులు ఎవరో ఎత్తుకెళ్లిపోతారు..
ఇక క్లైమాక్స్ విషయానికి వస్తే అసలు సీక్రెట్ అప్పుడే బయటకు వస్తుంది. హీరోయిన్ దొంగలించిన వస్తువులలో ఒక మెమొరీ కార్డు వుంటుంది. అందులో అతిపెద్ద స్కాంకి చెంది వీడియో ఉంటుంది. ఆ పొలిటిషన్ కొడుకు నిజంగా ఎవరో తెలుసుకొని దాన్ని బ్రోకర్ కి అమ్మి డబ్బు తీసుకుంటారు. కానీ చివరికి ఆ డబ్బు కూడా స్కామ్ అవుతుంది. చివరికి హీరో ,హీరోయిన్ చేతిలో ఏమీ మిగలదు. కానీ హీరో మాత్రం ప్లాన్ చేసి మరీ ఆ డబ్బు తిరిగి తెచ్చుకుంటాడు. ఇలా స్టోరీ కూడా ఒక ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ తో ముగిస్తుంది.
ప్లస్ పాయింట్స్ :
హీరో హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ
కొన్ని ట్విస్ట్‌లు
క్లైమాక్స్
మైనస్ పాయింట్స్..
కథలో లాజిక్ లేకపోవడం
చివరిగా.. మంచి స్కామ్ థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడే వారికి.. ఈ సినిమా ఒక కొత్త అనుభూతిని అందిస్తుంది. ముఖ్యంగా వినోదాన్ని ఆస్వాదించాలి అనుకుంటే మాత్రం ఈ సినిమా ఖచ్చితంగా చూడాల్సిందే.
Anaganaga Australia lo Movie Rating : 2.25/5