Ram Charan about Game Changer : టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ (Ram Charan) సంక్రాంతి సందర్భంగా తన అభిమానులకు శుభాకాంక్షలు తెలుపుతూ ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఇందులో భాగంగా గేమ్ ఛేంజర్ (Game Changer) సినిమాను ఇంతలా సక్సెస్ చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు.
మెగా పవర్ స్టార్ రాంచరణ్ హీరోగా వచ్చిన గేమ్ ఛేంజర్ (Game Changer) సినిమా ఎంత హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్దలు కొడుతుంది. ఇక ఈ విజయంపై రాంచరణ్ తన అభిమానుల్ని ఉద్దేశించి ఇన్టాగ్రామ్ వేదికగా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు.
ఈ సంక్రాంతి తనకు ఎంతో ప్రత్యేకమని.. తాను ఎంతో కష్టపడి తీసిన గేమ్ ఛేంజర్ సినిమా సక్సెస్ కావటం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. ఈ సినిమా కోసం కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెబుతూ.. డైరెక్టర్ కు స్పెషల్ థ్యాంక్స్ చెప్పారు. ఇక మీడియాకు సైతం ప్రత్యేకంగా థాంక్స్ చెప్పిన రామ్ చరణ్… తన సినిమాను ఇంత సపోర్ట్ చేసి సక్సెస్ చేసినందుకు సంతోషంగా ఉందన్నారు. ఈ సక్సెస్ లో మీడియా ఎంతో కీలకమైన పాత్ర పోషించిందని తెలిపారు.
2025 కు ఎంతో ఆనందంగా వెల్కమ్ చెప్పామని.. ఇక నుంచి తన పర్ఫామెన్స్ మరింతగా మెరుగుపరుచుకుంటూ ఫ్యాన్స్ గర్వపడేలా సినిమాలు తీస్తానని హామీ ఇచ్చారు. గేమ్ ఛేంజర్ తనకి ఎప్పుడూ ఓ ప్రత్యేకమైన సినిమాయోనని.. తన మనసులో ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకుందని తెలిపారు. తనపై ఇంత అభిమానం చూపిస్తున్న ఫ్యాన్స్ కు మరోసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ.. ఈ సంవత్సరం నుంచి తన ఫ్యాన్స్ కు మరింత మంచి జరగాలని కోరుకుంటున్నానని వెల్లడించారు.
గేమ్ ఛేంజర్ 2025 సంక్రాంతి కానుకగా రిలీజైన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్. ఈ సినిమా జనవరి 10న గ్రాండ్ గా విడుదలైంది. శ్రీవెంకటేశ్వరా క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు నిర్మించిన ఈ సినిమాకు ఎస్. శంకర్ దర్శకత్వం వహించారు. రామ్ చరణ్, కియారా అద్వాణి, ఎస్.జె.సూర్య, సునీల్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఎస్.ఎస్. థమన్ సంగీతం అందించారు. రూ.450 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా మెుదటి రోజే రూ.180 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు తెలుస్తుంది.
ఈ ఏడాది సంక్రాంతికి బాక్స్ ఆఫీస్ వద్ద స్టార్ హీరోల సినిమాలు ఎన్నో సందడి చేశాయి. ఇంకా హిందీలో పుష్ప 2 హవా ఇంకా తగ్గలేదు.. నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన డాకు మహారాజ్.. గేమ్ ఛేంజర్ కు గట్టి పోటీ ఇచ్చింది. ఇక ఈ రోజు విక్టరీ వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా సైతం రిలీజ్ అయింది. వీటి వసూళ్లు సైతం గేమ్ ఛేంజర్ వసూళ్లను ప్రభావితం చేసే ఛాన్స్ కనిపిస్తుంది.
ALSO READ : బాలయ్య టైటిల్ పెట్టుకున్నంత ఈజీ కాదు శర్వా.. ఆయనలా హిట్ కొట్టడం