BigTV English
Advertisement

Nari Nari Naduma Murari: బాలయ్య టైటిల్ పెట్టుకున్నంత ఈజీ కాదు శర్వా.. ఆయనలా హిట్ కొట్టడం

Nari Nari Naduma Murari: బాలయ్య టైటిల్ పెట్టుకున్నంత ఈజీ కాదు శర్వా.. ఆయనలా హిట్ కొట్టడం

Nari Nari Naduma Murari: టాలీవుడ్ యంగ్  హీరోల్లో శర్వానంద్ ఒకరు.  గత కొంతకాలంగా శర్వాకు సరైన హిట్ లేదు అని చెప్పాలి. గతేడాది వచ్చిన మనమే సినిమా కూడా శర్వాకు హిట్ ను ఇచ్చింది లేదు. ఇక ఈసారి ఎలాగైనా  శర్వా హిట్ కొట్టాలని  కంకణం కట్టుకున్నట్లు కనిపిస్తుంది. జాను సమయంలో ఒక ప్రమాదం కారణంగా బరువు పెరిగిన శర్వా.. ఇప్పుడు బరువు తగ్గి ఎంతో అందంగా తయారయ్యాడు.


ఈ మధ్య సినిమాలతో ప్రేక్షకులను అలరించలేకపోయినా.. అన్ స్టాపబుల్ షోలో సందడి చేసి ప్రేక్షకులను అలరించాడు. ప్రస్తుతం ఈ కుర్ర హీరో చేతిలో వరుస సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి  శర్వా37.  రామ్ అబ్బరాజు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఏకే  ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర  నిర్మిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో శర్వా సరసన సంయుక్త మీనన్, సాక్షి వైద్య నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన  పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఒక వారం నుంచి ఈ సినిమా టైటిల్ పై సోషల్ మీడియాలో వార్తలు వైరల్ గా మారాయి.

బాలయ్య  నటించిన హిట్ సినిమా టైటిల్ తో శర్వా వస్తున్నట్లు చెప్పుకొచ్చారు. దీంతో బాలయ్య  సినిమ పేర్లు ఫ్యాన్స్ వెతకడం మొదలుపెట్టారు. అయితే ఆ వెతుకులాటకు ఫుల్ స్టాప్ పెడుతూ నేడు సంక్రాంతి పండగను పురస్కరించుకొని మేకర్స్  అధికారికంగా శర్వా37 టైటిల్ ను రిలీజ్ చేశారు.


Daaku Maharaj: లక్కీ ఛాన్స్ కొట్టేసిన బాలయ్య హీరోయిన్.!

శర్వా హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు నారీ నారీ నడుమ మురారీ అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు మేకర్స్ తెలిపారు. బాలకృష్ణ, శోభన, నిరోషా హీరో హీరోయిన్లుగా నటించిన నారీ నారీ నడుమ మురారీ  ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ముఖ్యంగా ఇరువురు భామల కౌగిలిలో స్వామి , ఇరుకున పడి నీవు నలిగితివా అనే సాంగ్ ఇప్పటికీ చాలామందికి ఫేవరేట్ గా నిలిచింది. ఇక ఇప్పుడు  ఆ సాంగ్ నే  పోస్టర్ తో పాటు క్యాప్షన్ గా రాసుకొచ్చారు. ఇక పోస్టర్ లో శర్వా కూడా ఇరువురు భామల మధ్యలో  నలుగుతూ కనిపించాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది.  బాలయ్య టైటిల్ తోనే శర్వా ఈ సినిమాపై ఒక పాజిటివ్ వైబ్ ను తీసుకొచ్చాడు.

డైరెక్టర్ రామ్ అబ్బరాజు.. ఇప్పటికే వివాహ భోజనంబు, సామజవరగమనా అలాంటి కామెడీ  ఎంటర్ టైనర్స్ ఇవ్వడంతో ఈ సినిమాపై మరింత హైప్ క్రియేట్ అయ్యింది. ఇంకోపక్క బాలయ్య ఫ్యాన్స్ సైతం శర్వాకు సపోర్ట్ ఇస్తున్నారు. ఇంకొంతమంది మాత్రం.. టైటిల్ పెట్టడం కాదు.. మంచి కంటెంట్ కూడా ఉండాలి. బాలయ్య టైటిల్ పెట్టుకున్నంత ఈజీ కాదు శర్వా.. ఆయనలా హిట్ కొట్టడం అని చెప్పుకొస్తున్నారు. మరి శర్వా .. ఈసారి ఎలాంటి హిట్ ను అందుకుంటాడో చూడాలి.

Related News

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Mouli: పోలీస్ గెటప్ లో అదరగొట్టేసిన లిటిల్ హార్ట్స్ హీరో.. ఇదిగో వీడియో!

Sree Leela: శ్రీలీల 150 కోట్ల యాడ్ ఫిలిం టీజర్ చూశారా..ఏంటి స్వామీ ఈ అరాచకం!

Influencer Bhavani Ram : కన్నీళ్లు తెప్పిస్తున్న ఇన్‌ఫ్లుయెన్సర్ భవాని స్టోరీ… అప్పుడు ట్రోల్ చేశారు.. ఇప్పుడు సంపాదన ఎంతంటే?

Big Stories

×