BigTV English

Hyderabad Numaish 2025 : చేతి దొంగలు, పాత నేరస్తులని ఈ కెమెరాలు ఇట్టే పట్టేస్తాయి. నుమాయిష్‌లో పోలీసుల పకడ్భందీ చర్యలు

Hyderabad Numaish 2025 : చేతి దొంగలు, పాత నేరస్తులని ఈ కెమెరాలు ఇట్టే పట్టేస్తాయి. నుమాయిష్‌లో పోలీసుల పకడ్భందీ చర్యలు

Hyderabad Numaish 2025 : నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో భారీ ఎత్తున నిర్వహిస్తున్న నుమాయిష్ కార్యక్రమానికి రోజూ వేల సంఖ్యలో సందర్శకులు పోటెత్తుతున్నారు. దేశవ్యాప్తంగా వివిధ సంస్థలు, వివిధ రంగాలకు చెందిన స్టాళ్లు ఒకే దగ్గర కొలువుదీరడంతో.. ప్రజలు ఉత్సాహంగా ఈ వేడుకకు వస్తున్నారు. కొన్ని స్టాళ్ల దగ్గర జనం ఎక్కువగా గుమ్మిగూడుతుండగా.. మీ పని మీది, మా పని మాది అన్నట్లు రెచ్చిపోతున్నారు జేబుదొంగలు. సందర్శకుల జేబులను తెలియకుండానే చిల్లులు వేస్తూ దోచుకుంటున్నారు. దీంతో నుమాయిష్ పై పోలీసులు గట్టిగా ఏర్పాటు చేశారు.


రోజు వేల మంది వచ్చే సందర్శకుల భద్రతకు పకడ్బందీ చర్యలు చేపట్టిన పోలీసులు.. ప్రతిరోజూ ముగ్గురు ఏసీపీలు, 9 మంది ఇన్స్పెక్టర్లతో భద్రతా చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. వీరికి తోడుగా పెద్ద సంఖ్యలో కానిస్టేబుళ్లు, ఇతర పోలీసు సిబ్బంది, బాంబు స్కాడ్ బృందాలు బందోబస్తు నిర్వహిస్తున్నాయి.

ఇక్కడ ఏర్పాటు చేసిన 2500 కి పైగా స్టాళ్లల్లో దేశ విదేశాలకు చెందిన ఉత్పత్తు కొలువుదిరాయి. అన్ని రకాల వస్తువులు ఒకే దగ్గర దొరుకుతుండటంతో.. నుమాయిష్ కు మంచి స్పందన లభిస్తుంటుంది. పైగా ఇప్పుడు సంక్రాంతి సెలవులు కావడంతో సందర్శకుల తాకిడి.. రోజుకు లక్ష మంది వరకు ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దొంగల కట్టడికి మైదాన ప్రాంగణంలోనే పోలీస్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు.


మైదానంలోని స్టాళ్ల ప్రవేశ, నిష్క్రమణ మార్గాల దగ్గర ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఎప్పటికప్పుడు ఈ కేంద్రం ద్వారా పరిశీలిస్తున్నారు. ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను పరిశీలించిన అబిడ్స్ ఏసిపి చంద్రశేఖర్, బేగం బజార్ ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్… దొంగలు, ఆకతాయిలతో పాటు చిల్లర దొంగతనాలకు పాల్పడే అవకాశం ఉండటంతో మఫ్టీలో పోలీసు బృందాలని రంగాల్లోకి దింపారు. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి వచ్చే మహిళల భద్రత కోసం ప్రత్యేక చర్యలు చేపట్టారు. మైదానంలోనే స్టాళ్ల దగ్గర ఆడవారితో అసభ్యకరంగా ప్రవర్తించే ఆకతాయిల పని పట్టేందుకు పదికి పైగా షీ టీమ్స్ బృందాలను కేటాయించినట్లు షీ టీమ్స్ డిఎస్పీ లావణ్య జాదవ్ నాయక్ వెల్లడించారు.

భార్యా పిల్లలతో వస్తున్న కొంతమంది మగవాళ్లు.. గుంపులో తమను ఎవరు గుర్తించరనే ఉద్దేశంతో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ షీ టీమ్స్ కెమెరాలుకు చిక్కుతున్నారు . సోమవారం ఒక్కరోజే దాదాపు పది మంది ఆకుతాయిలు, నలుగురు జేబు దొంగలు పోలీసులకు చిక్కారు.

Also Read :  నెరవేరిన ఇందూరు రైతుల కల.. ఫైనల్‌గా పసుపు బోర్డును సాధించారు..

ఎంట్రీ గేట్ దగ్గర వచ్చే సందర్శకులతో కలిసిపోయి లోపలికి ప్రవేశించే పాత నేరస్తులను సీసీ టీవీ కెమెరా ఫుటేజ్ ల ద్వారా క్రైమ్ టీం ప్రత్యేకంగా పరిశీలిస్తోంది. పాత నేరస్తులను గుర్తిస్తే వెంటనే వారిని అక్కడ నుంచి బయటకు పంపించేందుకు పోలీసులు సాంకేతికత సాయాన్ని తీసుకుంటున్నారు. వీరితో పాటే చిల్లర దొంగతనాలకు పాల్పడేందుకు ప్రయత్నిస్తున్న వారిని గుర్తిస్తున్నారు. స్టాల్స్ ని సందర్శించేందుకు వచ్చే వారిని ఎవరన్నా బెదిరించినా, ఇబ్బందులకు గురి చేసిన డయల్ 100 కు ఫోన్ చేయాలని ఏసిపి చంద్రశేఖర్ సందర్శకలకు సూచించారు.

Related News

Rakhi Festival: తమ్ముడికి రాఖీ కట్టేందుకు సాహసం చేసిన అక్క.. 20 అడుగుల ఎత్తున్న రైల్వే బ్రిడ్జి గోడపై నుంచి..?

MLA Mallareddy: రాజకీయాలకు గుడ్ బై.. బిగ్ బాంబ్ పేల్చేసిన మల్లారెడ్డి.. అసలేమైంది..?

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Big Stories

×