Ram Charan Remuneration : ఇప్పుడు హీరోల రెమ్యునరేషన్ గురించి మాట్లాడితే నిర్మాతలకు చెమటలు పడుతాయి. సినిమా హిట్ అవుతుందా..? ఫట్ అవుతుందా అనేది పక్కన పెట్టి రెమ్యునరేషన్ లెక్కలు ముందు మాట్లాడుతారు కొంత మంది హీరోలు. కానీ, మెగాస్టార్ చిరంజీవి మాత్రం చాలా డిఫరెంట్. సినిమా అయ్యాకా.. నిర్మాతలకు వచ్చే నష్టాలు.. లాభాలు ఆధారంగా తన రెమ్యునరేషన్ ను ఫిక్స్ చేసుకుంటాడు. అవసరమైతే తన రెమ్యునరేషన్‌ను తగ్గించుకుంటాడు. లేకపోతే తిరిగి ఇచ్చేస్తాడు. అందుకే ఆయనను మెగాస్టార్, ఇండస్ట్రీ పెద్ద అని అంటారు. ఇప్పుడు అదే సంప్రదాయాన్ని ఆయన కొడుకు మెగా పవర్ స్టార్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కొనసాగిస్తున్నాడు.
ప్రస్తుతం రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ మూవీ రెమ్యునరేషన్ పై తీసుకున్న నిర్ణయం చూసి మెగా ఫ్యాన్స్ మాత్రమే కాదు… సాధారణ ఆడియన్స్ కూడా సలాం కొడుతున్నారు. ఇంతకీ రామ్ చరణ్ ఏం నిర్ణయం తీసుకున్నాడు అనేది ఇప్పుడు చూద్ధాం…
గేమ్ ఛేంజర్ మూవీ… నిజానికి ఈ మూవీ ఎప్పుడో రిలీజ్ కావాల్సింది. కానీ, ఇండియన్ 2, & 3 తో పాటు మరికొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. దీని వల్ల 150 నుంచి 200 కోట్ల బడ్జెట్‌లో క్లోజ్ కావాల్సిన సినిమా ఇప్పుడు 400 నుంచి 450 కోట్ల భారీ బడ్జెట్‌కి చేరిపోయింది.
దిల్ రాజు కెరీర్‌లో ఇదే భారీ బడ్జెట్ మూవీ. ఇప్పటి వరకు ఎన్నో సినిమాలను నిర్మించిన దిల్ రాజు, ఇలాంటి సాహసం ఎప్పుడూ చేయలేదు. ఈ నేపథ్యంలో నిర్మాతకు భారం కాకుండా… రామ్ చరణ్ ఓ నిర్ణయం తీసుకున్నారట. సినిమా స్టార్టింగ్ టైంలో అందరు టైర్ 1 హీరోల్లా… భారీ రెమ్యునరేషన్ కోసం ఒప్పందం చేసుకున్నారట.
కానీ, సినిమా ఖర్చులు పెరగడం, అనుకున్న డేట్ కి రాకపోవడం, ఎక్కువ సార్లు వాయిదా పడటం ఇలా అన్నింటి వల్ల బడ్జెట్ దిల్ రాజుకు తలకు మించిన భారంగా మారిపోయిందని, రామ్ చరణ్ తన రెమ్యునరేషన్‌ను తగ్గించుకోవాలని నిర్ణయం తీసుకున్నాడట.
అది కూడా సినిమా షూటింగ్ మొత్తం పూర్తి అయిన తర్వాతే… నిర్మాతకు భారం కాకుండా… తన రెమ్యునరేషన్ ఉండాలని అనుకున్నాడట. అలా ముందు అనుకున్న రెమ్యునరేషన్ కంటే దాదాపు 25 నుంచి 30 కోట్ల వరకు తక్కువ తీసుకున్నట్టు తెలుస్తుంది.
అలాగే డైరెక్టర్ శంకర్ కూడా రామ్ చరణ్ బాటలోనే నడిచి ప్రొడ్యూసర్ దిల్ రాజుకు భారం కాకుండా చూశారట. ఆయాన గతంలో చేసుకున్న ఒప్పందం కంటే ఇప్పుడు దాదాపు 15 నుంచి 20 కోట్ల వరకు తక్కువ పారితోషికం తీసుకున్నట్టు టాక్ నడుస్తుంది.
నిజానికి గేమ్ ఛేంజర్ మూవీ బడ్జెట్ ముందుగా 200 కోట్ల కంటే ఎక్కువ కాకపోవచ్చని శంకర్, రామ్ చరణ్, దిల్ రాజు అనుకున్నారట. కానీ, సినిమా అవుట్ పుట్ లో ఎక్కడా తగ్గకుండా, క్వాలిటీగా తీయడంతోపాటు చాలా సార్లు మూవీ వాయిదా పడటం కూడా బడ్జెట్ పెరగడానికి కారణమైంది.
ఏది ఏమైనా ఇప్పటి వరకు సినిమాపై ఫుల్ పాజిటివ్ టాక్ వస్తుంది. కోలీవుడ్ నుంచి వస్తున్న టాక్ కానీ, ఇక్కడ సినిమా చూసిన చిరంజీవి, సుకుమార్ కానీ, సినిమాపై ఫుల్ పాజిటివ్ గా చెబుతున్నారు. దీంతో సినిమాపై రోజు రోజుకు హైప్ భారీగా పెరుగుతుంది. అలాగే ఈ రోజు సాయంత్రం మూవీ నుంచి ట్రైలర్ కూడా రాబోతుంది. ఈ ట్రైలర్ ఇంకాస్త పాజిటివిటీని క్రియేట్ చేస్తే భారీ స్థాయిలో ఓపెనింగ్స్ రావడం పక్కా…