Chops Off Tongue Superstition| ఛత్తీస్ గడ్ లో ఒక షాకింగ్ ఘటన జరిగింది. ఒక బాలిక తన నాలుకను తనే నరికేసుకుంది. ఊరి బయట ఉన్న గుడి లోపలికి వెళ్లి తన నాలుకను నరికేసుకుంది. ఆ తరువాత గుడిలోపలికి వెళ్లి తలుపులు వేసుకొంది. ఎవరైనా లోపలికి వస్తే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. ఈ ఘటన ఛత్తీస్ గడ్ లోని సక్తి జిల్లాలోని ఓ గ్రామంలో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. శక్తి జిల్లా దేవర్‌ఘాటా గ్రామానికి చెందిన ఒక 17 ఏళ్ల బాలిక ఇంటర్‌మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుకుంటోంది. ఆమె గత కొన్ని రోజులుగా ఊరి పొలిమేరలో ఉన్న శివాలయానికి గత కొన్ని రోజులుగా వెళుతోంది. ప్రతి రోజు శివలింగం ముందు కూర్చొని పూజలు చేస్తోంది.
అయితే వారం రోజుల క్రితం ఆమ దేవాలయానికి వెళ్లి.. అందరూ చూస్తుండగా.. తన నాలుకను తనే నరికేసుకుంది. గుడిలో ఆ సమయంలో ఉన్నవారంతా ఇది చూసి షాకయ్యారు. నోటి నుంచి రక్తం కారుతున్నా ఆ బాలిక మాత్రం నడుచుకుంటూ శివలింగం వద్దకు లోపలికి వెళ్లిపోయిది. ఆ తరువాత లోపలి నుంచి తలుపులు లాక్ చేసుకుంటూ తన గొంతపై కత్తి పెట్టి బెదిరిస్తూ.. లోపలికి ఎవరైనా వస్తే తాను ఆత్మహత్య చేసుకుంటానని బెదరించింది.
Also Read: ప్రియురాలి పగ.. పథకం వేసి ప్రియుడి ఆ భాగం కోసేసిన యువతి..
ఇది చూసి అక్కడున్న కొందరు భక్తులు పోలీసులు, ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని ఆమెను బయటికి తీసుకురావాలని ప్రయత్నించగా.. గ్రామస్తులు పోలీసులను అడ్డుకున్నారు. లోపల ఆమె ధ్యానం చేస్తోందని.. ఎవరూ అడ్డుపడకూడదని వాదించారు. ఇంతో ఆమె తల్లిదండ్రులు కూడా అక్కడికి చేరుకొని ఆమెను బయటికి రావాల్సిందిగా కోరారు. కానీ ఆమె తన రక్తంతో ఒక లెటర్ రాసి బయటకు విసిరింది. తనను పోలీసులు కానీ, తల్లిదండ్రలు కానీ ధ్యానభంగం చేస్తే.. ఒకరి ప్రాణాలు కోల్పోతారని ఆ లెటర్ లో రాసింది. మరోసారి రెండో లెటర్ కూడా అలాగే రాసింది. అందులో తనకు తో
పోలీసులు పరిస్థితిని అదుపు చేయడానికి అక్కడికి ఆంబులెన్స్ పిలిపించారు. రోజంతా అలాగే గడిచింది. ఆ తరువాత రాత్రి ఆ బాలిక స్పృహ కోల్పోయి పడి ఉండడంతో పోలీసులు, భక్తులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. శక్తి జిల్లా ఎస్‌పి అంకిత శర్మ్ ఈ ఘటన గురించి మీడియాతో మాట్లాడుతూ.. “మూఢనమ్మకంతో ఒక 17 ఏళ్ల బాలిక తన కోరిక నెరవేరేందుకు మహాశివుడికి తన నాలుక కోసి అర్పించింది. ఆమె భక్తిని గ్రమస్తులు సమర్థించారు. పోలీసులు ఆమె ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నిస్తే అడ్డుపడ్డారు. అయితే ఆమెను కాపాడేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. ప్రస్తుతం ఆ బాలికకు ప్రాణాపాయం లేదు. ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటోంది. అయితే భోజనం తినేందుకు ఇబ్బంది పడుతోంది. ” అని చెప్పారు.
ఇలాంటిదే ఒక ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. అక్కడ మోరెనా జిల్లా తార్సామా గ్రామంలోని దుర్గా మాత గుడిలో ఒక 45 ఏళ్ల మహిళ పూజలు చేస్తూ.. తన నాలుకను తనే నరికేసుకుంది. ఈ ఘటన 2018లో జరిగింది. ఆ మహిళకు భర్త, ముగ్గురు పిల్లలున్నారు. అయితే ఆమెను వెంటనే గుడి యజమాన్యం ఆస్పత్రికి తరలించింది. తన భార్య దుర్గా మాతకు అపర భక్తు రాలని.. మాత మెప్పుకోసం తన నాలుకను అర్పించుకుందని ఆమె భర్త అన్నాడు.