Sobhita Dhulipala: శోభితా ధూళిపాళ్ల.. ఒకప్పుడు అంటే ఈ పేరు చాలామందికి తెలిసింది లేదు. కానీ ఇప్పుడు శోభితా అంటే టక్కున అక్కినేని కోడలు అని చెప్పుకొచ్చేస్తున్నారు. గతేడాది అక్కినేని నాగ చైతన్యతో శోభితా వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. చై, సామ్ తో విడిపోయాక ఒక పక్క కెరీర్ ను చూసుకుంటూనే ఇంకోపక్క కొత్త జీవితానికి పునాదులు వేసుకున్నాడు. శోభితాతో డేటింగ్ చేసిన రెండేళ్ల తరువాత ఇరు వర్గాల కుటుంబ సభ్యులను ఒప్పించి డిసెంబర్ 4 న అన్నపూర్ణ స్టూడియోస్ లో శోభితా మెడలో మూడు ముళ్ళు వేశాడు చై.
పెళ్లి తరువాత శోభితాలో చాలా మార్పు వచ్చింది. అంతకుముందు నిత్యం హాట్ హాట్ ఫొటోస్ తో కుర్రకారుకు కునుకు లేకుండా చేసిన ఈ భామ.. అక్కినేని కోడలిగా మారాకా గృహిణిగా సెటిల్ అయ్యినట్లు కనిపిస్తుంది. ప్రస్తుతం ఆమె చేతిలో సినిమాలు కూడా ఏమి లేవు. ఇంట గెలిచి రచ్చ గెలవాలి అని చెప్పిన పెద్దల సామెతను శోభిత తిరిగి రాసింది. ఎంత తెనాలి అమ్మాయి అయినా తన కెరీర్ ను బాలీవుడ్ నుంచి మొదలుపెట్టి టాలీవుడ్ కు వచ్చింది. బాలీవుడ్ లో అమ్మడు నటించిన సినిమాలు, యాడ్స్ ఏ రేంజ్ లో ఉండేవో అందరికి తెల్సిందే.
నిర్మాతగా సుకుమార్ తెరకెక్కించిన సినిమాలు.. అన్నీ డిఫరెంట్ అంతే.!
తెలుగులో ఈ చిన్నది గూఢచారి అనే సినిమాతో పరిచయమైంది. ఆ సినిమాలో కూడా ఒక ప్రత్యేక పాత్రలోనే ఆమె కనిపించింది. ఇక ఆ తరువాత మేజర్ లో అలా మెరిసి ఇలా వెళ్ళిపోయింది. ఇక చై – శోభితాలమధ్య ప్రేమ ఎప్పుడు మొదలయ్యింది అనేది వారికి మాత్రమే తెలిసిన విషయం. ఇక ఈ సంగతి పక్కన పెడితే .. తాజాగా అక్కినేని హీరో సుశాంత్ తన కజిన్స్ తో కలిసి దిగిన ఒక ఫోటోను అభిమానులతో షేర్ చేసుకున్నాడు.
అక్కినేని వారసులందరూ ఈ ఫొటోలో కనిపించారు. చై, సుమంత్, సుశాంత్, సుప్రియతో పాటు అక్కినేని కొత్త కోడలు శోభితా కూడా సందడి చేసింది. టేబుల్ మీద గిఫ్ట్స్ ను బట్టి ఇదేదో ఒక అకేషన్ లా అనిపిస్తుంది. అయితే న్యూయర్ సెలబ్రేషన్స్ కానీ, లేదా ఎవరిదైనా బర్త్ డే పార్టీ కానీ అయ్యి ఉంటుందని చెప్పుకొస్తున్నారు. ఇందులో చై, సుశాంత్ వింటర్ జాకెట్స్ వేసుకొని కనిపించగా.. శోభితా స్లీవ్ లెస్ టాప్ తో నవ్వుతూ దర్శనమిచ్చింది. ఇంకోపక్క సుమంత్ కూడా మంచి క్లాస్ లుక్ లో కనిపించాడు.
Fake Collections : ఒకరిని మించి ఒకరు… టాలీవుడ్ లో ఫేక్ కలెక్షన్స్ ట్రెండ్
ఫోటో అంతా బానే ఉంది కానీ ఒకటి తక్కువయ్యింది అని అభిమానులు చెప్పుకొస్తున్నారు. అక్కినేని కజిన్స్ మొత్తం ఉన్నారు కానీ, అఖిల్ మాత్రం ఫొటోలో మిస్ అయ్యాడు. అయ్యగారు లేని ఫోటో అక్కినేని కుటుంబం అనిపించుకోదు అని పెదవి విరుస్తున్నారు. మా అయ్యగారు , అమ్మగారు కూడా ఉండి ఉంటే ఫోటో అదిరిపోయేది అని చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. ఇకపోతే శోభితా పెళ్లి తరువాత సినిమాలు చేస్తుందో లేదో చూడాలి.