IND vs SA 2nd T20i: టీమిండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మధ్య ఇవాళ రెండో టి20 మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ రెండో టి20 మ్యాచ్ లో… టాస్ గెలిచిన సౌత్ ఆఫ్రికా… మళ్లీ బౌలింగ్ ఎంచుకుంది. ఈ తరుణంలో… మరోసారి మొదట బ్యాటింగ్ చేయనుంది టీమిండియా. మొన్న మొదటి టి20 మ్యాచ్ రాత్రి 8:30 గంటలకు ప్రారంభమైంది.
అయితే రెండో టి20 మాత్రం… గంట ముందే ప్రారంభం కానుంది. ఇవాళ రాత్రి 7:30 గంటలకు.. మ్యాచ్ ప్రారంభమవుతుంది. కాగా ఇప్పటికే సౌత్ ఆఫ్రికా పై జరిగిన మొదటి టి20 మ్యాచ్ లో టీమిండియా విజయం సాధించింది.
భారత్ (ప్లేయింగ్ XI): సంజు శాంసన్(w), అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్(c), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, రవి బిష్ణోయ్, వరుణ్ చకరవర్తి, అవేష్ ఖాన్
దక్షిణాఫ్రికా (ప్లేయింగ్ XI): ర్యాన్ రికెల్టన్, రీజా హెండ్రిక్స్, ఐడెన్ మార్క్రామ్(సి), ట్రిస్టన్ స్టబ్స్, హెన్రిచ్ క్లాసెన్(w), డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, ఆండిల్ సిమెలనే, గెరాల్డ్ కోయెట్జీ, కేశవ్ మహరాజ్, న్కాబయోమ్జి పీటర్